E-Paper
Advertisement

Rashmika Mandanna: విజయ్ నా భర్త.. వర్ణించడానికి మాటలు లేవు.. రష్మిక ఎమోషనల్ పోస్ట్!

Rashmika Mandanna: విజయ్ నా భర్త.. వర్ణించడానికి మాటలు లేవు.. రష్మిక ఎమోషనల్ పోస్ట్!
Advertisement

Rashmika Mandanna: రష్మిక మందన్న విజయ్ దేవరకొండ వివాహం ఎంతో అంగరక వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఉదయ్ పూర్ లోని ఐటీసీ మెమోంటోస్ రిసార్ట్ లో వీరి వివాహపు వేడుక ఎంతో ఘనంగా జరిగింది. గత మూడు రోజులుగా వీరి పెళ్లి వేడుకలు జరుగుతున్న సంగతి తెలిసిందే .నేడు ఉదయం రష్మిక విజయ్ దేవరకొండ హిందూ సాంప్రదాయాల ప్రకారం పెళ్లి బంధంలోకి అడుగు పెట్టారు. అతిథులు కుటుంబ సభ్యుల సమక్షంలో వేదమంత్రాల నడుమ రష్మిక మెడలో విజయ్ దేవరకొండ మూడు ముళ్ళు వేశారు. రష్మిక మందన్న విజయ్ దేవరకొండ వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో నేర్పిన వ్యక్తి..

ఈ క్రమంలోనే రష్మిక పెళ్లి ఫోటోలను షేర్ చేస్తూ తన భర్త విజయ్ దేవరకొండ గురించి ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. ఈ సందర్భంగా రష్మిక ఈ ఫోటోలను షేర్ చేస్తూ నా భర్తను ఇప్పుడు మీకు పరిచయం చేస్తున్నాను మిస్టర్ విజయ్ దేవరకొండ.. నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో నాకు నేర్పించిన వ్యక్తి. ప్రతిరోజు పెద్ద కలలు కనడం, వాటిని సాధించడం , శాంతితో ఉండటం నాకు నేర్పించిన వ్యక్తి . నేను నా స్నేహితులతో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆ పని వ్యక్తి. నన్ను నమ్మండి కచ్చితంగా ఈ వ్యక్తి గురించి ఒక పుస్తకం రాయగలను. నిజంగా నేను ఎంతో ఆశీర్వదించబడ్డాను. విజ్జు నీ పట్ల నాకున్న భావాలను వర్ణించడానికి నాకు మాటలు సరిపోవడం లేదు.

మీ భార్యగా ఉండటానికి..

Advertisement

నా జీవితంలోనీ కష్టాలు, ఆనందం, విజయాలు ప్రతిదీ నీకు తెలుసు. నేను మీ భార్యగా ఉండటానికి చాలా ఉత్సాహంగా ఉన్నాను.. మీ భార్యగా ఉండటానికి.. ఇది సెలబ్రేషన్ టైం.. ఇదివరకు ఎప్పుడూ లేనివిధంగా మనం కలిసి ఉత్తమమైన జీవితాన్ని గడుపుదాం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటూ ఈమె విజయ్ దేవరకొండ గురించి వర్ణిస్తూ తన భావాలను బయట పెడుతూ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇలా రష్మిక పెళ్లికి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు పెద్ద ఎత్తున ఈ కొత్త జంటకు అభినందనలు తెలియజేస్తున్నారు.

Advertisement

ఇక ఈ పెళ్లి వేడుకలలో భాగంగా వీరిద్దరూ సాంప్రదాయ దుస్తులను ధరించి ఎంతో చూడముచ్చటగా ఉన్నారు. ఒంటి నిండా నగలతో ఈ జంట తెలుగు సాంప్రదాయం ప్రకారం వివాహాన్ని జరుపుకున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చాయి. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట నేడు పెళ్లి బంధంతో ఒకటైన విషయం తెలిసిందే. ఇలా కొద్దిమంది అతిథులు సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరగగా, మార్చి 4వ తేదీ వీరిద్దరూ ఎంతో ఘనంగా వివాహ రిసెప్షన్ ఏర్పాటు చేయబోతున్నారు. హైదరాబాదులో జరుగుతున్న ఈ రిసెప్షన్ కు టాలీవుడ్ సెలబ్రిటీలతోపాటు అభిమానులు రాజకీయ నాయకులు కూడా హాజరు కాబోతున్నట్టు తెలుస్తోంది.

Also Read: Allu Arjun -Mrunal Thakur: అల్లు అర్జున్ అట్లీ సినిమాలో మృణాళ్ ఠాకూర్..హింట్ ఇచ్చిన బన్నీ!

Related News

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

ప్రమాదానికి గురైన అలీ..కాలికి పెద్ద కట్టుతో అలా..ఏమైందంటే?

Big Stories

Advertisement
×