E-Paper
Advertisement

Jagan Tour: జగన్‌ని డ్యామేజ్ చేస్తున్న కేడర్.. ఈసారి కొత్తగా ఆ రెండు, టూర్ల వెనుక అసలు కథ ఇదేనా?

Jagan Tour: జగన్‌ని డ్యామేజ్ చేస్తున్న కేడర్.. ఈసారి కొత్తగా ఆ రెండు, టూర్ల వెనుక అసలు కథ ఇదేనా?
Advertisement

Jagan Tour: ఏపీ రాజకీయాల్లో మరోసారి జగన్ వ్యవహారం హాట్ టాపిక్ అయ్యిందా? జనం లేకుండా అధినేత బయటకు రావడం కష్టమా? అందుకే ఆయన వస్తున్నారంటే జనాన్ని కూడబెట్టేందుకు నేతలు నానాకష్టాలు పడుతున్నారా? గురువారం జగన్ భీమవరం పర్యటనలో ఏం జరిగింది? ఇంతకీ కేడర్‌ని రెచ్చగొడుతోంది ఎవరు? దీనివెనుక ఎవరున్నారు?

జగన్ భీమవరం టూర్‌లో కేడర్ అత్యుత్సాహం

Advertisement

పరామర్శ అయినా, పెళ్లి వేడుక ఒక్కటే వైసీపీకి ఒక్కటే. నిత్యం వందలాది మంది జనం కనపడాల్సిందే. జనం మధ్యలో జగన్ ఉండాల్సిందే. మాజీ సీఎం జగన్ ఎక్కడికెళ్లినా అదే రచ్చ.. అదే ఉత్సాహం.. అవే ఫెక్సీలు. సింపుల్‌గా చెప్పాలంటే ఆయన ఇమేజ్‌ని డ్యామేజ్ చేస్తున్నారు. ఇంతకీ గురువారం భీమవరం వచ్చారు మాజీ సీఎం జగన్.

మండలి చైర్మన్‌ మోషేన్‌ రాజు కొడుకు పెళ్లికి హాజరయ్యారు. కళ్యాణ వేదిక వద్దకు సెక్యూరిటీ అడ్డుకున్నా ఏ మాత్రం లెక్క చేయలేదు కార్యకర్తలు. చివరకు బారికేడ్లను నెట్టేసి కల్యాణ మండపంలోకి దూసుకెళ్లారు. పులివెందుల పులి, సీఎం జగన్‌ అంటూ మండపంలో జగన్‌ ఉన్నంత సేపు భారీగా నినాదాలు చేశారు.

Advertisement

ఎప్పటి మాదిరిగా ఇరుకైన రోడ్డలో దర్శనమిచ్చారు. కొందరు వైసీపీ హార్డ్‌కోర్ ఫ్యాన్స్ చేశారా? ఎవరైనా చేయించారో తెలీదు. కాకపోతే ఈసారి వెరైటీగా రెండు ఫెక్సీలు కనిపించాయి. ‘ ఆ కుర్చి పుట్టిందే ఆ కుటుంబం కోసం రా’, ‘మీరు సృష్టించే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నాము 2027-29’ అని రాసుంది.

ఈసారి ఫెక్సీలపై కొత్త రాతలు, షాకవుతున్న జనం

ఇంతకుముందు రప్పా.. రప్ఫా అంటూ ఉండేవి. ఈసారి కాస్త రూటు మార్చి..  కుర్చీ పుట్టింది ఆ కుటుంబం కోసం రా అని ఫెక్సీపై కనిపించడం కొత్త చర్చకు దారి తీసింది. ఫెక్సీలపై రాతలు నాయకులకు తెలియకుండా ఉండవని అంటున్నారు. కావాలనే వారు ఆ విధంగా చేయిస్తున్నారని వైసీపీలోని మరొక వర్గం బలంగా చెబుతోంది. భీమవరం టూర్‌లో ఎక్కువగా యూత్ కనిపించింది.

జనం లేకుండా జగన్ బయటకు రారని ఆ పార్టీ నేతలు సమయం వచ్చినప్పుడు ప్రత్యేకంగా చెబుతుంటారు. 2019లో తాము అధికారంలోకి వచ్చామంటే అదే కారణమని అంటున్నారు కూడా. ఇప్పుడూ అదే ట్రెండ్‌ని ఫాలో అవుతున్నారు. కాకపోతే జనాన్ని భయపెట్టేలా కొన్ని కటౌట్లను ప్రదర్శించడం చేస్తున్నారు. జగన్ ఏ ఊరు వెళ్లినా అలాంటి కటౌట్లు సాధారణమైపోయింది.

ALSO READ: దారుణం.. బతికుండగానే కూతురికి కర్మక్రియలు చేసిన తల్లిదండ్రులు

ఇలాంటి ఫెక్సీలను కావాలనే కొందరు నేతలు ఏర్పాటు చేయిస్తున్నారనే వాదన లేకపోలేదు. ఇటీవల జిల్లాలకు కొత్త అధ్యక్షులను ఎంపిక చేశారు. అధినేత ఎక్కడకు వెళ్లినా ఆ ఖర్చు అంతా జిల్లా అధ్యక్షుడు చూసుకోవాల్సిందేనట. భీమవరం జగన్ టూర్‌లో వైసీపీ కార్యకర్తలు కాకుండా దాదాపు 10 వేల మందిని యూత్‌ని రప్పించారట ఆ జిల్లా నేతలు.

ఒకొక్కరికీ 500 చొప్పున దాదాపు ఐదు లక్షలు ఖర్చు చేసినట్టు ఆ జిల్లా నేతల మాట. అదే పెద్ద నగరాల్లో అయితే ఆ ఖర్చు రెట్టింపు అవుతుందని అంటున్నారు. రానున్న మూడేళ్లలో జగన్ ఈ విధంగా తిరిగితే జిల్లా అధ్యక్షుల  ఖర్చు భారంగా మారుతుందని అంటున్నారు.  అధినేత రాక ఏమోగానీ.. ఖనాజా ఖాళీ అవుతోందని వాదన కొందరు నేతల నుంచి వినిపిస్తోంది.

Related News

పుంగనూరులో రణరంగంగా మారిన నామినేషన్ల కేంద్రం.. గాల్లోకి కాల్పులు జరిపిన డీఎస్పీ?

బెంగళూరు టూ విజయవాడ.. రూ. 11 లక్షల డ్రగ్స్‌తో దొరికిపోయిన విద్యార్థిని..?

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

ఏపీ స్థానిక పోరులో సీట్ల రచ్చ.. కూటమి హైకమాండ్‌ చర్యలు ఫలిస్తాయా..?

పుంగనూరు ఘటనపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం.. నామినేషన్ పత్రాలు చింపివేత!

ఓడిపోతామనే భయంతో కూటమి హింసా రాజకీయం.. మాజీ మంత్రి రోజా ఫైర్!

ఏపీలో పంచాయతీ రాజ్ చట్టం సవరణ.. ఇద్దరికంటే ఎక్కువ పిల్లలున్నా పోటీకి అర్హులే!

నామినేషన్ల తొలిరోజు సీమలో టెన్షన్.. రాయచోటిలో టీడీపీ-వైసీపీ మధ్య దాడులు, తగలబెట్టిన కార్లు

Big Stories

Advertisement
×