E-Paper
Advertisement

వెలిగొండపై రేవంత్ సైలెంట్.. తెలంగాణకు తీరని ద్రోహం.. హరీశ్ రావు ధ్వజం!

వెలిగొండపై రేవంత్ సైలెంట్.. తెలంగాణకు తీరని ద్రోహం.. హరీశ్ రావు ధ్వజం!
Advertisement

Harish Rao: వెలిగొండ ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా తరలిస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోందని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీ అడ్డగోలుగా నీటి దోపిడీకి పాల్పడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం నోరు మెదపకపోవడం తెలంగాణ రైతాంగానికి చేస్తున్న తీరని ద్రోహమని మండిపడ్డారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం, కేఆర్ఎంబీ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. నీటి కేటాయింపులు లేకున్నా.. వరద జలాలు రాకున్నా.. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను యథేచ్ఛగా ఏపీ తరలిస్తోందని హరీశ్ రావు అన్నారు. కానీ సీఎం ఏమాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

ఒకవైపు ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో సాగునీటి కష్టాలు తీవ్రమవుతుంటే.. మరోవైపు ఏపీ ప్రభుత్వం తెలంగాణ నీటి హక్కులపై దండెత్తి కృష్ణా జలాలను అడ్డగోలుగా తరలిస్తోందన్నారు. ఒకవైపు కృష్ణా బేసిన్‌లో భాగమైన బీమా, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులకు నీళ్లు లేక ఆయకట్టులు ఎండిపోతుంటే.. మరోవైపు బేసిన్‌తో సంబంధం లేని ప్రాంతాలకు ఏపీ నిబంధనలు ఉల్లంఘిస్తూ, యధేచ్చగా నీటిని తరలిస్తోందన్నారు.

Advertisement

మాల్యాల, ముచ్చుమర్రి, పోతిరెడ్డిపాడు, నాగార్జున సాగర్ కుడి కాల్వ.. ఇప్పుడు వెలిగొండ అని మండిపడ్డారు. తెలంగాణ వాటా నీటిని ఏపీ తరలిస్తున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు నోరు మెదపడం లేదని హరీశ్ రావు ప్రశ్నించారు. రంగారెడ్డి, పాలమూరు, నల్లగొండ సహా తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తీరని ద్రోహం ఇదన్నారు.

Also Read: ‘సొంత గడ్డకు వచ్చా.. కన్నీళ్లు ఆగట్లేదు’.. నిజామాబాద్ సభలో కవిత భావోద్వేగం!

Advertisement

తెలంగాణకు దక్కాల్సిన కృష్ణా నీళ్లను మన పొలాలకు మళ్లించాల్సిన సీఎం రేవంత్.. ఏపీకి పరోక్షంగా ఎందుకు సహకరిస్తున్నారని ప్రశ్నించారు. ప్రాజెక్టుల నిర్వహణ, నీటి వినియోగాన్ని పర్యవేక్షించాల్సిన కేఆర్ ఎంబీ సైతం పట్టనట్లు వ్యవహరించడం దుర్మార్గం అన్నారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడాల్సిన సంస్థే ప్రేక్షకపాత్ర పోషిస్తే.. రాష్ట్ర నీటి హక్కులను ఎవరు కాపాడాలని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెంటనే దీనిపై స్పందించాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. కేఆర్ ఎంబీపై ఒత్తిడి తేవాలన్నారు. తెలంగాణలోని కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను నింపి, ఆయకట్టుకు నీటి సరఫరా జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు.

Also Read: ఎవరీ పూల సుబ్బయ్య? వెలిగొండ ప్రాజెక్టుకు ఆయన పేరు ఎందుకు పెట్టారు?

Tags

Related News

అనిరుధ్ – కావ్యా మారన్ పెళ్లి రిసెప్షన్.. సీఎం రేవంత్, కేటీఆర్‌కు ఆహ్వానం!

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత దృశ్యం.. మిరప తోటల్లో సినీ తారల ఫ్లెక్సీలు!

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

నకిలీ యూఎల్‌సీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు దందా కలకలం

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. మారనున్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు!

తెలంగాణలో హ్యుందాయ్ బిగ్ ప్లాన్.. రూ.8,528 కోట్లతో మెగా ప్రాజెక్ట్.. సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి!

నీ డేటా మొత్తం నా దగ్గర ఉంది పరేషాన్ కాకు.. కేటీఆర్‌ పై గజ్జెల కాంతం ఫైర్!

Big Stories

Advertisement
×