E-Paper
Advertisement

Mrunal Thakur: ముంబై నుంచి మృణాల్ ఠాకూర్ స్టైలిష్ ఫోటో..ఏక్ దీవానీ అంటూ..!

Mrunal Thakur: ముంబై నుంచి మృణాల్ ఠాకూర్ స్టైలిష్ ఫోటో..ఏక్ దీవానీ అంటూ..!
Advertisement

Mrunal Thakur: మృణాల్ ఠాకూర్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ మృణాల్ ఠాకూర్ లో ఒక అందమైన ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటోకు ఆమె పెట్టిన క్యాప్షన్ “ఏక్ దీవానీ!” ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ముంబైలో తీసిన ఈ ఫోటోలో మృణాల్ చాలా ధైర్యంగా, స్టైలిష్‌గా కనిపించింది. ఆమె వేసుకున్న డ్రెస్.. నిలబడిన విధానం..ముఖంలో కనిపించే కాన్ఫిడెన్స్ అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి.

ఈ ఫోటో పోస్ట్ చేసిన కొద్దిసేపటికే లక్షకు పైగా లైక్స్ వచ్చాయి. కామెంట్ సెక్షన్ మొత్తం హార్ట్ ఎమోజీలు, ప్రశంసలతో నిండిపోయింది. చాలా బాగుంది..సింపుల్ అండ్ క్లాస్ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. .

Advertisement

ఇదే సమయంలో మృణాల్ తన సినిమాల విషయంలో కూడా వార్తల్లో ఉంది. సీతా రామం సినిమా ద్వారా ఆమె తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఆ సినిమాలో సీత పాత్రలో మృణాల్ నటన ఇప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. ఆ సినిమాలో ఆమెతో కలిసి నటించిన హీరో దుల్కర్ సల్మాన్ తో ఇప్పుడు మళ్లీ కలిసి పనిచేస్తుండటం అభిమానులను చాలా ఆనందపెడుతోంది.

మృణాల్ భీగీ భీగీ..

ఈ ఇద్దరూ కలిసి నటించిన కొత్త పాట పేరు ‘భీగీ భీగీ’. ఈ పాటకు సంబంధించిన ప్రోమోను మృణాల్ ఇటీవల షేర్ చేసింది. ఆ వీడియోతో పాటు ఆమె “దీనిని విధి అనొచ్చు, యాదృచ్ఛికం అనొచ్చు… మేమైతే ప్రేమ అంటాం” అని రాసింది. ఈ మాటలు చూసి సీతా రామం అభిమానులు భావోద్వేగానికి గురయ్యారు.

Advertisement

‘భీగీ భీగీ’ పాటకు సంగీతం అందిస్తున్నది ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్. ఈ పాటను ఏ.ఆర్. అమీన్, జాస్లిన్ రాయల్ ఆలపించారు. ఈ పాట ఫిబ్రవరి 2, 2026న విడుదల కానుంది. వాలెంటైన్స్ నెలలో రావడం వల్ల ఈ పాటపై అంచనాలు మరింత పెరిగాయి.

మృణాల్ భవిష్యత్ సినిమాలు..

మృణాల్ భవిష్యత్ సినిమాల విషయానికి వస్తే, ఆమె ‘డూ దీవానే సేహర్ మే’ సినిమాలో సిద్ధాంత్ చతుర్వేది తో నటిస్తోంది. అలాగే వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ సినిమాలో కూడా మృణాల్ కీలక పాత్రలో కనిపించనుంది.

Also Read: Mrunal Thakur : బ్లూ డ్రెస్ లో సింపుల్ లుక్ లో మృణాల్ ఫోటో షూట్.. క్యూట్ అంతే..

 

Related News

వైష్ణవితో నిజంగానే లవ్ ఉందా ?..అసలు విషయం చెప్పేసిన ఆనంద్ దేవరకొండ !

సముద్రం ఒడ్డున బాలయ్య భామ.. ఫొటో చూస్తే చూపు తిప్పుకోలేరు!

సమంత ఎంగేజ్మెంట్ రింగ్ వెనుక ఇంత స్టోరీ ఉందా.. ధర తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే!

నాగ చైతన్య ‘వృషకర్మ’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఫౌజీ వాయిదా పడినట్టేనా?

మిర్జాపూర్ ఊచకోత.. రూ.200 కోట్లు ఇక లాంఛనమేనా ?

హనుమాన్ అంష్ 2లో విరాట్–అనుష్క.. నిజమేనా?

ఏంటీ ట్రెండ్ మామా.. టాలీవుడ్ హీరోలంతా 80ల్లోనే!

‘జనవరి 12 విడుదల’ పక్కా బ్లాక్ బస్టర్.. ఫస్ట్ రివ్యూ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్!

Big Stories

Advertisement
×