E-Paper
Advertisement

War 2 : వార్ 2 నష్టాలు.. 18 కోట్లు రిటర్న్ పై ఓపెన్ అయిన నిర్మాత..

War 2 : వార్ 2 నష్టాలు.. 18 కోట్లు రిటర్న్ పై ఓపెన్ అయిన నిర్మాత..
Advertisement

War 2 : గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్, బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ నటించిన లేటెస్ట్ చిత్రం వార్ 2.. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డీలా పడింది. భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాను మిక్స్డ్ టాక్ దక్కింది. అంతే కాదు పెట్టిన బడ్జెట్ కూడా ఈ సినిమాకు రాలేదని మరో వార్త ఇండస్ట్రీలో గత కొద్దిరోజులుగా ప్రచారంలో ఉంది. ఈ విషయంపై ఇన్నాళ్లకు క్లారిటీ వచ్చినట్లు తెలుస్తుంది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత నాగ వంశీ సినిమా నష్టాల గురించి క్లారిటీ ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఈ మూవీ కలెక్షన్స్ పై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అసలు నాగ వంశీ ఏమన్నారో ఒకసారి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

వార్ 2 నష్టం పై ఓపెన్ అయిన నిర్మాత..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాత నాగవంశీ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఎన్నో భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించారు. ఆయన నిర్మించిన చిత్రాలలో ఈమధ్య ఏ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్టుగా నిలవలేదు. ఈ ఏడాదిలో వచ్చిన సినిమాలు కూడా యావరేజ్ టాక్ ని సొంతం చేసుకున్నాయి. ప్రస్తుతం ఏనా అనగనగా ఒక రాజు సినిమాను నిర్మిస్తున్నారు. టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి ఇందులో హీరోగా నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా ఆయన ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్న ఆయన వార్ 2 నష్టాల గురించి ఓపెన్ అయ్యాడు.. ఆయన మాట్లాడుతూ.. వార్ 2 సినిమాను కొన్నదే రూ.68 కోట్లకు అని, అందులో రూ.40 కోట్ల షేర్ వచ్చిందని.. ఇక యశ్ రాజ్ ఫిల్మ్స్ తనను పిలిచి రూ.18 కోట్లు తిరిగి ఇచ్చిందని అతడు చెప్పాడు.. నీ వల్ల నాకు పెద్దగా ఈ సినిమాకు నష్టాలు ఏమీ రాలేదు. వాళ్లు కార్పొరేట్ సంస్థతో లింక్ అయి ఉన్నా కూడా అడిగిన వెంటనే నాకు పిలిచి మరి 18 కోట్లు వెనక్కి ఇచ్చారు అని నిర్మాత అసలు నిజాన్ని ఇన్నాళ్లకు బయట పెట్టారు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవ్వడంతో టాలీవుడ్ లో దీనిపై చర్చలు మొదలయ్యాయి.

Advertisement

Also Read : చక్రికి మహా సపోర్ట్..కేశవ్ ప్లాన్ సక్సెస్ అవుతుందా..? మాట నిలబెట్టుకున్న చక్రీ..

అనగనగా ఒక రాజు మూవీ..

జాతి రత్నాలు సినిమాతో ప్రేక్షకులకు దగ్గరైన నవీన్ పోలిశెట్టి బ్యాక్ టు బ్యాక్ హెడ్చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈయన అనగనగా ఒక రాజు సినిమాలో నటిస్తున్నారు.. గత కొద్ది రోజులుగా ఈ సినిమాకు భారీ హైప్ క్రియేట్ అయింది. సంక్రాంతి కానుకగా మూవీ జనవరిలో థియేటర్లలోకి రాబోతుంది.. కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉండడంతో చిత్ర యూనిట్ ఈ సినిమా ప్రమోషన్స్ లో జోరుని పెంచారు. హీరో హీరోయిన్లు మాత్రమే కాదు అటు నిర్మాత కూడా సినిమాను ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. ఈ సినిమాను నిర్మాత నాగవంశీ నిర్మించారు. మూవీ జనవరి 14న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.. గతంలో ఎలాగైతే మ్యాడ్ సినిమా ఎలా వచ్చిందో అలాంటి స్టోరీ తోనే ఈ సినిమా కూడా రాబోతుందని నాగవంశీ అన్నారు.. ఈమధ్య ఈయన ఏ సినిమా గురించి చెప్తే ఆ మూవీ రిజల్ట్ దారుణంగా ఉంటుంది. మరి ఈ మూవీ అయిన హిట్ అవుతుందేమో చూడాలి..

Related News

చిన్న వయసులోనే గొప్ప మనసు చాటుకున్న సితార.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్!

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

Big Stories

Advertisement
×