E-Paper
Advertisement

OTT Movie : ప్రేమలో పడే రక్తం తాగే జోంబీ… ఒళ్ళు గగుర్పొడిచే సీన్స్ ఉన్న మూవీ

OTT Movie : ప్రేమలో పడే రక్తం తాగే జోంబీ… ఒళ్ళు గగుర్పొడిచే సీన్స్ ఉన్న మూవీ
Advertisement

OTT Movie : జాంబీ మూవీల్లో డిఫరెంట్ స్టోరీని చూడాలనుకుంటే, ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాను ఒకసారి ట్రై చేయండి. ఇది ఒక రొమాంటిక్ కామెడీ స్టైల్ లో ఉంటుంది. ఇక్కడ వల అమ్మాయితో జాంబీ ప్రేమలో పడుతుంది. ఆ తరువాత అసలు కథ ఉంటుంది. ఈ సినిమాలో హారర్ తో పాటు రొమాన్స్ కూడా ఉంటుంది. మరి ఎందుకు ఆలస్యం. ఈ రొమాంటిక్ హారర్ సినిమాపై కూడా ఓ లుక్ వేయండి. ఇది ఏ ఓటీటీలో ఉంది, దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

ఈ యూనిక్ జాంబీ రొమాంటిక్ కామెడీ హారర్ సినిమా పేరు ‘Warm Bodies’ 2013లో వచ్చిన ఈ సినిమా జాంబీ అపోకలిప్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఒక లవ్ స్టోరీతో నడుస్తుంది. జోనాథన్ లెవిన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నికోలస్ హౌల్ట్, తెరెసా పామర్, రోబ్ కార్డ్రీ, జాన్ మాల్కోవిచ్ నటించారు. ప్రస్తుతం ఈ సినిమా Amazon Prime Videoలో అందుబాటులో ఉంది. $35 మిలియన్ బడ్జెట్ తో ఈ మూవీ బాక్సాఫీస్ లో $117 మిలియన్లను కలెక్ట్ చేసి, సక్సెస్‌ఫుల్ గా నిలిచింది. 1 గంట 38 నిమిషాలు నిడివితో IMDbలో 6.8/10 రేటింగ్ ని పొందింది ఈ జాంబీ సినిమా.

స్టోరీ ఏమిటంటే

Advertisement

జాంబీ అపోకలిప్స్ తర్వాత ప్రపంచం జాంబీలతో నిండిపోతుంది. మనుషులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పోరాడుతుంటారు. ఇక ఈ కథలో హీరో R ఒక జాంబీ. కానీ అతను సాధారణ జాంబీల్లా కాదు, ఫీలింగ్స్ ఉంటాయి. ఒకరోజు జూలీ అనే అమ్మాయిని జాంబీల దాడి నుంచి సేవ్ చేస్తాడు. ఆ అమ్మాయిని ఇష్టపడతాడు R. ఆమెతో సంబంధం పెరిగేకొద్దీ Rలో మార్పులు వస్తాయి. ఇక అతనిలో నెమ్మదిగా మానవత్వపు లక్షణాలు తిరిగి రావడం మొదలవుతాయి. అతని గుండె మళ్ళీ కొట్టుకోవడం ప్రారంభిస్తుంది. ఇప్పుడు అతను ఒక హ్యూమన్ లాగా ఫీల్ అవుతాడు. ఈ మార్పు కేవలం అతనికే పరిమితం అవుతుందా ? మిగిలిన జొంబీలు కూడా మనుషుల్లా మారతారా ? వీళ్ళ ప్రేమకథ ఎలాంటి ముగింపును ఇస్తుంది ? అనే విషయాలను, ఈ సినిమాను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : డేవ్ బటిస్టా – జాసన్ మోమోవా క్రేజీ కామెడీ… అల్టిమేట్ యాక్షన్ సీన్స్… ఈ కొత్త మూవీ ఏ ఓటీటీలో ఉందో తెలుసా?

Related News

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

హైదరాబాద్ కుర్రాడికి కొరియన్ దెయ్యంతో లవ్… కితకితలు పెట్టే ఇండో-కొరియన్ థ్రిల్లర్

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

Big Stories

Advertisement
×