E-Paper
Advertisement

Gv Prakash : ఓ వ్యక్తి చేతిలో దారుణంగా మోసపోయిన మ్యూజిక్ డైరెక్టర్.. తల్లి అంత్యక్రియలు

Gv Prakash : ఓ వ్యక్తి చేతిలో దారుణంగా మోసపోయిన మ్యూజిక్ డైరెక్టర్.. తల్లి అంత్యక్రియలు
Advertisement

Gv Prakash : ఈమధ్య జనాలను మోసం చేసేందుకు కేటుగాళ్లు రూటు మార్చారు.. ఒకప్పుడు డైరెక్ట్ గా అకౌంట్స్ లోని డబ్బులను స్వాహా చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు సింపతీతో మోసం చేస్తున్నారు. సామాన్యుల సంగతి పక్కన పెడితే సెలబ్రిటీలు కూడా చాలామంది ఇలాంటి వారి వలలో చిక్కుకొని మోసపోతున్నారు. ఎంతోమంది హీరోయిన్లు తమకు జరిగిన మోసాన్ని బయట పెట్టారు. తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ హీరో జీవీ ప్రకాష్ కూడా ఓ వ్యక్తి చేతిలో దారుణంగా మోసపోయాడు.. సోషల్ మీడియాల్లో నకిలీ ప్రచారంతో ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ ని మోసం చేసాడు. నాటకాలు ఆడి మ్యూజిక్ డైరెక్టర్ని బుట్టలో వేసుకున్నాడు.. ఆ తర్వాత డబ్బులు రాగానే ఫోన్ ఎత్తడం మానేశాడట. తాను మోసపోయానని తెలుసుకున్న జీవి ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా బయటపెట్టారు. ప్రస్తుతం ఇది కోలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.. అలా ఎలా మోసపోయాడో ఒకసారి మనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

కేటుగాడి చేతిలో దారుణంగా మోసపోయిన హీరో..

తమిళ మ్యూజిక్ డైరెక్టర్, హీరో జీవి ప్రకాష్ తాను మోసపోయిన విషయాన్ని బయటపెట్టారు. ఈ మధ్య మ్యూజిక్ డైరెక్టర్ గా కన్నా నటుడుగా తన సత్తాను చాటుతున్నాడు.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తున్నాడు. ఈ మధ్య కాంట్రవర్సీలలో కూడా ఇరుక్కుంటున్నాడు. ఇక విషయానికొస్తే.. హీరో జీవి ప్రకాష్ ఓ వ్యక్తి చేతిలో దారుణంగా మోసపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. తనను సాయమడిగిన వారికి హీరో ఎప్పుడూ సాయం చేస్తూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే.. అలాగే ఈసారి కూడా సాయం చేసి మోసపోయాడు. ఓ వ్యక్తి విగత జీవిగా పడి ఉన్న వృద్ధురాలి ఫోటోను పోస్ట్ చేసి, ఆమె తన తల్లి అని తన తండ్రి పోయాక, కుటుంబాన్ని పోషించేందుకు ఎంతో కష్టపడిందని రాసాడు.. ఈ విషయంపై ఆరా తీయకుండానే గుడ్డిగా నమ్మిన మ్యూజిక్ డైరెక్టర్ జీవీ అతనికి 20 వేల రూపాయలను పంపించాడట. ఆ తర్వాత అతనికి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదని సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం ఇది నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ ఇలాంటివారిని ఊరికే క్షమించకూడదు అని పోలీసులకు ట్యాగ్ చేస్తున్నారు. మరి దీనిపై పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి..

Advertisement

Also Read : వార్ 2 నష్టాలు.. 18 కోట్లు రిటర్న్ పై ఓపెన్ అయిన నిర్మాత..

జీవి సినిమాల విషయానికొస్తే.. 

కోలీవుడ్ లో టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్లలో జీవి ప్రకాష్ ఒకరు.. ఈయన సంగీతం అందించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్‌గా వర్ఖ్ చేస్తూనే మరో పక్క నటుడిగానూ తన సత్తా చాటుకుంటున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్‌గా జీవీ చేతిలో బోలెడు సినిమాలు ఉన్నాయి.. ప్రస్తుతం ఆయన `పరాశక్తి`, సూరి `మందాడి`తో పాటు సూర్య 46, ధనుష్ 54, దుల్కర్ 41 ప్రాజెక్ట్, అజయ్ భూపతి బిగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. అలాగే హీరోగా కూడా ఓ రెండు సినిమాల్లో నటిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే ఈయన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. ఇటీవలే తన భార్యతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.. హీరోయిన్ దివ్యభారతి తో రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. కానీ ఈ వార్తల్లో నిజం లేదని హీరోయిన్ ఇటీవలే క్లారిటీ ఇచ్చింది..

Related News

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×