Harishrao: బీఆర్ఎస్‌లో రాజకీయాలు ఓ రేంజ్‌లో సాగుతున్నాయా? ఎవరు.. ఎప్పుడు.. ఎటువైపు ఉంటారో తెలియడం లేదా? కవిత విమర్శలు చేసింది రెండు రోజులైంది. ఎందుకు హరీష్‌రావు సైలెంట్‌గా ఉన్నారు? హైకమాండ్ ఆదేశాల మేరకు ఆయన మౌనం వహిస్తున్నారా? లండన్‌లో జరిగిన కార్యక్రమంలో కవిత వ్యవహారంపై అడిగిన ప్రశ్నలకు ఆయనేమన్నారు? ఇదే చర్చ ఇప్పుడు ఆ పార్టీలో జరుగుతోంది.
మాజీ మంత్రి హరీష్‌రావు శుక్రవారం మధ్యాహ్నం లేదా సాయంత్రానికి హైదరాబాద్‌కు రానున్నారు. కూతురు అడ్మిషన్ ప్రక్రియ పూర్తి కావడంతో హరీష్‌రావు ఇండియాకు తిరుగు పయనమయ్యారు. లండన్‌లో కవిత వ్యాఖ్యలపై ‘బిగ్ టీవీ’ ఆయన్ని మాట్లాడించే ప్రయత్నం చేసింది.
కవిత వ్యాఖ్యలపై మీ రియాక్షన్ ఏంటి అన్న ప్రశ్నకు ఆయన నేరుగా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయలేదు. హరీష్‌రావు పక్కనున్న ఓ వ్యక్తి మాత్రం ఇండియాలో మాట్లాడుతారని చెప్పే ప్రయత్నం చేశారు. కవిత ఆరోపణలను ఆయన లైటుగా తీసుకున్నట్లు కనిపిస్తోంది.
లండన్‌లో జరిగిన ‘బీట్ అండ్ గ్రీట్’ ఈవెంట్‌లో హరీష్‌రావు ఏమన్నారు? కవిత విమర్శలపై మీరేమంటారని పలువురు అడిగారట. ఆమె కామెంట్స్‌ను సీరియస్‌గా తీసుకోనని చెప్పినట్టు తెలుస్తోంది. తన వల్ల పార్టీలో ఇబ్బంది వస్తుందని చెప్పడాన్ని ఎద్దేవా చేశారట. దీనిపై ఇప్పటికి చాలాసార్లు క్లారిటీ ఇచ్చానని చెప్పినట్టు సమాచారం.
ALSO READ: ఓయూ పరిధిలో శనివారం జరగాల్సిన పరీక్షలు వాయిదా
పార్టీలో తానొక క్రమశిక్షణ గల కార్యకర్తనని, కేసీఆర్ నాయకత్వంలో చివరి శ్వాస వరకు పని చేస్తానని మనసులోని మాట బయటపెట్టారు. ఈ విషయంలో పార్టీ తీసుకున్న ఏ నిర్ణయాన్నైనా శిరసా వహిస్తానని అన్నారట. పార్టీ మొదటి నుంచి కేసీఆర్ అడుగుజాడల్లో పని చేశానని చెప్పారు. భవిష్యత్‌లో కూడా పని చేస్తానని స్పష్టంచేశారట.
లండన్ పర్యటన పూర్తికావడంతో శుక్రవారం సాయంత్రం లేదా శనివారం ఉదయం హరీష్‌రావు హైదరాబాద్ లో అడుగుపెట్టనున్నారు. ఎయిర్ పోర్టు నుంచి ఇంటికి వెళ్లిన తర్వాత రెస్టు తీసుకోనున్నారు. అయితే శనివారం సాయంత్రం లేకుంటే ఆదివారం ఉదయం ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌కు వెళ్లనున్నారు.
అక్కడ పార్టీ అధినేత కేసీఆర్‌తో మాట్లాడిన తర్వాత, ఆయన చెప్పిన డైరెక్షన్ మేరకు అడుగులు వేయనున్నారు. కవిత వ్యాఖ్యలపై మీడియా ముందు సమాధానం చెబుతారా? రాజకీయాల్లో ఇలాంటి ఆరోపణలు సహజమేనని సైలెంట్‌గా ఉంటారో అనేది చూడాలి.
హరీష్‌రావు మద్దతుదారులు మాత్రం కచ్చితంగా సమాధానం చెబుతారని అంటున్నారు. తన నేతపై కవిత చేసిన వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని అంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతికి కర్మ, కర్త, క్రియ అన్నీ హరీష్‌రావు అని ఆరోపించారు కవిత. అవినీతి డబ్బుతో 2018 ఎన్నికల్లో రెండు డజన్లు మంది ఎమ్మెల్యేలకు నిధులు సర్దుబాటు చేశారని చెప్పిన విషయం తెల్సిందే.
కవిత ఆరోపణలపై హరీష్ రావు ఫస్ట్ రియాక్షన్.. pic.twitter.com/hMlxM5j77l
— BIG TV Breaking News (@bigtvtelugu) September 5, 2025