E-Paper
Advertisement

నెట్టింట వైరల్ అవుతున్న మృణాల్ ‘ఐస్‌క్రీమ్ రైస్’.. అంతలా అడిక్ట్ అయిపోయిందా?

నెట్టింట వైరల్ అవుతున్న మృణాల్ ‘ఐస్‌క్రీమ్ రైస్’.. అంతలా అడిక్ట్ అయిపోయిందా?
Advertisement

Mrunal Food :ఇది సోషల్ మీడియా జమానా..ఇక్కడ కాస్త క్రేజీగా ఏ విషయం కనిపించినా క్షణాల్లో వైరల్ అయిపోతోంది. ముఖ్యంగా సెలబ్రిటీల లైఫ్ స్టైల్, వారి అలవాట్లకు సంబంధించిన విషయాలైతే నెటిజన్లకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ .ఈ క్రమంలోనేతాజాగా టాలీవుడ్ అండ్ బాలీవుడ్ క్రేజీ బ్యూటీ మృణాల్ ఠాకూర్ సరికొత్త ఫుడ్ కాంబినేషన్‌తో వార్తల్లో నిలిచింది. సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ‘సీత’గా చెరగని ముద్ర వేసుకున్న ఈ ముద్దుగుమ్మ, ఆ తర్వాత నానితో కలిసి ‘హాయ్ నాన్న’ (2023), విజయ్ దేవరకొండతో ‘ది ఫ్యామిలీ స్టార్’ (2024) డెకాయిట్ (2026) వంటి చిత్రాలతో మంచి పేరే తెచ్చుకుంది.ఇక కేవలం సినిమాలే కాదండోయ్..సోషల్ మీడియాలో కూడా ఈ అమ్మడి యాక్టివిటీస్ ఫ్యాన్స్‌ని విపరీతంగా ఆకట్టుకుంటాయి కూడా. అయితే ఇప్పుడు మృణాల్ షేర్ చేసిన ఒక క్రేజీ సీక్రెట్ చూసి ఫ్యాన్స్ అంతా ముక్కున వేలేసుకుంటున్నారు.

ఇష్టమైన ఫుడ్ కాంబినేషన్ ఏంటో తెలుసా?

Advertisement

సాధారణంగా మనకు నచ్చిన ఫుడ్ కాంబినేషన్స్ వేరే వాళ్లకు వింతగా అనిపించవచ్చు. బిర్యానీలో థమ్సప్ కలుపుకుని తాగేవాళ్లు, చపాతీని టీలో ముంచుకుని తినేవాళ్లను మనం చూస్తూనే ఉంటాం. కానీ మృణాల్ ఠాకూర్ కి అలవాటైన ఫుడ్ కాంబినేషన్ వింటే మాత్రం ఎవరైనా సరే ఒక్క నిమిషం షాక్ అవ్వాల్సిందే. ఆమెకు అత్యంత ఇష్టమైన ఫుడ్ కాంబినేషన్ ఏంటో తెలుసా? వేడివేడి అన్నంలో ఐస్‌క్రీమ్ వేసుకుని తినడం! అవును, మీరు విన్నది నిజమే. వినడానికే చాలా వింతగా, అసలు ఊహించుకోవడానికే కాస్త కష్టంగా ఉన్న ఈ కాంబినేషన్‌ను మృణాల్ మాత్రం లొట్టలేసుకుంటూ తినేస్తుందట.

Advertisement

అసలు విషయం చెప్పేసిన మృణాల్ 

ఇంతకీ ఈ వింత అలవాటు ఆమెకు ఎలా మొదలైందో కూడా మృణాల్ ఒక ఇంటర్వ్యూలో సరదాగా పంచుకుంది. ఒకరోజు ఆమె స్నేహితుడు ఒకరు వేడి అన్నంలో ఐస్‌క్రీమ్ కలుపుకుని చాలా ఇష్టంగా తింటుండటం మృణాల్ గమనించింది. అసలు ఆ కాంబినేషన్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఆసక్తితో, కేవలం ఒక ప్రయోగంగా ఆమె కూడా దాన్ని రుచి చూసింది. అంతే, మొదటి ముద్దకే ఆ టేస్ట్‌కు మృణాల్ ఫిదా అయిపోయింది. మొదట్లో సరదాగా ట్రై చేసినా, ఇప్పుడు మాత్రం ఆ కాంబినేషన్‌కు పూర్తిగా అడిక్ట్ అయిపోయానని, తనకు బాగా ఆకలి వేసినప్పుడు లేదా క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఇలా అన్నంలో ఐస్‌క్రీమ్ వేసుకుని తినేస్తానని చాలా ఓపెన్‌గా చెప్పేసింది.

పెద్ద చర్చకే దారితీసిన ‘ఐస్‌క్రీమ్ రైస్’ కాంబినేషన్
ఈ విషయం బయటకు రావడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మృణాల్ ఫ్యాన్స్ కొందరు “నువ్వు ఏం చేసినా క్యూట్‌గానే ఉంటుంది, మేము కూడా ఈ కాంబినేషన్ ఒకసారి ట్రై చేస్తాం” అంటూ కామెంట్లు పెడుతుంటే, మరికొందరు ఫుడ్ లవర్స్ మాత్రం “బాబోయ్.. అన్నంలో ఐస్‌క్రీమా? ఇది ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నాం, ఫుడ్‌ను ఇలా కూడా ప్రయోగాలు చేస్తారా?” అంటూ తలలు పట్టుకుంటున్నారు. మొత్తానికి నెట్టింట్లో  ఈ ‘ఐస్‌క్రీమ్ రైస్’ కాంబినేషన్ పెద్ద చర్చకే దారితీసిందని చెప్పాలి.
ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ బాలీవుడ్‌తో పాటు సౌత్‌లోనూ క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. గతేడాది రిలీజ్ అయిన సినిమాల తర్వాత హై జవానీ తో ఇష్క్ హోనా హై,దో దీవానే సెహెర్ మే వంటి సినిమాలతో ఈ ఏడు మరోసారి పలకరించేందుకు రెడీ అయిపొయింది. ఒకవైపు గ్లామర్ రోల్స్ చేస్తూనే, మరోవైపు నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ దూసుకుపోతోంది.మొత్తానికి ఈ క్రేజీ కాంబినేషన్ తో  సెలెబ్రిటీల టెస్ట్స్ నిజంగానే డిఫరెంట్ గా ఉంటాయని మరోసారి ప్రూవ్ చేసింది మృణాల్ !
also read :అర్ధరాత్రి ఆ వీడియో డిలీట్ చేయడానికి కారణం అదే….. నిజం చెప్పేసిన బాలీవుడ్ బ్యూటీ!

Related News

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

Big Stories

Advertisement
×