Pure Friendship: లోకంలో అన్నిటికంటే స్వచ్ఛమైనది ఏదైనా ఉందంటే అది పసిపిల్లల నవ్వు మాత్రమే. ఆ నవ్వులో కల్మషం ఉండదు, ఆ సంతోషంలో స్వార్థం కనిపించదు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తే ఇది అక్షరాలా నిజమనిపిస్తుంది. ఒక ఇంటి ముందు పిల్లలందరూ ఉత్సాహంగా ఆడుకుంటుంటే, ఒక చిన్నారి మాత్రం పక్కనే కూర్చోని వారిని చూస్తూ మురిసిపోతోంది. నిజానికి ఆ చిన్నారికి రెండు చేతులు లేవు. తన తోటి పిల్లల్లా తను పరిగెత్తలేదు, బంతిని పట్టుకోలేదు. కానీ, తన లోపాన్ని చూసి ఆ పాప ఏడవలేదు.. తన స్నేహితులు ఆడుతుంటే చూసి పొందే ఆనందంలోనే తన్మయత్వం చెందింది.
వైకల్యం శరీరానికే కానీ మనసుకి కాదు
అయితే, దివా చౌదరి అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్ల కళ్లను చెమ్మగిల్లేలా చేస్తోంది. సాధారణంగా మనకు చిన్న కష్టం వస్తేనే కుంగిపోతాం, దేవుడు మనకు అది ఇవ్వలేదు.. ఇది ఇవ్వలేదు అని నిందిస్తుంటాం. కానీ ఈ చిన్నారిని చూస్తే ‘జీవితం అంటే కేవలం లేని దాని గురించి బాధపడటం కాదు, ఉన్న దానితో సంతోషంగా గడపడం’ అని అర్థమవుతుంది. ఆ పాప ముఖంలో కనిపిస్తున్న ఆ వెలుగు, స్నేహితుల ఆటను చూసి ఆమె ఇస్తున్న ఆ చిరునవ్వు.. కోట్లాది రూపాయల ఆస్తి ఉన్నా దొరకని అమూల్యమైన సంపద.
నెటిజన్లను కదిలిస్తున్న ఆత్మీయ దృశ్యం
ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. “అమ్మా.. నీ నవ్వులో ఎంత శక్తి ఉందో తెలుసా?”, “మనుషులం అంటే ఇలా ఉండాలి.. తోటి వారి సంతోషంలో తమ ఆనందాన్ని వెతుక్కోవాలి” అంటూ కామెంట్లతో ఆ చిన్నారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. వైకల్యం అనేది కేవలం శరీరానికే తప్ప, మనసుకి కాదని ఆ పాప నిరూపించింది. స్నేహితులతో కలిసి తాను ఆడలేకపోతున్నాననే చిన్న అసూయ కూడా లేకుండా, వారు ఆడుతుంటే తనూ ఆడుతున్నట్లుగానే ఫీలవుతూ ఆ పాప చూపిస్తున్న హావభావాలు అందరినీ కట్టిపడేస్తున్నాయి.
Also Read: నన్ను పాస్ చేయండి ప్లీజ్”.. ఇంటర్ బోర్డుకు విద్యార్థి ఫోన్ కాల్.. అసలేం జరిగిందంటే?
ప్రేమకు భాష అక్కర్లేదు.. స్నేహానికి అడ్డంకులు లేవు
ఈ వీడియో నేటి సమాజానికి ఒక గొప్ప సందేశాన్ని ఇస్తోంది. స్నేహం అంటే కలిసి ఆడుకోవడం మాత్రమే కాదు, ఒకరి ఆనందాన్ని మరొకరు పంచుకోవడం. ఆ చిన్నారికి చేతులు లేకపోయినా, ఆమె స్నేహితులు ఆమెను తమలో ఒకరిగా భావించడం, ఆ చిన్నారి వారిని చూసి మురిసిపోవడం మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం. సోషల్ మీడియాలో వేలకొద్దీ వీడియోలు వస్తుంటాయి కానీ, ఇలాంటి దృశ్యాలు మాత్రం మన ఆలోచనా దృక్పథాన్ని మారుస్తాయి. ఆ పసిపాప చిరునవ్వు మనకు నేర్పే పాఠం ఒక్కటే.. “పరిస్థితులు ఎలా ఉన్నా.. నవ్వడం, నవ్వించడం మర్చిపోవద్దు”.
చేతులు లేకున్నా..చిరునవ్వులు..స్వచ్ఛమైన స్నేహం
ఫ్రెండ్స్ ఆటను చూసి మురిసిపోయిన చిన్నారి
అందులో వింతేముంది అనుకుంటున్నారా..
మురిసిపోతున్న ఆ చిన్నారికి రెండు చేతులు లేవు
స్నేహితులతో కలిసి తాను ఆడలేకపోతున్నానని బాధ పడకుండా..
ఫ్రెండ్స్ ఆటను చూస్తూ ఎంజాయ్ చేసిన చిన్నారిNo… pic.twitter.com/V3mST1xgvD
— BIG TV Breaking News (@bigtvtelugu) April 16, 2026