BigTV English

Tollywood: బడా చిత్రాలకు దేవుడే అడ్డమా.. ఇదెక్కడి విడ్డూరం!

Tollywood: బడా చిత్రాలకు దేవుడే అడ్డమా.. ఇదెక్కడి విడ్డూరం!

Tollywood:సాధారణంగా ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు దేవుడిపైనే భారం వేసి.. ఆ పని మొదలుపెడతాము. అయితే ఆ పనికి కాపాడాల్సిన దేవుడే..అడ్డుగా మారితే ఇక పని ఎంతవరకు ముందుకు వెళుతుంది అనేది ఇప్పుడు సినిమాల విషయంలో స్పష్టంగా కనిపిస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే.. భారీ బడ్జెట్ తో ఊహించని.. సరికొత్త ప్రమోషన్స్ తో ఆడియన్స్ ముందుకు వచ్చిన పెద్ద చిత్రాలకు ఇప్పుడు దేవుడే అడ్డంగా మారాడు. ఇదెక్కడి విడ్డూరం అని ఆలోచిస్తున్నారా మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.


భారీ బడ్జెట్ చిత్రాలు విడుదల..

సెప్టెంబర్ 05.. భారీ బడ్జెట్ చిత్రాలు విడుదలయ్యాయి. చాలా రోజుల తర్వాత అనుష్క శెట్టి (Anushka Shetty) , క్రిష్ జాగర్లమూడి (Krish jagarlamudi) దర్శకత్వంలో చేసిన చిత్రం ఘాటీ (Ghaati). ఇప్పటికే రెండు మూడుసార్లు వాయిదా పడి ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అటు అనుష్క కూడా ఈ సినిమా ప్రమోషన్స్ కి నేరుగా హాజరు కాకుండా ఆడియో కాల్ ద్వారా అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. దీనికి తోడు డైరెక్టర్ క్రిష్ , నిర్మాతలు కూడా సినిమా ప్రమోషన్స్ చేపట్టి సినిమాపై భారీ హైప్ తీసుకొచ్చారు. పైగా ప్రభాస్ (Prabhas), అల్లు అర్జున్(Allu Arjun) లాంటి హీరోలు కూడా రంగంలోకి దిగారు. ఎట్టకేలకు సినిమా థియేటర్లలోకి వచ్చేసింది.ఇక టాక్ సంగతి పక్కన పెడితే ఇప్పుడు ఈ సినిమా చూడడానికి థియేటర్ కి ఆడియన్స్ రావడం లేదు.

ఘాటితోపాటు మదరాసి, లిటిల్ హార్ట్స్ కూడా..


ఈ చిత్రం తోపాటు ఏ.ఆర్. మురుగదాస్ (AR Muragadas) దర్శకత్వంలో శివ కార్తికేయన్ (Siva Karthikeyan) హీరోగా, రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం ‘మదరాసి’. ఈ సినిమా కూడా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ చిత్రం తోపాటు ’90’స్ బయోపిక్’ ఫేమ్ మౌళి (Mouli)హీరోగా తొలి ప్రయత్నంలో చేసిన చిత్రం ‘లిటిల్ హార్ట్స్ ‘. భారీ ఎక్స్పెక్టేషన్స్ తో ఈరోజు విడుదలైంది ఈ చిత్రం కూడా.. ఇవన్నీ కూడా మంచి కథా ఓరియంటెడ్ చిత్రాలే కావడం గమనార్హం. దీంతో ఈ చిత్రాలన్నింటికీ భారీ కలెక్షన్స్ వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు థియేటర్ కి ఆడియన్స్ రాకపోవడానికి కారణం దేవుడే అని తెలుస్తోంది.

కలెక్షన్స్ కి అడ్డుగా మారిన గణేశుడు..

అసలు విషయంలోకి వెళ్తే.. ఆగస్టు 27వ తేదీన దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగను చాలా ఘనంగా జరుపుకున్నారు. అయితే ఒక్కొక్క ప్రాంతంలో వారి స్తోమతలను బట్టి స్వామివారికి నిమజ్జనం జరిపించిన విషయం తెలిసిందే. సాధారణంగా స్వామివారి చవితి రోజు నుంచి మూడు రోజులకు, ఐదు రోజులు, ఏడు రోజులు, తొమ్మిది, 11 రోజులు అంటూ నిమజ్జనం చేస్తారు. అయితే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాదు దేశవ్యాప్తంగా గణేశుని నిమజ్జన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడం వల్ల సినిమా థియేటర్ కి వెళ్లి ప్రజలు సినిమా చూడడానికి ఆసక్తి కనబరచడం లేదు. మరి కొంతమంది సినిమా చూడడానికి టికెట్స్ బుక్ చేసుకుంటే.. వాళ్ళు థియేటర్ కి వెళ్లడానికి కుదరడం లేదు. కారణం ట్రాఫిక్. ముఖ్యంగా హైదరాబాదులో అయితే గణేష్ నిమజ్జనం కారణంగా ఫుల్ ట్రాఫిక్ ఏర్పడింది. అనుకున్న సమయానికి థియేటర్ కి రీచ్ అవ్వలేకపోతున్నారు. దీంతో ఇప్పటికే బుక్కైన టికెట్లు కూడా క్యాన్సిల్ చేసుకున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఘాటీ, మదరాసి లాంటి పెద్ద చిత్రాలకు ఇప్పుడు గణేష్ నిమజ్జనం మైనస్ గా మారింది అని చెప్పవచ్చు.

ALSO READ:SSMB 29: మహేష్ బాబు మూవీ సెట్ నుండి సీన్ లీక్ .. గూస్ బంప్స్ గ్యారెంటీ!

Related News

Bollywood: బాలీవుడ్ లో దిగ్బ్రాంతి, ఆ ప్రముఖ నటుడు దూరమయ్యారు

Ar Muragadoss: ఇంక రిటైర్మెంట్ ఇచ్చేయండి బాసు, పెద్ద డైరెక్టర్లు వరుస ఫెయిల్యూర్స్

Nag Ashwin: ప్రధానికి నాగ్ అశ్విన్ కీలక రిక్వెస్ట్.. కొత్త జీఎస్టీ‌లో ఆ మార్పు చెయ్యాలంటూ…

Siima 2025 Allu Arjun: సైమా ఈవెంట్లో అల్లు అర్జున్, లుక్ అదిరింది భాయ్

17 Years of Nani : మామూలు జర్నీ కాదు, ఈ తరానికి నువ్వే బాసు

Sujeeth: సుజీత్ కరుడుగట్టిన కళ్యాణ్ అభిమాని.. ఏం చేశాడంటే?

Big Stories

×