E-Paper
Advertisement

అర్ధరాత్రి ఆ వీడియో డిలీట్ చేయడానికి కారణం అదే….. నిజం చెప్పేసిన బాలీవుడ్ బ్యూటీ!

అర్ధరాత్రి ఆ వీడియో డిలీట్ చేయడానికి కారణం అదే….. నిజం చెప్పేసిన బాలీవుడ్ బ్యూటీ!
Advertisement

Nushrratt Controversy : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ నుష్రత్ బరుచా తన అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసిన ఒక చిన్న వీడియో నెట్టింట్లో మంటలు పుట్టించింది.విషయం లోకి వెళ్తే … మే 31వ తేదీ రాత్రి జరిగిన ఇంట్రెస్టింగ్ మ్యాచ్‌లో ఆర్‌సీబీ గెలిచిన ఆనందంలో ఆమె ఒక పోస్ట్ పెట్టింది.అయితే పెట్టిన ఆ పోస్ట్ లో ఉన్న వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపించిన కొన్ని శబ్దాలు అశ్లీలంగా ఉన్నాయంటూ కొందరు నెటిజన్లు నెగెటివ్ కామెంట్స్ చేయడంతో ఈ వ్యవహారం బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ వివాదంపై నుష్రత్ బరుచా అత్యంత ఘాటుగా స్పందిస్తూ అసలు నిజాన్ని ఆధారాలతో సహా బయటపెట్టి ట్రోలర్స్ నోళ్లు మూయించారు.

కుక్క పిల్ల (పప్పి) చేసిన శబ్దాలనే అశ్లీల శబ్దాలుగా
తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ వేదికగా సుదీర్ఘ వివరణ ఇచ్చిన నుష్రత్, నెటిజన్ల పై ఫైర్ అయింది. మే 31 రాత్రి తాను తన ఫ్రెండ్ ఇంట్లో RCB మ్యాచ్‌ను చూస్తూ ఎంజాయ్ చేశానని ఆమె స్పష్టం చేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఒక చిన్న పెంపుడు కుక్క పిల్ల (పప్పి) చేసిన శబ్దాలను కొందరు నెటిజన్లు తమ వంకర బుద్ధితో అశ్లీల శబ్దాలుగా చిత్రీకరించారని మండిపడ్డారు.

Advertisement


కేవలం మాటలతోనే సరిపెట్టకుండా, అదే సమయంలో అదే శబ్దాలతో వేరే యాంగిల్ నుండి తన స్నేహితురాలు రికార్డ్ చేసిన మరో వీడియోను కూడా ఎవిడెన్స్ గా షేర్ చేసింది. అందులో ఆ కుక్క పిల్ల ఏడుస్తూ చేసిన శబ్దాలే స్పష్టంగా వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో జనాల ఆలోచనా విధానం ఎలా ఉంటుందో తనకు తెలుసని, అందుకే అనవసరపు వివాదాలు ఎందుకనే భయంతోనే తాను మొదట ఆ వీడియోను డిలీట్ చేయాల్సి వచ్చిందని ఆమె అసలు కారణాన్ని వెల్లడించారు. చేతిలో మొబైల్ ఫోన్, డేటా ప్యాక్ ఉన్నంత మాత్రాన సెలబ్రిటీలను ఎలా పడితే అలా వేధించే హక్కు ఎవరికీ రాదని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన అవసరం ఉందని ఆమె హితవు పలికారు.


బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నుష్రత్ 
లవ్ రంజన్ దర్శకత్వంలో వచ్చిన ‘ప్యార్ కా పంచునామా’ సినిమాతో బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నుష్రత్ బరుచా, ఆ తర్వాత ‘సోను కే టిటు కి స్వీటీ’, ‘డ్రీమ్ గర్ల్’ వంటి వరుస సూపర్ హిట్ చిత్రాలతో స్టార్ స్టేటస్ అందుకున్నారు. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా ‘చోరీ’, ‘జనహిత్ మే జారీ’ వంటి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో నటిగా తనలోని మరో కోణాన్ని బయటపెట్టారు. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈ ముంబై బ్యూటీ, సోషల్ మీడియాలోనూ విపరీతమైన ఫాలోయింగ్‌ను కలిగి ఉన్న సంగతి తెల్సిందే.నిరంతరం తన షూటింగ్ అప్‌డేట్స్, పర్సనల్ లైఫ్ విశేషాలను అభిమానులతో పంచుకునే నుష్రత్, ఇలాంటి ఒక సున్నితమైన విషయంలో ట్రోలింగ్‌కు గురికావడం ఆమెని బాగా బాధ పెట్టింది.

Advertisement

నుష్రత్ బోల్డ్‌నెస్‌ను అభినందించాల్సిందే
ఒక సెలబ్రిటీ పోస్ట్ చేసిన వీడియోను పూర్తిగా అర్థం చేసుకోకుండా, కనీస నిజానిజాలు తెలుసుకోకుండా బ్లైండ్‌గా ట్రోల్ చేయడం ఎంతవరకు సమంజసమని ఇండస్ట్రీ వర్గాలు కూడా ప్రశ్నిస్తున్నాయి. నుష్రత్ ఇచ్చిన పక్కా క్లారిటీతో మరియు ఆమె పోస్ట్ చేసిన లైవ్ ప్రూఫ్‌తో ఇప్పటికైనా ఈ వివాదానికి తెరపడుతుందని భావిస్తున్నారు. టెక్నాలజీ పెరిగిపోయిన ఈ రోజుల్లో నెటిజన్లు కూడా కాస్త మెచ్యూర్డ్‌గా ఆలోచించాలని, కేవలం వ్యూస్ కోసం లేదా నెగెటివిటీని స్ప్రెడ్ చేయడం కోసం ఒకరి క్యారెక్టర్‌ను తప్పుబట్టడం సరైన పద్ధతి కాదంటూ ఈ ట్రెండింగ్ ఇష్యూపై సోషల్ మీడియాలో ఇప్పుడు సరికొత్త డిబేట్ నడుస్తోంది. ఏది ఏమైనప్పటికీ, సైలెంట్‌గా ఉండిపోకుండా సాక్ష్యాలతో సహా ట్రోలర్స్‌కు బుద్ధి చెప్పిన నుష్రత్ బోల్డ్‌నెస్‌ను అభినందించాల్సిందే.
also read :‘రైరై రారా’ సాంగ్‌కు థియేటర్లోనే పూనకాలు.. ‘పెద్ది’ లేడీ ఫ్యాన్ మాస్ అరాచకం!

Related News

కృష్ణాష్టమి రోజున కల నెరవేరిందంటున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

Big Stories

Advertisement
×