E-Paper
Advertisement

Iron vs Steamer: బట్టలు కాలిపోకుండా ఉండాలంటే.. ఐరన్ బాక్స్ వాడాలా? లేక స్టీమరా?

Iron vs Steamer: బట్టలు కాలిపోకుండా ఉండాలంటే.. ఐరన్ బాక్స్ వాడాలా? లేక స్టీమరా?
Advertisement

Iron vs Steamer: కాలేజీకి వెళ్లాలన్నా, ఆఫీస్‌కు వెళ్లాలన్నా, ఏదైనా పని మీద బయటికి వెళ్లాలన్నా, ముందుగా మనకు గుర్తొచ్చే విషయం.. బట్టలు నీట్‌గా ఉన్నాయా లేదా అని. దుస్తులపై మడతలు ఉంటే.. అది ఎంత ఖరీదైన డ్రెస్ అయినా దాని లుక్ మొత్తం పాడైపోతుంది. కానీ ప్రతి రోజూ ఐరన్ చేసుకునే టైం అందరికీ ఉండదు కదా. అందుకే చాలామంది స్టీమర్ వాడటం మొదలుపెట్టారు.

అయితే, ఇక్కడే చాలామందికి ఓ సందేహం వస్తుంది. బట్టలు కాలిపోకుండా, త్వరగా మడతలు పోవాలంటే ఐరన్ బాక్స్ బెటరా? లేక స్టీమర్ బెటరా? అని. నిజానికి ఈ రెండింటికీ వాటి వాటి ప్రత్యేకతలు ఉన్నాయి. కొన్ని ఫ్యాబ్రిక్స్‌కు ఐరన్ బాగా పనికొస్తే, మరికొన్ని డ్రెస్‌లకు స్టీమర్ సేఫ్. మీ దగ్గర ఉన్న బట్టల రకం ఏంటి? మీకు ఎంత టైం ఉంది? ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని సరైన ఆప్షన్‌ ఎంచుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఐరన్ బాక్స్, స్టీమర్ మధ్య తేడా ఏమిటి? ఏ సందర్భంలో ఏది వాడితే మంచిదో సింపుల్‌గా తెలుసుకుందాం.

ప్రొఫెషనల్ లుక్ కావాలంటే?

Advertisement

ఆఫీసుకో లేదా ఏదైనా ఫార్మల్ ఫంక్షన్‌కో వెళ్తున్నట్లయితే.. షర్టులు, ప్యాంటులకు ఉన్న మడతలను ఐరన్ బాక్స్ మాత్రమే పోగొట్టగలదు. ఎందుకంటే.. ఇది నేరుగా బట్టపై వేడిని విడుదల చేయడంతో ఎంతటి మొండి మడతలైనా పోవాల్సిందే. ముఖ్యంగా కాటన్, లెనిన్ వంటి మందపాటి బట్టల మీద ఉండే మడతలను వదిలించడంలో ఐరన్ బాక్స్‌కు సాటిలేదు. ఇది దుస్తులకు పక్కా ప్రొఫెషనల్ లుక్‌ని తీసుకొస్తుంది. అయితే, దీనికి ఐరన్ బోర్డ్ సెటప్ అవసరం. అలాగే టెంపరేచర్ సరిగ్గా సెట్ చేసుకోకపోతే బట్టలు కాలిపోయే ప్రమాదం కూడా ఉంది.

Also Read: నోకియా కీప్యాడ్ ఫోన్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ఇక ప్రాంతీయ భాషల్లోనే మాట్లాడొచ్చు!

స్టీమర్‌ను ఎప్పుడు వాడాలి?

Advertisement

పట్టు చీరలు, షిఫాన్ డ్రెస్సులు లేదా ఖరీదైన ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్న దుస్తులకు స్టీమర్ చక్కగా పని చేస్తుంది. దీనిలో వేడి ప్లేట్ బట్టకు నేరుగా తగలదు. కేవలం వేడి ఆవిరితోనే మడతల్ని మాయం చేస్తుంది. దీంతో బట్టలు పాడయ్యే లేదా కాలిపోయే ఛాన్స్ అస్సలు ఉండదు. డ్రెస్‌ను హ్యాంగర్‌కు తగిలించి ఈజీగా ఆవిరి పట్టవచ్చు. కోట్స్, కుర్తీలు కొత్తవాటిలా మెరవాలంటే స్టీమర్ వాడటం బెస్ట్. అయితే, దీనితో మొండి మడతల్ని పోగొట్టడం కొంచెం కష్టమే.

ఎక్కువ టైం లేనప్పుడు?

మీకు టైం తక్కువగా ఉన్నప్పుడు లేదా ప్రయాణాల్లో ఉన్నప్పుడు స్టీమర్‌ను వాడుకోవచ్చు. ఐరన్ బోర్డ్ వెతుక్కోవాల్సిన అవసరం లేకుండానే, తగిలించి ఉన్న డ్రెస్‌ మీద పైనుంచి కిందకు ఒకసారి స్టీమ్ చేస్తే చాలు.. మడతలు మాయమైపోతాయి. ముఖ్యంగా హ్యాండ్‌హెల్డ్ స్టీమర్లు బ్యాగులో పెట్టుకోవడానికి కూడా సౌకర్యంగా ఉంటాయి. కానీ, ఎక్కువ మొత్తంలో బట్టలు ఇస్త్రీ చేయాలనుకున్నప్పుడు మాత్రం ఐరన్ బాక్సును ఎంచుకోవచ్చు.

ఏ సందర్భంలో ఏది వాడాలి?

మీ దగ్గర కాటన్ బట్టలు ఎక్కువగా ఉంటే ఐరన్ బాక్స్, అదే ఫ్యాన్సీ లేదా డిజైనర్ వేర్ ఎక్కువగా ఉంటే స్టీమర్ కొనుక్కోవడం తెలివైన పని. వీలైతే ఈ రెండింటినీ అందుబాటులో ఉంచుకుంటే సందర్భాన్ని బట్టి వాడుకోవచ్చు. అయితే, వీటిలో ఏది వాడినా సరే.. మీ బట్టల లోపల ఉండే కేర్ లేబుల్ ఒకసారి చదవండి. అది మీ బట్టలను ఎలా సేఫ్‌గా ఉంచుకోవాలో క్లియర్‌గా చెబుతుంది.

Also Read: ఓడియమ్మ బడవా.. ఫోన్లో త్వరగా ఛార్జింగ్ అయిపోవడానికి అసలు కారణం ఇదా?

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×