Union Budget 2026: కేంద్ర బడ్జెట్ 2026 ప్రసంగం సందర్భంగా పన్ను ఎగవేత దారులకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆదాయాన్ని దాచి పెట్టి లేదా తక్కువగా చూపి చట్ట విరుద్దంగా పన్ను చెల్లింపును తప్పించుకునే వ్యక్తులు, సంస్థలను పార్లమెంటు సాక్షిగా ఆమె హెచ్చరించారు. అయితే జైలు శిక్షను మినహాయింపు ఇచ్చిన ఆమె.. పన్ను ఎగవేత దారులకు 30 శాతం పెనాల్టీ విధించనున్నట్లు పార్లమెంటు వేదికగా ప్రకటించారు. పన్ను చెల్లించని వారిని ప్రభుత్వం వదిలిపెట్టదన్న ఆమె.. తప్పును స్వయంగా సరిదిద్దుకునే వారికి చివరి అవకాశమిస్తున్నట్లు ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు.
ఆదాయ పన్ను చెల్లింపునకు సంబంధించిన గడువును మార్చి 31 వరకూ పొడగించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో క్లారిటీ ఇచ్చారు. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపన్ను చట్టం అమల్లోకి వస్తుందన్నారు. తద్వారా నయా రూల్స్ రాబోతున్నాయని హెచ్చరించారు. పన్ను ఎగవేత చేసేవారు డిజిటల్ ఫుట్‌ప్రింట్ (సోషల్ మీడియా, ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లు, లొకేషన్ డేటా) ద్వారా సులభంగా పట్టుబడతారని చెప్పారు. పన్ను ఎగవేస్తున్నట్లు అనుమానం వస్తే సంబంధిత వ్యక్తుల ఇమెయిల్స్, సోషల్ మీడియా ఖాతాలు వంటివి చెక్ చేసేందుకు ఈ కొత్త వీలు కల్పించనుంది. ప్రస్తుత డిజిటల్ యుగంలో ఎవరూ తప్పించుకోలేరని పరోక్షంగా నిర్మలా సీతారామన్ చెప్పే ప్రయత్నం చేశారు.
Also Read: Stock Market: నిర్మల బడ్జెట్ వేళ.. భారీగా పతనమైన స్టాక్ మార్కెట్, 2300 పాయింట్లు కోల్పోయిన బీఎస్ఈ
ఆదాయ పన్ను తగ్గింపు కోసం ఆశగా ఎదురుచూసిన ట్యాక్స్ పేయర్స్.. ఈ బడ్జెట్ ప్రసంగంలో నిరాశే ఎదురైంది. ఎలాంటి పన్ను తగ్గింపులను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించలేదు. అయితే కొన్ని మినహాయింపులు మాత్రం ఇచ్చారు. రహదారి ప్రమాదాల పరిహారం వడ్డీపై పన్ను తొలగింపు, విదేశీ యాత్రలపై ట్యాక్స్ మినహాయింపు , విద్య, వైద్య అవసరాలపై టీడీపీఎస్ ను 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గింపు వంటి నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే ఐటీఆర్-1, ఐటీఆర్ -2 ఫైలింగ్ కు జులై 31 వరకూ గడువు విధించడం కాస్త ఊరట కలిగించేదిగా చెప్పవచ్చు.
Also Read: Union Budget 2026: ఏపీ మైనింగ్‌పై కేంద్రం వరాల జల్లు.. నిర్మలమ్మ నోట పసందైన ప్రకటన!