T20 World Cup 2026: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ మరో నెల రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇండియా పైన రివేంజ్ తీర్చుకునేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కొత్త కుట్రలకు తెర లేపినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే పాకిస్తాన్ టి20 కెప్టెన్ సల్మాన్ అలీ అఘా ( Salman Ali Agha ) సంచలన ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ పాకిస్తాన్ గెలవడం గ్యారంటీ అని ఆయన పేర్కొన్నారట. అంతేకాదు ఫైనల్స్ గెలిచిన తర్వాత ICC బాస్ జై షా చేతుల మీదుగా టీ20 ప్రపంచ కప్ 2026 టైటిల్ తాను అస్సలు తీసుకోబోనని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారట పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా. ఈ మేరకు సోషల్ మీడియాలో సల్మాన్ అలీ అఘా చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి.
ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్న టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో పాకిస్తాన్ ఛాంపియన్ గా నిల్వనుందని ఆ జట్టు కెప్టెన్ సల్మాన్ అలీ అఘా సంచలన ప్రకటన చేశారు. రూల్స్ ప్రకారం టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ఏ జట్టు గెలిచినా కూడా ఐసీసీ బాస్ జై షా టైటిల్ అందజేస్తారు. ఒకవేళ పాకిస్తాన్ గెలిచినా కూడా జై షా చేతుల మీదుగానే వాళ్ళు అందుకోవాలి. అయితే ఈ విషయం పైన పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా రియాక్ట్ అయ్యాడు. ఛాంపియన్ గా నిలిచిన తర్వాత ఐసీసీ చేతుల మీదుగా అస్సలు టైటిల్ తీసుకోబోనని వెల్లడించారు. తమకు టైటిల్ ఇవ్వకపోయినా సరే, తమ శత్రువు ఇండియాకు జై షా చేతుల మీదుగా అస్సలు టైటిల్ అందుకోబోనని వెల్లడించారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ మేరకు సల్మాన్ అలీ అఘాకు ఆదేశాలు ఇచ్చిందట. అందుకే ఈ ప్రకటన చేశాడట పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా.
ఆసియా కప్ 2025 టోర్నమెంట్ విజేతగా సూర్య కుమార్ సేన నిలిచిన సంగతి తెలిసిందే. అప్పుడు ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ జట్టును చిత్తుగా ఓడించిన టీమిండియా, టైటిల్ గెల్చుకుంది. కానీ ఆ టైటిల్ మాత్రం సూర్య కుమార్ యాదవ్ తీసుకోలేదు. ఇండియా అలాగే పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఏషీయన్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ గా ఉన్న నఖ్వీ చేతుల మీదుగా టైటిల్ అందుకోవడం ఇష్టం లేక వెనుతిరిగాడు సూర్య కుమార్ యాదవ్. ఇప్పటికీ కూడా అతని దగ్గర టైటిల్ ఉంది. అయితే దీనికి కౌంటర్ గా పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా తాజాగా ప్రకటన చేశాడట. నఖ్వీని అవమానించినందుకుగాను జై షాను అవమానించేలా కుట్రలకు తెర లేపుతున్నారట. అయితే ఈ న్యూస్ బయటకు రావడంతో సల్మాన్ అలీపై దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఒరేయ్ మిమ్మల్ని గ్రూప్ స్టేజిలోనే ఎలిమినేట్ చేస్తాం.. టైటిల్ ఫైనల్ వరకు అస్సలు అడుగుపెట్టనివ్వబోమని టీమిండియా ఫ్యాన్స్ హెచ్చరిస్తున్నారు.