E-Paper
Advertisement

భార్యతో విడాకులైనా రిలేషన్ మెయింటైన్ చేస్తున్న హీరో.. ఇదేం లాజిక్ గురూ!

భార్యతో విడాకులైనా రిలేషన్ మెయింటైన్ చేస్తున్న హీరో.. ఇదేం లాజిక్ గురూ!
Advertisement

G.V. Prakash: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో సంగీత దర్శకుడిగా తన సంగీతంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తూ ఎంతో ఒక మంచి సక్సెస్ అందుకున్న వారిలో దర్శకుడు జీవి ప్రకాష్(G.V.Prakash) ఒకరు. రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం ఇరుముడి సినిమాకు సంగీత దర్శకుడుగా పనిచేసిన ఈయన ఈ సినిమాతో సూపర్ బ్లాక్ బాస్టర్ అందుకున్నారు. ఇలా సంగీత దర్శకుడిగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న జీవీ ప్రకాష్ త్వరలోనే హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. జీవి ప్రకాష్ హీరోగా పరిచయమవుతూ “ఇమ్మోర్టల్”(Immortal) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమతున్నారు.

భార్య సైంధవితో విడాకులు..

ఇలా జీవి ప్రకాష్ హీరోగా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 4వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జీవి ప్రకాష్ తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడారు. ముఖ్యంగా తన భార్య సైంధవికి విడాకులు ఇవ్వడం ఆమెతో తనకు ఉన్నటువంటి రిలేషన్ గురించి కూడా మాట్లాడారు. జీవి ప్రకాష్ సైంధవి చిన్ననాటి నుంచి స్నేహితులు వీరిది ప్రేమ వివాహం అయినప్పటికీ ఒక కుమార్తె జన్మించిన అనంతరం పలు కారణాలవల్ల విడాకులు తీసుకొని విడిపోయారు.

ముగిసింది వైవాహిక బంధం మాత్రమే..

Advertisement

ఇలా సైంధవితో తాను విడాకులు తీసుకొని విడిపోయినప్పటికీ ఆమెతో నా రిలేషన్ మాత్రం అలాగే కొనసాగిస్తూ ఉన్నానని తెలిపారు. మా మధ్య ముగిసింది కేవలం వైవాహిక బంధం మాత్రమేనని, మా స్నేహబంధం మాత్రం అలాగే కొనసాగుతుందని తెలిపారు. సైంధవి తనకు చిన్నప్పటినుంచి స్కూల్ ఫ్రెండ్ కావడంతో తన పట్ల ఉన్నటువంటి గౌరవం అలాగే ఉంది. తన నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత ఇద్దరం శత్రువులుగా మారాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇక మా ప్రేమకు గుర్తుగా జన్మించిన మా గారాల పట్టి అన్విని మేమిద్దరం కలిసి చాలా బాధ్యతగా పెంచుతున్నామని తెలిపారు.

వారిద్దరు జీవితంలో కీలకమైన వ్యక్తులు..

తన కుమార్తె అన్వి నా ప్రాణమని తెలిపారు. నా జీవితంలో సైంధవి ,అన్వి ఇద్దరు కీలకమైన వ్యక్తులు అంటూ జీవి ప్రకాష్ తన మాజీ భార్య గురించి అలాగే ఆమెతో ఉన్న అనుబంధం గురించి ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమ మధ్య ముగిసింది కేవలం వైవాహిక బంధం మాత్రమే కానీ స్నేహబంధం కాదంటూ ఈయన చెప్పడంతో అభిమానులు కూడా ఈ కామెంట్లపై విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. ఇక ప్రస్తుతం జీవి ప్రకాష్ సంగీత దర్శకుడిగాను, హీరోగా కూడా ఇండస్ట్రీలో బిజీ కానున్నారు.ఇక ఈయన నటించిన ఇమ్మోర్టల్ ఒక రొమాంటిక్ హారర్-ఫాంటసీ సినిమాకు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో జీవి ప్రకాష్ జోడీగా నటి కయాదులోహర్ నటించారు. ఈ సినిమాకు మరియప్పన్ చిన్నా దర్శకత్వం వహించారు.

Advertisement

Also Read: బాలయ్య NBK 111కు మాస్ టైటిల్..వైరల్ అవుతున్న వీడియో!

 

Related News

ఈ జనరేషన్‌కు మరో బ్రహ్మానందం దొరికేశాడు.. కోనా వెంకట్ కామెంట్స్!

గ్లామర్ మాత్రమే కాదు.. చీరకట్టులోనూ త్రిష అందం అదుర్స్!

రజనీకాంత్‌కు తిరుగులేదుగా.. ‘జైలర్ 2’ కలెక్షన్ల లెక్క ఇదే!

గ్యాంగ్‌స్టర్ సినిమా అనుకుంటే.. చిరంజీవి సినిమాలో అసలు ట్విస్ట్ ఇదే!

రేవంత్ రెడ్డి, కేసీఆర్‌తో పరిచయాలున్నా.. ఆ పని మాత్రం చేయలేదు!

స్పెషల్ అట్రాక్షన్ గా రణబీర్ వాచ్.. రాముడు, హనుమంతుడితో ప్రత్యేక డిజైన్..

దాసరి సినిమా షూటింగ్‌లో అసలేం జరిగింది? దివ్యవాణి బయటపెట్టిన విషయాలు

రణబాలి విషయంలో నేను చెప్పిందే జరిగింది.. విజయ్ కామెంట్స్ వైరల్!

Big Stories

Advertisement
×