E-Paper
Advertisement

Munna Re Release: ఫ్యాన్స్ సిద్ధమవ్వండమ్మా.. మున్నా వస్తున్నాడు

Munna Re Release: ఫ్యాన్స్ సిద్ధమవ్వండమ్మా.. మున్నా వస్తున్నాడు
Advertisement

Munna Re Release: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రీ-రిలీజ్ ట్రెండ్ ఇప్పుడప్పుడే తగ్గేలా లేదు. తాజాగా ఈ క్రేజీ లిస్టులోకి రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) నటించిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మున్నా’ (Munna) వచ్చి చేరింది. వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, ప్రభాస్ స్టైలిష్ లుక్, యాక్షన్ సీక్వెన్స్‌లతో అప్పట్లో ఒక ఊపు ఊపింది. ఇప్పుడీ చిత్రాన్ని మార్చి 6వ తేదీన థియేటర్లలో గ్రాండ్‌గా రీ-రిలీజ్ చేయబోతున్నారు. ఈ మేరకు కౌంటింగ్ మొదలైంది. ఇంకా 8 రోజుల్లో అంటూ, మేకర్స్ వదిలిన పోస్టర్ వైరల్ అవుతోంది. ఈ పోస్టర్‌లో ప్రభాస్, ఇలియానా రొమాంటిక్ మూడ్‌లో ఉన్నారు. ఇది సాంగ్‌కి సంబంధించిన పోస్టర్. ఈ పోస్టర్‌లో ఇలియానా అందాలు మాములుగా లేవు. ప్రభాస్ మాస్ మేనరిజమ్స్‌ను మళ్ళీ వెండితెరపై చూసేందుకు అభిమానులు సిద్ధమవుతున్నారు.

Also Read- Samantha: కూతురు వల్ల ఎదురైన మానసిక ఒత్తిడి చెప్పిన ప్రియాంక చోప్రా.. ఎమోషనల్ అయిన సమంత..!

ఇలియానాతో కెమిస్ట్రీ అదిరింది

Advertisement

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలలో ఒకటైన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) బ్యానర్‌పై దిల్ రాజు (Dil Raju) ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మించారు. ఈ సినిమాకు రాక్‌స్టార్ హారిస్ జయరాజ్ అందించిన సంగీతం అప్పట్లో సెన్సేషన్ సృష్టించింది. ముఖ్యంగా ఇందులోని పాటలు ఇప్పటికీ శ్రోతలను ఉర్రూతలూగిస్తూనే ఉన్నాయి. ఈ రీ-రిలీజ్ పోస్టర్‌లో ప్రభాస్, ఇలియానా కెమిస్ట్రీతో పాటు బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపిస్తున్న వర్షం ఎఫెక్ట్ సినిమాలోని విజువల్స్ ఎంత బాగుంటాయో గుర్తుచేస్తోంది. స్టైలిష్ యాక్షన్ మూవీగా గుర్తింపు పొందిన ‘మున్నా’ మళ్ళీ థియేటర్లలోకి వస్తుండటంతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సందడి నెలకొంటుందో అని అంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. రీసెంట్‌గా వచ్చిన ‘ది రాజా సాబ్’ (The Raja Saab) చిత్రంతో ప్రేక్షకులను మెప్పించలేక పోయిన ప్రభాస్.. ఈ రీ రిలీజ్‌తో ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇవ్వబోతున్నారనమాట.

Also Read- Sree Vishnu: రెండు సినిమాలు ఏకకాలంలో.. ఓటీటీ సమస్యతో పాటు ఇంకో సమస్య కూడా ఉంది!

మార్చి 6 కోసం వెయిటింగ్

Advertisement

ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ పోషించిన విలన్ పాత్ర, ప్రభాస్ మధ్య జరిగే మైండ్ గేమ్స్ ప్రేక్షకులకు మంచి కిక్ ఇస్తాయి. కొరటాల శివ మాటలు, సి. రామ్ ప్రసాద్ విజువల్స్ ఈ సినిమాకు ప్రధాన బలం. ప్రస్తుత సోషల్ మీడియా కాలంలో ప్రభాస్ ఇమేజ్ గ్లోబల్ లెవల్‌కు చేరుకోవడంతో, ఈ ఓల్డ్ క్లాసిక్ సినిమాకు యూత్ నుంచి భారీ రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది. మార్చి 6 కోసం వెయిటింగ్ అంటూ.. అప్పుడే ప్రభాస్ ఫ్యాన్స్ నెట్టింట రచ్చ చేస్తున్నారు. థియేటర్లలో మాస్ సెలబ్రేషన్స్ చేసుకోవడానికి అన్నీ సిద్ధం చేస్తున్నారు. చూద్దాం మరి.. రీ రిలీజ్ ట్రెండ్‌లో ఈ సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో..

Also Read- Rashmika Mandanna: విజయ్ నా భర్త.. వర్ణించడానికి మాటలు లేవు.. రష్మిక ఎమోషనల్ పోస్ట్!

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×