E-Paper
Advertisement

పీకల్లోతు ప్రేమలో మృణాళ్ ఠాకూర్..హద్దులు దాటే సమయం రాబోతుందంటూ !

పీకల్లోతు ప్రేమలో మృణాళ్ ఠాకూర్..హద్దులు దాటే సమయం రాబోతుందంటూ !

Mrunal Thakur: సౌత్ సినీ ఇండస్ట్రీలోనూ, బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మృణాళ్ ఠాకూర్ (Mrunal Thakur)ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు త్వరలోనే ఈమె తెలుగులో హీరో అడివి శేష్(Adivisesh) తో కలిసిన డెకాయిట్(Dacoit) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు .ఈ సినిమా ఏప్రిల్ 10వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ వీడియో సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. ఇకపోతే చిత్ర బృందం నేడు ముంబైలో ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు .

హద్దులు దాటే సమయం రాబోతోంది..

ఈ కార్యక్రమంలో భాగంగా మృణాళ్ ఠాకూర్ తన లవ్ లైఫ్ గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ.. ప్రేమలో అన్ని హద్దులు దాటే సమయం ఇంకా రాలేదని కానీ అది త్వరలోనే రాబోతుందని ఆరోజు వచ్చినప్పుడు తప్పకుండా అందరికీ తన ప్రేమ గురించి చెబుతాను అంటూ ఈమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా ప్రేమ గురించి మృణాళ్ మాట్లాడటంతో మరోసారి ఈమె లవ్ రూమర్ల గురించి చర్చలు జరుగుతున్నాయి.

ధనుష్ తో రిలేషన్ నిజమేనా?

మృణాళ్ ఠాకూర్ ప్రేమకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు గతంలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఈమె కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో ప్రేమలో ఉంది అంటూ నిత్యం ఈ వార్తలు హల్చల్ చేస్తూనే ఉన్నాయి. వీరిద్దరూ ఒకరి పోస్టులకు ఒకరు లైక్ కొట్టుకోవడం పలు పార్టీలలో కలిసి కనిపించడంతో వీరిద్దరి రిలేషన్ గురించి ఈ విధమైనటువంటి వార్తలు బయటకు వచ్చాయి. ఇలా ధనుష్ తో మృణాళ్ రిలేషన్ లో ఉన్నారంటూ వచ్చినటువంటి ఈ వార్తలలో నిజం లేదని ఆమె పలు సందర్భాలలో ఖండించినప్పటికీ ఈ వార్తలకు మాత్రం తెరపడలేదు. ఇలాంటి సమయంలోనే ప్రేమలో హద్దులు దాటే సమయం రాబోతుందని త్వరలో అన్ని విషయాలు చెబుతానని చెప్పడంతో మృణాళ్ పీకల్లోతు ప్రేమలో ఉందంటూ అభిమానులు కూడా సందేహాలను వ్యక్తపరుస్తున్నారు.

అంచనాలు పెంచిన ట్రైలర్..

మృణాళ్ లవ్ లైఫ్ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? నిజంగానే ఈమె ప్రేమలో ఉన్నారా? లేదా? అనే విషయాలు తెలియాలి అంటే మృణాళ్ చెప్పే వరకు ఎదురు చూడాల్సిందే. ఇక ప్రస్తుతం ఈమె వరుస సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా బిజీ అయ్యారు. ఇక తాజాగా డెకాయిట్ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ మాత్రం పెద్ద ఎత్తున సినిమా పట్ల అంచనాలను పెంచేసింది. ట్రైలర్ చూస్తుంటేనే సినిమా బ్లాక్ బస్టర్ అందుకోబోతోందని స్పష్టం అవుతుంది. మరి ఏప్రిల్ 10వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ఎలాంటి సక్సెస్ ఇస్తుందో తెలియాల్సి ఉంది.

Related News

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

బన్నీ-లోకేష్ కనగారాజ్ సినిమా క్యాన్సిల్ అయిందా? …. అసలు నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే!

చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ బ్యాటింగ్ స్టార్ట్.. సమంత, వరుణ్ తేజ్ రివ్యూస్ వైరల్.. ‘మెగా 158’ టీమ్ స్పెషల్ విష్

పెద్ది’ రిలీజ్ వేళ రచ్చ.. రామ్ చరణ్ విగ్రహంపై దారుణంగా ట్రోల్స్, క్షమాపణలు చెప్పిన ఫ్యాన్స్!

ఇది కదా క్యారెక్టర్ డెడికేషన్ అంటే! ‘పెద్ది’ గెటప్‌లో రోడ్లపై తిరిగిన జగ్గూభాయ్..

షూటింగ్ సెట్‌లో భారీ పేలుడు.. ఎస్‌జే సూర్య డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ఘోర విషాదం!

Big Stories

×