E-Paper
Advertisement

Mrunal Thakur: టాలీవుడ్ సెన్సేషన్ హీరోపై మనసు పారేసుకున్న మృణాల్.. ఇదెక్కడి ట్విస్ట్

Mrunal Thakur: టాలీవుడ్ సెన్సేషన్ హీరోపై మనసు పారేసుకున్న మృణాల్.. ఇదెక్కడి ట్విస్ట్
Advertisement

Mrunal Thakur: హిందీ సీరియల్ ద్వారా కెరియర్ మొదలుపెట్టి.. మరాఠీ చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మృణాల్ ఠాకూర్ (Mrunal thakur).. బాలీవుడ్ లో సినిమాలు చేస్తూనే తెలుగులో హను రాఘవపూడి(Hanu raghavapudi) దర్శకత్వంలో ‘సీతారామం’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఇందులో సీతామహాలక్ష్మి పాత్రతో తెలుగు ప్రేక్షకుల హృదయాలు దోచుకున్న ఈమె.. నానితో ‘హాయ్ నాన్న’ సినిమా చేసి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో ‘ ది ఫ్యామిలీ స్టార్’ సినిమా చేసి కాస్త డీలా పడిన ఈమె ప్రస్తుతం అడివి శేష్ హీరోగా నటిస్తున్న డెకాయిట్ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది.

గాసిప్స్ తో ఊహించని క్రేజ్..

ఇదిలా ఉండగా తన సినిమాల కంటే కూడా వ్యక్తిగత రూమర్స్ కారణంగా నిత్యం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది ఈ ముద్దుగుమ్మ . తన హిందీ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ కి కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) గెస్ట్ గా రావడంతోనే ఇద్దరి మధ్య ఏదో ఉందనే వార్తలకు బలం చేకూరింది. దీనికి తోడు ఒక ఈవెంట్లో ఇద్దరు మళ్లీ కలిసి కనిపించడంతో ఈ వార్తలు మరింత జోరుగా వినిపించాయి. ఇక ధనుష్ ని ఫిబ్రవరి 14న వివాహం చేసుకోబోతోంది అంటూ వార్తలు రాగా వాటిని ఖండించింది. ప్రస్తుతం వివాహం చేసుకునే ఆలోచన లేదు. భవిష్యత్తులో పెళ్లి చేసుకోవాల్సి వస్తే ఆ విషయాన్ని తెలియజేసే మొదటి వ్యక్తిని నేనే అవుతాను. అయితే నా పెళ్లి ధనుష్ తో మాత్రం జరగదు అంటూ కరాకండిగా చెప్పేసింది. ఆ తర్వాత బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధాంత్ చతుర్వేది (Siddhanth Chaturvedi)తో క్లోజ్ గా కనిపించి రూమర్స్ కి చోటు ఇచ్చిన ఈమె.. ఆ తర్వాత అది తన సినిమా ‘ ధో దీవానే సెహర్ మే’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అలా ఫోజులిచ్చి రూమర్స్ కి చెక్ పెట్టింది.

టాలీవుడ్ హీరోపై మనసు పారేసుకున్న మృణాల్..

Advertisement

ఇలా నిత్యం రూమర్స్ తో సోషల్ మీడియాలో వార్తల్లో నిలుస్తున్న ఈమె తాజాగా టాలీవుడ్ సెన్సేషన్ స్టార్ పై మనసు పారేసుకుంటూ తన అభిప్రాయాన్ని చెప్పడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈమె టాలీవుడ్ తనకు రెండో ఇల్లు లాంటిది అని చెప్పి.. తనకు ఇష్టమైన హీరోల గురించి మాట్లాడుతూ..” ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) అంటే నాకు చాలా ఇష్టం. ఆయన డాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ నన్ను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఆయనతో ఒక్క ఫ్రేమ్ లో కనిపించే అవకాశం వచ్చినా నా కల నెరవేరినట్టే” అంటూ చెప్పుకొచ్చింది ..మొత్తానికైతే అల్లు అర్జున్ పై మనసు పారేసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.

అట్లీ – అల్లు అర్జున్ మూవీలో మృణాల్..

ఇదిలా ఉండగా మరొకవైపు అట్లీ – అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో మృణాల్ కీలకపాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం విధితమే. ఇప్పటికే షూటింగ్లో కూడా పాల్గొనట్లు ప్రచారం జరగగా ఇదే ప్రశ్న ఆమెకు ఎదురయింది. దీనిపై ఆమె మాట్లాడుతూ..” అవునా? నిజంగానే నాకు ఆ ఛాన్స్ వచ్చిందా? అయితే నాకోసం ప్రార్థించండి ..అదే నిజమైతే మనమందరం కలిసి పెద్ద సెలబ్రేషన్ జరుపుకుందాం” అంటూ నవ్వుతూ కామెంట్ చేసింది . ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ పై ఈమె కామెంట్లు చేయడంతో ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Advertisement

also read: Ayesha Khan: సెలబ్రిటీ పేరుతో ఫేక్ అకౌంట్.. హెచ్చరించిన హీరోయిన్!

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×