BigTV English

Mrunal Thakur: మృణాల్ నోటిదూల.. ఈసారి విరాట్ భార్యనే ..?

Mrunal Thakur: మృణాల్ నోటిదూల.. ఈసారి విరాట్ భార్యనే ..?

Mrunal Thakur: బాలీవుడ్ హాట్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో సీతారామం సినిమాతో సీతగా ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకొని స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ప్రస్తుతం రెండు పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న మృణాల్.. గత కొంతకాలంగా తన నోటి దూలతో వివాదాలను కొనితెచ్చుకుంటుంది.


ముఖ్యంగా సీనియర్ హీరోయిన్లపై అమ్మడు నోరుపారేసుకోవడం, ఆ తరువాత కొన్నిరోజులు సారీ చెప్పడం అలవాటుగా మారిపోయింది. మొన్నటికి మొన్న.. గతంలో బిపాసాబసుపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు కోరింది. కెరీర్ మొదట్లో మృణాల్ ఒక ఇంటర్వ్యూలో బిపాసా కండలు తిరిగిన మగాడిలా ఉంటుందని, ఆమె కంటే తానే బావుంటాను అని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. దీనికి కౌంటర్ గా బిపాసా కూడా తనదైనరీతిలో సమాధానం చెప్పింది.

ఇక స్టార్ హీరోయిన్ అయ్యాక.. బిపాసాపై చేసిన వ్యాఖ్యలను మృణాల్ వెనక్కి తీసుకుంది. అప్పుడు చిన్నపిల్లను.. ఏం మాట్లాడుతున్నానో తెలియదు. అందులో ఆ సంయమలో అసలైన అందానికి నిర్వచనం నాకు తెలియదు. ఇప్పుడే అందం అంటే ఏంటి.. అనేది తెలుసుకున్నాను.. పైన కనిపించేది కాదు అందం.. అది  మనసులో ఉంటుంది. వ్యక్తిత్వంలో ఉంటుంది అని చెప్పుకొచ్చింది. ఎవరినైనా ఇబ్బందిపెడితే క్షమించమని కూడా కోరింది.


ఒక హీరోయిన్ గురించి మృణాల్ అలా మాట్లాడడం తప్పే అయినా చిన్నవయస్సు కావడంతో నెటిజన్స్ ఆమె చెప్పినదానికి ఓకే అన్నారు. వెంటనే వదిలేశారు. అయితే అంతజరిగినా కూడా మృణాల్ లో మార్పు రాలేదు. తాజాగా మరో హీరోయిన్ గురించి ఆమె హేళన చేస్తూ మాట్లాడింది. ఒక ఇంటర్వ్యూలో మృణాల్ మాట్లాడుతూ..  ” గతంలో ఒక స్టార్ హీరో సినిమాలో ఆఫర్ వచ్చింది. కానీ, నేను దాన్ని రిజెక్ట్ చేశాను. ఆ ఆఫర్ ను మరో స్టార్ హీరోయిన్ అందుకుంది. ఈ సినిమా ఆమెకు మంచి స్టార్ డమ్ ను ఇచ్చినా.. ఇప్పుడు ఆమె సినిమాలే చేయడం మానేసింది” అని  చెప్పుకొచ్చింది.

మృణాల్ చెప్పుకొచ్చిన హీరోయిన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ అని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. సల్మాన్ ఖాన్ నటించిన సుల్తాన్ సినిమా కోసం మొదట మృణాల్ ను సంప్రదించగా ఆమె నో చెప్పడంతో.. ఆ ఆఫర్ అనుష్క శర్మ దాగరకు వెళ్ళింది. ఇక ప్రస్తుతం అనుష్క సినిమాలు మానేసిన విషయం తెల్సిందే, ఇక అనుష్క.. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే విరాట్ ను ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం.. ఇద్దరు పిల్లలు.. ఇలా ఒక కుటుంబ జీవితాన్ని గడుపుతుంది. ఆమె గురించి మృణాల్ అలా మాట్లాడడం పద్దతి కాదని నెటిజన్స్ మండిపడుతున్నారు.మొన్న బిపాసా.. ఇప్పుడు అనుష్క.. మృణాల్ కావాలనే పెళ్లి అయ్యి.. సెటిల్ అయిన హీరోయిన్స్ ను టార్గెట్ చేసి మాట్లాడుతుందని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వివాదంపై మృణాల్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Related News

Bollywood: బాలీవుడ్ లో దిగ్బ్రాంతి, ఆ ప్రముఖ నటుడు దూరమయ్యారు

Ar Muragadoss: ఇంక రిటైర్మెంట్ ఇచ్చేయండి బాసు, పెద్ద డైరెక్టర్లు వరుస ఫెయిల్యూర్స్

Nag Ashwin: ప్రధానికి నాగ్ అశ్విన్ కీలక రిక్వెస్ట్.. కొత్త జీఎస్టీ‌లో ఆ మార్పు చెయ్యాలంటూ…

Siima 2025 Allu Arjun: సైమా ఈవెంట్లో అల్లు అర్జున్, లుక్ అదిరింది భాయ్

17 Years of Nani : మామూలు జర్నీ కాదు, ఈ తరానికి నువ్వే బాసు

Sujeeth: సుజీత్ కరుడుగట్టిన కళ్యాణ్ అభిమాని.. ఏం చేశాడంటే?

Big Stories

×