E-Paper
Advertisement

మృణాళ్ సినిమా హిట్ అవ్వాలంటే మూవీలో వాళ్లు చనిపోవాల్సిందేనా?

మృణాళ్ సినిమా హిట్ అవ్వాలంటే మూవీలో వాళ్లు చనిపోవాల్సిందేనా?
Advertisement

Mrunal Thakur: ప్రస్తుతం సౌత్ నార్త్ అనే సంబంధం లేకుండా వరుస భాషలలో సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నవారిలో నటి మృణాళ్ ఠాకూర్(Mrunal Thakur) ఒకరు. ఈమె వరుస బాలీవుడ్ సినిమాలతో పాటు తెలుగు సినిమాల ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇటీవల నటుడు అడివి శేష్ (Adivi Sesh)తో కలిసి డెకాయిట్ (Dacoit)సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కూడా ఎంతో మంచి ఆదరణను సొంతం చేసుకుంది. ఈ సినిమాకు మంచి పాజిటివ్ గా రావడంతో చిత్ర బృందం ప్రమోషన్లలో భాగంగా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా మృణాళ్ ఠాకూర్ తన సినిమాల గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు.

హస్బెండ్ మర్డరర్..

తన ఫ్రెండ్స్ అందరూ తనని హస్బెండ్ మర్డరర్ అని పిలుస్తారు అంటూ చెప్పకువచ్చారు. నేను నటించిన సూపర్ హిట్ సినిమాలలో హీరోలందరూ చనిపోతూ ఉంటారు అందుకే తన ఫ్రెండ్స్ తనని అలా పిలుస్తారని మృణాళ్ ఠాకూర్ తెలియజేశారు. ఈమె తెలుగులో సీతారామం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సీతగా పరిచయమైన మృణాళ్ తదుపరి వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ తెలుగులో బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ నటించిన రామ్ పాత్ర చనిపోతుంది.

మృణాళ్ సినిమాలో హీరోలు మరణం..

Advertisement

ఇక తెలుగులో నాని హీరోగా నటించిన జెర్సీ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈ సినిమాని బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా రీమేక్ చేశారు అయితే ఈ సినిమాలో హీరో షాహిద్ కపూర్ కూడా చనిపోతారు. ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అందుకుంది. తాజాగా ఈమె నటుడు అడివి శేష్ తో కలిసి నటించిన డెకాయిట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో కూడా శేష్ నటించిన హరి అనే పాత్ర అలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఇలా ఈమె సినిమాలలో హీరోలు చనిపోతే ఆ సినిమాలు మంచి సక్సెస్ అందుకున్నాయని చెప్పాలి. ఇలా తన సినిమాలలో హీరోలు చనిపోవడంతో తన స్నేహితుల తనని హస్బెండ్ మర్డరర్ అంటూ సరదాగా ఆట పట్టిస్తారని తెలియజేశారు.

రాకా సినిమాలో మృణాళ్..

Advertisement

తెలుగులో తదుపరి ఎలాంటి సినిమాలకు కమిట్ అవ్వలేదు కానీ బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇకపోతే మృణాళ్ ఠాకూర్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందు రాకా సినిమాలో కీలకపాత్రలో కనిపించబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఇక ఈ వార్తలు పట్ల చిత్ర బృందం మాత్రం ఇప్పటివరకు ఏ విధమైనటువంటి అధికారిక ప్రకటన వెల్లడించలేదు. అయితే ఈమె మాత్రం ఈ వార్తలను ఖండించకుండా అవకాశం రావాలని కోరుకుంటున్నానని, త్వరలోనే ఆ కోరిక తీరబోతోంది అంటూ పరోక్షంగా ఈ సినిమాలో నటిస్తున్నట్టు చెప్పకనే చెప్పేస్తున్నారు. మరి రాకా సినిమాలో మృణాళ్ భాగం కాబోతున్నారా లేదా అనేది తెలియాలి అంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే.

Also Read: పేరుకే పెద్ద కమెడియన్..చందాలు వసూలు చేసి కూతురి పెళ్లి చేశానంటూ ఎమోషనల్!

Related News

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే న్యూస్.. ఆ రూమర్స్ కు చెక్..

మమిత బైజుకు ఏమైంది..? సినిమాలకు గుడ్ బై..?

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

Big Stories

Advertisement
×