Mumaith khan: ముమైత్ ఖాన్ సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు ఒకానొక సమయంలో ఏదైనా ఒక సినిమా విడుదల అవుతుంది అంటే కచ్చితంగా ముమైత్ ఖాన్ (Mumaith khan) సినిమాలో స్పెషల్ సాంగ్ చేయాల్సిందే. ఇక సినిమాలో స్పెషల్ సాంగ్ ఉండాలి అంటే దర్శక నిర్మాతలకు కూడా ముమైత్ ఖాన్ గుర్తుకు వచ్చేవారు. ఇలా ప్రతి ఒక్క స్టార్ హీరో సినిమాలలో స్పెషల్ సాంగ్స్ ద్వారా ప్రేక్షకులను పెద్ద ఎత్తున మెప్పించిన ముమైత్ ఖాన్ ఇటీవల కాలంలో పూర్తిగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తన అనారోగ్య సమస్యల గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.
ముమైత్ ఖాన్ 2016వ సంవత్సరంలో ప్రమాదానికి గురైనట్టు తెలియజేశారు. సినిమా షూటింగ్లో భాగంగా ఈమె ప్రమాదానికి గురి కావడంతో తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నట్టు తెలుస్తుంది. ఈ ప్రమాదం కారణంగా తన మెదడులోని నరాలు పూర్తిగా దెబ్బతిన్నాయని, తద్వారా ఏడు సంవత్సరాల పాటు మంచానికే పరిమితం అయ్యానని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ ప్రమాదం కారణంగా 15 రోజులు కోమాలోకి వెళ్లిపోయాను. అలాగే పనికి కూడా దూరంగా ఉండాలని వైద్యులు సూచించినట్లు తెలిపారు. ఇలా డాక్టర్లు సలహా మేరకే తాను ఇండస్ట్రీకి దూరం కావలసి వచ్చిందని ముమైత్ ఖాన్ తెలిపారు.
ఇలా మెదడులో నరాలు దెబ్బ తినడం వల్ల తనకు ఫిట్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని తద్వారా దీర్ఘకాలికంగా మందులు వాడాలని డాక్టర్లు సూచించినట్లు తెలిపారు .అయితే మందులు ఎక్కువగా ఉపయోగించడంతో బరువు పెరగడం వంటి సమస్యలను కూడా ఎదుర్కొన్నానని ఈమె తెలియజేశారు. ఆ కష్టకాలం నన్ను ఎంతగానో కృంగదీసిందని, తిరిగి కోలుకోవడానికి తనకు చాలా సమయం పట్టిందని ముమైత్ ఖాన్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఇప్పుడిప్పుడే తాను ఆరోగ్యపరంగా పూర్తిగా కోలుకున్నానని తెలిపారు.
ముమైత్ ఖాన్ రీ ఎంట్రీ ఇస్తారా?
ఇలా ఉన్నఫలంగా సినిమా ఇండస్ట్రీకి దూరమైనటువంటి ముమైత్ ఖాన్ ఎక్కడ కనిపించకపోవడంతో అభిమానులు కూడా ఎన్నో సందేహాలను వ్యక్తం చేశారు అయితే పలు సందర్భాలలో ఈమె తన ఆరోగ్య పరిస్థితులు గురించి తెలియజేశారు. ఇలా ఒకానొక సమయంలో స్పెషల్ సాంగ్స్ ద్వారా వెండి తెరపై ప్రేక్షకులను సందడి చేసిన ఈమె ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవడం తెలిసిన అభిమానులు కూడా షాక్ అవుతున్నారు. ఇక ఇప్పుడిప్పుడే అనారోగ్య సమస్యల నుంచి బయటపడిన ముమైత్ ఖాన్ తిరిగి ఇండస్ట్రీలోకి వస్తారా? రారా అనే విషయాలు తెలియాల్సిందే. ఇక ఈమె స్పెషల్ సాంగ్స్ చేసిన వాటిలో బంగారు కోడిపెట్ట, ఇప్పటికింకా నా వయసు అనే పాటలు ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను తీసుకువచ్చాయి.
Also Read: Anil Ravipudi: నటుడిగా ఛాన్స్ వస్తే ఆ పాత్రలో చేస్తా… మనసులో కోరిక బయటపెట్టిన అనిల్ రావిపూడి!