E-Paper
Advertisement

Nandi Award: మాట జారాను.. సారీ చెప్పిన నిర్మాత వంశీ నందిపాటి!

Nandi Award: మాట జారాను.. సారీ చెప్పిన నిర్మాత వంశీ నందిపాటి!
Advertisement

Nandi Award: రీసెంట్‌గా యంగ్ నిర్మాత వంశీ నందిపాటి (Vamsi Nandipati) ‘నంది అవార్డు’ (Nandi Award)ను పోల్చిన తీరు కాంట్రవర్సీ అయిన విషయం తెలిసిందే. ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ ఈవెంట్‌లో.. అందులో నటించిన లయ గురించి చెబుతూ.. ‘లయకు అప్పట్లో నందులు పందుల్లా వచ్చాయి’ అని నోరు జారారు. వాస్తవానికి ఆయన ఉద్దేశం నంది అవార్డులను కించపరచడం కాదు, ప్రాస కోసం వెళ్లి.. ఇరుకున పడ్డారు. ‘నాన్నా పందులే గుంపులుగా వస్తాయి’ అనే డైలాగ్ ప్రకారం.. ఆమె నటనకు నందులు ఎన్నో వచ్చాయి అని చెప్పడానికి ఆయన ఈ విధంగా ప్రాసకు పోయి కాంట్రవర్సీలో చిక్కుకున్నారు. ఆయన నంది అవార్డులను అవమానించారంటూ ఆ రోజు నుంచి ఏ మీడియా పడితే ఆ మీడియా, ఎక్కడ పడితే అక్కడ.. ఏసుకుంటూనే ఉంది. ఇక, ఈ గోల అంతా ఎందుకని భావించిన వంశీ నందిపాటి, తాజాగా జరిగిన ‘హే బల్వంత్’ సక్సెస్ మీట్‌లో సారీ చెబుతూ.. తన స్టేట్‌మెంట్‌పై వివరణ కూడా ఇచ్చారు.

Also Read- Allu Arjun -Mrunal Thakur: అల్లు అర్జున్ అట్లీ సినిమాలో మృణాళ్ ఠాకూర్..హింట్ ఇచ్చిన బన్నీ!

మాట దొర్లాను.. సారీ!

Advertisement

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఆ ఈవెంట్‌లో సడెన్‌గా మాట దొర్లాను. అది నా స్టేట్‌మెంట్‌ కాదు. తప్పుగా వెళ్లింది. 12 సంవత్సరాల క్రితం ఎవరో అన్న స్టేట్‌మెంట్‌ను గుర్తు చేశాను. అప్పట్లో ఇలా అనేవారు అన్నాను. నాకు దేవుడి మీద, అవార్డ్స్‌ మీద అపారమైన గౌరవం వుంది. దేవుడు అంటే ఎంతో భక్తి ఉందో, అవార్డ్స్‌ మీద కూడా అంతే గౌరవం ఉంది. నాకు చిన్నప్పటి నుండి నంది అవార్డ్స్‌ వంటి అవార్డు అందుకోవాలని ఆశగా ఉండేది. ఆ కలతోనే సినీ పరిశ్రమకు వచ్చాను. అలాంటి గొప్ప అవార్డ్స్‌ గురించి నేను తప్పుగా ఎందుకు మాట్లాడతాను. నా వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉండే ఐయామ్‌ రియల్లీ సారీ’’ అని కాంట్రవర్సీపై వంశీ స్పందించారు. ఆయనే తన మిస్టేక్ తెలుసుకుని సారీ చెప్పారు కాబట్టి.. ఇంతటితో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడిందనే అనుకోవచ్చు.

Also Read- The Kerala Story 2: ‘ది కేరళ స్టోరీ 2’ రిలీజ్‌కు కేరళ హైకోర్టు బ్రేక్.. సెన్సార్ బోర్డు తీరుపై ఆగ్రహం

పది కోట్ల పెట్టుబడి వచ్చేసింది

Advertisement

ఇంక ‘హే బల్వంత్’ గురించి వంశీ నందిపాటి మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా విషయంలో మేము చాలా హ్యపీగా ఉన్నాం. ఈ సినిమాకు బ్రేక్‌ ఈవెన్‌ కావడం ముఖ్యంగా నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చే విషయం. చాలా తక్కువ మంది మాత్రమే మా సినిమాకు బ్రేక్‌ ఈవెన్‌ అయ్యిందని దైర్యంగా చెబుతారు. అలాంటి కోవలో ‘హే బల్వంత్’ కూడా నిలిచినందుకు ఆనందంగా ఉంది. ఎప్పుడైనా సరే, నిర్మాత నిలబడితే ఎన్నో మంచి సినిమాలు వస్తాయి. ప్రొడ్యూసర్‌ మనీ రికవరీ అయితేనే ఆ సినిమా సక్సెస్‌ఫుల్‌ సినిమాగా నిలుస్తుంది. ఆ విషయంలో ఈ సినిమా విజయం సాధించింది. త్వరలోనే దర్శకుడు గోపీతో మరో సినిమా చేస్తున్నాం. ‘హే బల్వంత్’ సినిమాను దాదాపు 10 కోట్ల బడ్జెట్‌తో నిర్మించాం. ఓటీటీ, శాటిలైట్‌, ఇతర హక్కులు, థియేటర్స్‌ కలెక్షన్స్‌ అన్ని కలిసి ఆ పది కోట్లు పెట్టుబడి సాధించాం. యూఎస్‌లో కూడా మంచి వసూళ్లు వచ్చాయి. రానున్న రోజుల్లో ప్రాఫిట్స్‌ జోన్‌లోకి వెళ్లనున్నాం’’ అని చెప్పుకొచ్చారు.

Also Read- AAFA: ఏడాదికి ఒక మంచి పని.. రాయలసీమ జిల్లాల్లో అల్లు అర్జున్ సామ్రాజ్యం ఏర్పాటు!

Related News

కృష్ణాష్టమి రోజున కల నెరవేరిందంటున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

Big Stories

Advertisement
×