E-Paper
Advertisement

Collector Hanumantha Rao: నీకు ఏ కష్టం వచ్చినా నేనున్నా.. బదిలీ వేళ భరత్ కు భరోసా ఇచ్చిన కలెక్టర్ హనుమంత రావు

Collector Hanumantha Rao: నీకు ఏ కష్టం వచ్చినా నేనున్నా.. బదిలీ వేళ భరత్ కు భరోసా ఇచ్చిన కలెక్టర్ హనుమంత రావు
Advertisement

Collector Hanumantha Rao: మానవత్వానికి నిలువుటద్దంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు నిలిచారు. అధికారిక బాధ్యతలతో పాటు సామాజిక బాధ్యతను నెరవేరుస్తూ.. తాను దత్తత తీసుకున్న ఒక నిరుపేద విద్యార్థికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. జిల్లాలోని సంస్థాన్ నారాయణపురం మండలం కంకణాల గూడెం గ్రామానికి చెందిన భరత్ చంద్రా చారి అనే బాలుడి దీనస్థితిని చూసి గతంలో కలెక్టర్ చలించిపోయారు. ఆ బాలుడిని దత్తత తీసుకోవడమే కాకుండా.. ప్రతి నెలా చదువు కోసం 5,000 రూపాయల ఆర్థిక సాయం.. కుటుంబానికి అవసరమైన నిత్యావసర సరుకులను తన సొంత ఖర్చులతో అందిస్తూ వస్తున్నారు.

భరత్ కుటుంబానికి సొంత ఇల్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం కలెక్టర్ దృష్టికి రావడంతో ఆయన వెంటనే స్పందించారు. ప్రభుత్వం తరపున ఆ కుటుంబానికి 225 గజాల ఇంటి స్థలాన్ని మంజూరు చేయించారు. గురువారం ఆ స్థలంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి కలెక్టర్ స్వయంగా భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఒక కీలకమైన విషయాన్ని భరత్ తో పంచుకున్నారు. తనకు జిల్లా నుండి బదిలీ అయిందని.. తాను వెళ్ళిపోతున్నానని చెప్పారు. అయితే బదిలీ అయినా తన బాధ్యతను విస్మరించబోనని.. భరత్ కు ఏ కష్టం వచ్చినా ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని.. తనను సంప్రదించాలని భరోసా ఇచ్చారు.

Advertisement

ఇంటి నిర్మాణ పనులను నాణ్యతతో.. అత్యంత వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. బదిలీ ఆర్డర్ చేతిలో ఉన్నా.. ఒక సామాన్యుడికి ఇచ్చిన మాట కోసం సమయం వెచ్చించి భూమి పూజకు రావడం కలెక్టర్ హనుమంత రావు నిబద్ధతకు నిదర్శనం. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శేఖర్ రెడ్డి.. తహశీల్దార్ శ్రీనివాస్ రెడ్డి.. ఎంపీడీఓ.. సబ్ ఇన్స్పెక్టర్.. పంచాయతీ సెక్రటరీ.. స్థానిక సర్పంచ్.. వార్డు సభ్యులు పాల్గొన్నారు. కలెక్టర్ చేసిన ఈ పని పట్ల గ్రామస్థులు.. జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: Hyderabad Traffic Police: వాహనదారులకు అలర్ట్, మార్చి 1 నుంచి ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్స్.. ఎందుకంటే?

Related News

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

సీఎం హైదరాబాద్‌కు రాకముందే.. మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా? కాసేపట్లో మీడియా ముందుకు..

Big Stories

Advertisement
×