E-Paper
Advertisement

Allu Arjun -Mrunal Thakur: అల్లు అర్జున్ అట్లీ సినిమాలో మృణాళ్ ఠాకూర్..హింట్ ఇచ్చిన బన్నీ!

Allu Arjun -Mrunal Thakur: అల్లు అర్జున్ అట్లీ సినిమాలో మృణాళ్ ఠాకూర్..హింట్ ఇచ్చిన బన్నీ!
Advertisement

Allu Arjun -Mrunal Thakur: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం డైరెక్టర్ అట్లీ సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.. పుష్ప 2 సినిమా తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీగా అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా దాదాపు 70% షూటింగ్ పనులు పూర్తి అయ్యాయని త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాబోతోందని సమాచారం. ఇలా ఈ సినిమా షూటింగ్ పనులు పూర్తి అవుతున్న ఇప్పటివరకు సినిమా నుంచి ఎలాంటి విషయాలు లీక్ అవ్వకుండా అట్లీ ఎంతో జాగ్రత్త పడుతున్నారు.

బన్నీ అట్లీ మూవీలో మృణాళ్?

ఇకపోతే ఈ సినిమాలో అల్లు అర్జున్ జోడిగా దీపికా పదుకొనే (Deepika Padukone) నటించబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా తెలియజేశారు. దీపికా మాత్రమే కాకుండా ఈ సినిమాలో మృణాళ్ ఠాకూర్ (Mrunal Thakur)కూడా నటించబోతున్నారంటూ వార్తలు వచ్చాయి అయితే ఈ వార్తలపై స్పందించిన ఈమె నేను అల్లు అర్జున్ సినిమాలో నటిస్తున్నానా? ఇది నిజం కావాలని కోరుకోండి ఇదే నిజమైతే మీకు కచ్చితంగా పార్టీ ఇస్తాను అంటూ ఈ వార్తలను ఖండించారు.

అల్లు అర్జున్ కు మృణాళ్ విషెస్..

Advertisement

తాజాగా ఈ విషయంపై అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ చూస్తుంటే ఈ సినిమాలో మృణాళ్ ఠాకూర్ నటించబోతున్నారని తెలుస్తోంది. ఇటీవల అల్లు అర్జున్ ఫిలింఫేర్(Film Fare) అవార్డు అందుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ అవార్డు అందుకున్న నేపథ్యంలో ఈయనకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లు వెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మృణాళ్ ఠాకూర్ సైతం అల్లు అర్జున్ కోసం ప్రత్యేకంగా ఒక పూల బొకే పంపిస్తూ అల్లు అర్జున్ కు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. ఈ పూల బొకేను అల్లు అర్జున్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా షేర్ చేస్తూ మృణాళ్ ఠాకూర్ కు థాంక్స్ తెలియజేశారు.

నీతో కచ్చితంగా సినిమా చేస్తా..

Advertisement

ఈ విషయంపై అల్లు అర్జున్ రిప్లై ఇస్తూ థాంక్యూ సో మచ్ మృణాళ్ ఠాకూర్ సో స్వీట్ అఫ్ యు.. ఏదో ఒక రోజు నీతో సినిమా చేస్తానని ఆశిస్తున్నాను అంటూ అల్లు అర్జున్ రిప్లై ఇవ్వడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అల్లు అర్జున్ చేసిన ఈ పోస్ట్ వెనుక ఆంతర్యం ఏంటి ఈమెతో కలిసి నటిస్తానని చెప్పడంతో అల్లు అర్జున్,అట్లీ సినిమాలో మృణాళ్ కూడా నటిస్తున్నారా? అందుకే బన్నీ ఇలాంటి పోస్ట్ చేశారా? అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. మరి అల్లు అర్జున్ చేసిన ఈ పోస్ట్ వెనుక ఉన్న కారణం ఏంటి అనేది తెలియాలి అంటే మరి కొద్ది రోజులు ఎదురు చూడాల్సిందే.

Also Read: Ustaad Bhagat OTT: భారీ ధరలకు ఉస్తాద్ భగత్ ఓటీటీ డీల్ క్లోజ్ …నెట్ ఫ్లిక్స్ చేతికి స్ట్రీమింగ్ రైట్స్!

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×