Mrunal Thakur: సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మంచి సక్సెస్ అందుకున్న మృణాళ్ ఠాకూర్(Mrunal Thakur) ప్రస్తుతం కెరియర్ పరంగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈమె బాలీవుడ్ సినిమాలతో పాటు తెలుగు సినిమాలు సిరీస్ లలో నటిస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. మృణాళ్ ఠాగూర్ వృత్తిపరమైన జీవితాన్ని పక్కన పెడితే తన వ్యక్తిగత విషయాల ద్వారా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. సినిమా ఇండస్ట్రీలో ఏ ఒక్క హీరో హీరోయిన్ కాస్త చనువుగా ఉంటే చాలు వారి గురించి ఎన్నో రకాల రూమర్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే ధనుష్(Danush) మృణాళ్ ఠాకూర్ గురించి కూడా ఇలాంటి రూమర్లు తెరపైకి వచ్చాయి.
గత కొంతకాలంగా వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ వీరి రిలేషన్ పై వివిధ రకాల వార్తలు హల్చల్ చేస్తున్న ప్రతిసారి మృణాళ్ ఠాకూర్ స్పందిస్తూ ఈ వార్తలను ఖండిస్తున్నారు అయినప్పటికీ ఈ వార్తలకు పులిస్టాప్ పడలేదు. AI టెక్నాలజీ ద్వారా కొంతమంది వీరిద్దరికీ సెలబ్రిటీల సమక్షంలో పెళ్లి కూడా చేసిన సంగతి తెలిసిందే. ఇలా నిత్యం వీరిద్దరి రిలేషన్ గురించి ఎన్నో రకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా మృణాళ్ ఠాగూర్ ధనుష్ తో తన రిలేషన్ గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె మాట్లాడుతూ హీరో ధనుష్ తనకు సోదరుడితో సమానమని షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. తను నాకు అన్నయ్యతో సమానమని మేము వృత్తిపరమైనటువంటి వివిషయాలన్నింటి షేర్ చేసుకుంటామంటూ ఈ సందర్భంగా మృణాళ్ హీరో ధనుష్ తో తన రిలేషన్ గురించి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ అవుతున్నారు. ధనుష్ ని పట్టుకొని అన్నయ్య అనడం ఏంటి ఇదెక్కడి ట్విస్టర్ రా బాబు అంటూ విభిన్న రీతిలో స్పందిస్తున్నారు.
రూమర్ల పై స్పందించని ధనుష్..
ఈ విధంగా ధనుష్ మృణాళ్ రిలేషన్ గురించి సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన నేపథ్యంలో ప్రతిసారి మృణాళ్ ఈ వార్తలను ఖండిస్తూ వచ్చారే తప్ప ధనుష్ మాత్రమే ఈ విషయాల గురించి అసలు పట్టించుకోలేదు . గతంలో సీనియర్ నటి మీనా ధనుష్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ కూడా వార్తలు వచ్చాయి కానీ ఈ వార్తలు పై కూడా ఆయన ఎక్కడ స్పందించలేదు. ధనుష్ ఇటీవల తన భార్య ఐశ్వర్య రజినీకాంత్ కు విడాకులు ఇవ్వడంతో ఈయన రెండో పెళ్లి గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినపడుతున్నాయి. మరి ఈ వార్తలపై ధనుష్ రియాక్షన్ ఏంటో తెలియాల్సి ఉంది.. ఇక ధనుష్ ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు ఈయన తాజాగా రాజ్ కుమార్ పెరియ స్వామితో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.. ధనుష్ 55వ సినిమాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Also Read: Prabhas: యువీ క్రియేషన్ లో ప్రభాస్ మూవీ… ఎప్పుడో చెప్పిన ప్రొడ్యూసర్?