E-Paper
Advertisement

Sita Ramam 2: సీతారామం 2 రాబోతోందా? సీక్వెల్ పై అంచనాలు పెంచిన ఫోటో!

Sita Ramam 2: సీతారామం 2 రాబోతోందా? సీక్వెల్  పై అంచనాలు పెంచిన ఫోటో!
Advertisement

Sita Ramam 2: డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్(Dulquer Salman), మృణాళ్ ఠాకూర్(Mrunal Thakur) హీరో హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అద్భుతమైన ప్రేమ కథ చిత్రం సీతారామం (Sitaramam). 2022వ సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా ద్వారా సీత పాత్రలో మృణాళ్ ప్రేక్షకుల ముందుకు వచ్చి సీతగా తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు. ఇక ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమా క్లైమాక్స్ విషయానికి వస్తే ప్రతి ఒక్కరు కంటతడి పెట్టించేలాగా ఉందని చెప్పాలి. అలాగే రామ్ బ్రతికి వస్తే బాగుండని , సీక్వెల్ సినిమా వస్తే బాగుంటుందని అప్పట్లో చాలామంది వారి అభిప్రాయాలను తెలిపారు.

సీతారామం సీక్వెల్ ఉంటుందా?

ఇక ప్రేక్షకులు కూడా ఈ సినిమా సీక్వెల్ కోసం ఎంతో ఆత్రుత కనబరుస్తున్నారనే చెప్పాలి. ఇలా గతంలో సీతా రామం సీక్వల్ గురించి ప్రశ్నలు ఎదురవడంతో దర్శకుడు సీక్వెల్ సినిమా లేదంటూ క్లారిటీ ఇచ్చారు అయితే తాజాగా సోషల్ మీడియాలో మృణాళ్ ఠాకూర్ , దుల్కర్ సల్మాన్ కు సంబంధించిన ఒక ఫోటో వైరల్ అవ్వడంతో సీక్వెల్ సినిమాపై పెద్ద ఎత్తున అంచనాలు పెరిగిపోతున్నాయి.

అంచనాలు పెంచిన ఫోటో..

Advertisement

ఈ ఫోటోలో భాగంగా మృణాళ్ గొడుగు పట్టుకోవడంతో గొడుగు కింద వీరిద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ ఉన్న ఈ ఫోటో అచ్చం సీతారామం సినిమాని తలపిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా సీక్వెల్ కోసమే అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ఇటీవల ఓ కొత్త సినిమా పనుల కోసం మృణాళ్ హైదరాబాద్ రావడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఇలా ఈ సినిమా సీక్వెల్ గురించి వార్తలు వస్తున్నప్పటికీ చిత్ర బృందం నుంచి లేదా నటీనటుల నుంచి ఏ విధమైనటువంటి స్పష్టత లేకపోవడంతో అభిమానులు కూడా ఎన్నో సందేహాలను వ్యక్తం చేస్తున్నారు

ఫౌజీ పనులలో హను రాఘవపూడి…

Advertisement

ఇక ఈ ఫోటో వైరల్ గా మారడంతో నిజంగానే సీతారామం సీక్వెల్ ఉండబోతుందా? రామ్ మళ్లీ తిరిగి రాబోతున్నారా? అంటూ ఎన్నో సందేహాలను తెలియజేస్తున్నారు. మరి ఈ సందేహాలకు స్పష్టత రావాలి అంటే చిత్ర బృందం నుంచి అధికారక ప్రకటన వెలువడే వరకు ఎదురు చూడాలి. ఇక ఈ సినిమా విషయంలో నిర్మాతలు స్వప్న దత్ అశ్విని దత్ కూడా మౌనం వహించడ గమనార్హం. సీతారామం లాంటి సూపర్ క్లాసిక్ లవ్ స్టోరీకి సీక్వెల్ వస్తే బాగుంటుందని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. మరి అభిమానుల కోరికను హనురాగపూడి నెరవేరుస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. డైరెక్టర్ హను రాఘవపూడి ప్రస్తుతం ప్రభాస్ తో ఫౌజీ సినిమా పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

Also Read: Nagarjuna: కింగ్ 100 మూవీలో టబు… ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన నాగార్జున..

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×