E-Paper
Advertisement

Blinkit: బ్లింకిట్ సరికొత్త కార్డు.. ఇది ఉంటే టికెట్లతో పనిలేదు, జస్ట్ రూ.50తో హాయిగా తిరిగేయొచ్చు!

Blinkit: బ్లింకిట్ సరికొత్త కార్డు.. ఇది ఉంటే టికెట్లతో పనిలేదు, జస్ట్ రూ.50తో హాయిగా తిరిగేయొచ్చు!
Advertisement

Blinkit: ప్రతిరోజూ కాలేజీ, ఆఫీసులకు వెళ్లేవారు మెట్రోలు, బస్సుల్లోనే ఎక్కువగా ప్రయాణిస్తుంటారు. అలాంటి వారి కోసం బ్లింకిట్ గుడ్ న్యూస్ చెప్పింది. మెట్రో స్టేషన్లు, బస్సుల్లో చిల్లర కోసం వెతకడం, క్యూ లైన్లలో గంటల తరబడి నిలబడటం వంటి ఇబ్బందులకు చెక్ పెడుతూ ‘భారత్ యాత్ర కార్డ్’ను లాంచ్ చేసింది. కేవలం రూ.50కే ఈ కార్డును ఇంటికే డెలివరీ చేస్తోంది. సాధారణంగా కిరాణా సామాన్లు డెలివరీ చేసే బ్లింకిట్.. ఇప్పుడు ప్రయాణికుల కష్టాలను తీర్చేందుకు ఈ అడుగు వేయడం నిజంగా అభినందనీయం.

ఈ కార్డ్ ప్రత్యేకతలేమిటి?

ఈ కార్డు నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్(NCMC) విధానంలో పనిచేస్తుంది. అంటే.. ఇది RuPay ఆధారిత నెట్‌వర్క్‌పై నడుస్తుందన్నమాట. బ్లింకిట్ దీనికోసం పైన్ ల్యాబ్స్‌తో జతకట్టింది. ఈ కార్డులోని ప్రత్యేకత ఏంటంటే.. దీనికి ఎలాంటి KYC పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదు. కార్డు ఆర్డర్ చేసిన తర్వాత, అది మీ చేతికి అందగానే వాడటం మొదలుపెట్టొచ్చు. ఇలాంటి సింపుల్ ప్రాసెస్ వలన ఈ కార్డ్ సామాన్యులకు బాగా చేరువయ్యే అవకాశం ఉంది.

Advertisement

Also Read: వాట్సాప్‌లో కొత్త ‘లాక్‌డౌన్’ ఫీచర్.. ఈ ఒక్క సెట్టింగ్ మార్చుకోకుంటే మీ అకౌంట్ రిస్క్‌లో పడ్డట్టే!

రీఛార్జ్ చేయడం సులభం:

సాధారణంగా ఇలాంటి కార్డులు రీఛార్జ్ చేయాలంటే మెట్రో స్టేషన్లలోని కౌంటర్ల వద్దకు వెళ్లాల్సి ఉండేది. కానీ భారత్ యాత్ర కార్డును మీ మొబైల్‌లోని UPI ద్వారా సెకెండ్స్‌లో టాప్‌అప్ చేసుకోవచ్చు. డిజిటల్‌గా డబ్బులు లోడ్ చేయడం వల్ల ఎక్కడపడితే అక్కడ ప్రయాణానికి ఈ కార్డ్‌ను వాడుకోవచ్చు. ఒక్కసారి కార్డు స్వైప్ చేస్తే చాలు.. మీ ప్రయాణం సాఫీగా సాగిపోతుంది.

ఒక్క కార్డు.. దేశమంతా చుట్టేయొచ్చు:

Advertisement

భారత్ యాత్ర కార్డ్ ఉన్న ప్రయాణికులకు ఉన్న పెద్ద ప్రయోజనం ఏమిటంటే.. మీరు ఏ సిటీకి వెళ్లినా వేర్వేరు కార్డులు కొనాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఢిల్లీ NCR, బెంగళూరు, ముంబై, చెన్నై, అహ్మదాబాద్ వంటి నగరాల్లో బ్లింకిట్ ఈ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఎక్కడైతే NCMC సపోర్ట్ ఉంటుందో.. అక్కడల్లా ఈ కార్డు పనిచేస్తుంది. బ్లింకిట్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ప్రయాణాలు మరింత సులభతరం కానున్నాయి.

భారత్ యాత్ర కార్డ్ ప్రయోజనాలు:

* ప్రయాణ సమయంలో అత్యవసరం అనిపించే ఫిజికల్ గిఫ్ట్ కార్డ్‌లను 10 నిమిషాల్లో ఇంటికి లేదా మీరున్న చోటికి డెలివరీ చేస్తారు.

* ఈ కార్డ్ ద్వారా గూగుల్ మ్యాప్స్ సేవలకు లేదా సంబంధిత ప్రయాణ ఖర్చులకు డిజిటల్ పేమెంట్లు చేసుకోవచ్చు.

* లాంగ్ జర్నీలను ఇష్టపడే ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ లాస్ట్ మినిట్‌లో గిఫ్ట్స్‌గా ఇవ్వడానికి ఇదొక బెస్ట్ ఛాయిస్.

* టూరిస్ట్ ప్రదేశాల్లో ఉన్నప్పుడు లేదా కొత్త నగరాల్లో పర్యటించేటప్పుడు, ప్రయాణానికి సంబంధించిన సేవలను ఈ కార్డ్ ద్వారా పొందొచ్చు.

Also Read: ఫిబ్రవరిలో స్మార్ట్‌ఫోన్ల జాతర.. శాంసంగ్ నుంచి మోటో వరకు షేక్ చేయనున్న టాప్-5 మొబైల్స్!

 

Related News

ఒక్క టికెట్ చాలు.. 56 రోజుల పాటు రైల్లో దేశమంతా చుట్టేయొచ్చు!

భారత్‌లో మరో అద్భుతం.. సముద్ర గర్భంలో బుల్లెట్ ట్రైన్.. సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తున్న ఇండియా!

పాకిస్తాన్ లో జగన్నాథుడి రథయాత్ర.. చూసేందుకు రెండు కళ్లు చాలవనుకోండి!

వర్షాకాలంలో మాత్రమే పరుగులు తీసే హెరిటేజ్ రైలు.. ప్రకృతి ఒడిలో అద్భుత ప్రయాణం!

ఫ్యామిలీతో థీమ్ పార్క్ వెళ్లే మజానే వేరు.. ప్రపంచంలోని 8 బెస్ట్ థీమ్ పార్క్స్ ఇవే

‘మిర్చి’ సాంగ్ లోని ఈ ప్లేస్ గుర్తుందా? అది ఇప్పుడు ఘోస్ట్ టౌన్, జనాలంతా ఏమయ్యారు?

ట్రెక్కింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? దేశంలో సురక్షితమైన 7 అద్భుతమైన ట్రెక్కింగ్ ప్రాంతాలివే

ఈ తప్పులు చేస్తే తిరుమలలో రూమ్ దొరకదు.. టీటీడీ కొత్త గైడ్‌లైన్స్ ఇవే!

Big Stories

Advertisement
×