E-Paper
Advertisement

Liam Livingstone: ఐపీఎల్ ప‌ర‌మ బోరింగ్ లీగ్..ప‌రువు తీసిన‌ SRH ప్లేయర్‌

Liam Livingstone: ఐపీఎల్ ప‌ర‌మ బోరింగ్ లీగ్..ప‌రువు తీసిన‌ SRH ప్లేయర్‌
Advertisement

Liam Livingstone:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) చాలా ఉత్కంఠ భరితంగా దాదాపు రెండు నెలల పాటు కొనసాగిన సంగతి తెలిసిందే. ఇందులో అద్భుతంగా రాణించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు… ఛాంపియన్ గా నిలిచింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం (Narendra Modi Stadium in Ahmedabad) వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగగా… గుజరాత్ ను ఓడించి మరి రెండోసారి ఛాంపియన్ అయింది బెంగళూరు. అయితే అలాంటి ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ లియామ్ లివింగ్ స్టోన్ (Liam Livingstone). ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ పరమ చెత్త లీగ్ అంటూ బాంబు పేల్చారు. ఐపీఎల్ చాలా బోరింగ్ గా మారిందని… బ్యాటర్లకు మాత్రమే సపోర్ట్ గా నిలిచే మైదానాలను సిద్ధం చేస్తున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇలా కొనసాగితే ఐపిఎల్ చూసేవాళ్ళు కరువు అవుతారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో లివింగ్ స్టోన్ చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి.

Also Read: Short Circuit, Smoke In Team Bus:  గుజ‌రాత్ బ‌స్సు ప్ర‌మాదం వెనుక RCB కుట్ర..వైర్లు క‌ట్ చేసింది కోహ్లీ ఫ్యాన్స్ అంటూ ఆరోప‌ణ‌లు ! 

ఐపీఎల్ ప‌ర‌మ బోరింగ్ లీగ్..ప‌రువు తీసిన‌ SRH ప్లేయర్‌

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో భారీ ధర పెట్టి కొనుగోలు చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు లివింగ్ స్టోన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ ద్వారా బతుకుతున్న లివింగ్ స్టోన్… ఈ టోర్నమెంట్ పైనే బురదజల్లే ప్రయత్నం చేశాడు. ఐపీఎల్ టోర్నమెంట్ పరమ బోరింగ్ అంటూ బాంబు పేల్చారు. అసలు ఐపిఎల్ అంటే మజా రావడం లేదని… మొత్తం బ్యాటింగ్ కు అనుకూలించే మైదానాలు సిద్ధం చేస్తున్నారని ఆరోపణలు చేశారు. మ్యాచ్ ప్రారంభమైన నుంచి చివరి వరకు సిక్సర్, బౌండరీలు తప్ప వేరే సినిమానే లేదని వివరించారు. కేవలం బ్యాట్స్మెన్ లకు అనుకూలంగా ఈ టోర్నమెంట్ కొనసాగుతోందని వెల్లడించారు. ముంబై ఇండియన్స్ వర్సెస్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా.. ఓ విషయాన్ని కూడా గుర్తు చేశారు లివింగ్ స్టోన్.

తాము 250 పరుగుల టార్గెట్ ను కూడా కేవలం 18 ఓవర్లలోనే ఫినిష్ చేసినట్లు గుర్తు చేశారు. ఆ మ్యాచ్ లో సిక్సర్లు, బౌండరీలు తెగ బాదేసారని.. హైదరాబాద్ ఆడే ప్రతి మ్యాచ్ ఒకే పిచ్ పైన ఉప్పల్లో నిర్వహించినట్లు వెల్లడించారు. అసలు అలా ఎందుకు చేశారో తనకు అర్థం కాలేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ లో ప్లేయర్లను కొనుగోలు చేసేటప్పుడు మూడు రకాలుగా యాజమాన్యాలు ఆలోచిస్తాయని వివరించారు. ఒకవేళ ముంబై ఇండియన్స్ ఒక ప్లేయర్ ను కావాలనుకుంటే.. హైదరాబాద్ దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే, అదే ప్లేయర్ కోసం పోటీ పడతారని ఆరోపణలు చేశారు. ముంబై ఇండియన్స్ కు దక్కకుండా, హైదరాబాద్ కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయని.. వేలంలో జరిగే విషయాలను వెల్లడించారు. 13 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన తనను కేవలం రిజర్వ్ బెంచ్ కు మాత్రమే పరిమితం చేసినట్లు వెల్లడించారు. ఏదైనా ప్లేయర్ కు గాయమైతే తప్ప తనకు అవకాశం రాదని ముందే చెప్పినట్లు పేర్కొన్నారు.

Advertisement

Also Read:  Inzamam-ul-Haq: ఇది ప‌క్కా ఫిక్సింగే.. కోహ్లీకి గుజ‌రాత్ బౌల‌ర్ల నెమ్మ‌దిగా బంతులు వేశారు Inzamam-ul-Haq !

 

 

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×