E-Paper
Advertisement

రెండు కోట్ల పరువు నష్టం దావా పై స్పందించిన హన్సిక వదిన ముస్కాన్..ఏమన్నారంటే!

రెండు కోట్ల పరువు నష్టం దావా పై స్పందించిన హన్సిక వదిన ముస్కాన్..ఏమన్నారంటే!

Hansika -Muskaan: హన్సిక మోత్వాని పరిచయం అవసరం లేని పేరు. హీరోయిన్ గా సౌత్ సినిమాలతో పాటు నార్త్ సినిమాలలో కూడా నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ఇటీవల కాలంలో తన వ్యక్తిగత విషయాల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. హన్సిక(Hansika) సోహెల్ ఖతూరియా (Sohael Khaturiya) అనే వ్యక్తిని ప్రేమించి 2022వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్న సంగతి తెలిసిందే. ఇలా వీరి బ్రేకప్ కావడంతో హన్సిక ఆడపడుచు ముస్కాన్ (Muskaan) హన్సిక కుటుంబం పై గత కొంతకాలంగా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేశారు.

రూ. 2 కోట్ల రూపాయల పరువు నష్టం దావా..

ఇలా హన్సిక కుటుంబ పరువు ప్రతిష్టలకు భంగం కలిగేలా ముస్కాన్ నాన్సీ జేమ్స్ వ్యాఖ్యలు ఉండడంతో ఈమె ఏకంగా తనపై పరువు నష్టం దావా కేసు నమోదు చేశారు. తన కుటుంబం పై ముస్కాన్ అసత్య ఆరోపణలు చేస్తుంది అంటూ ఆమెపై ఏకంగా రెండు కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేశారు. ఈ విషయం పట్ల కోర్టు కూడా ముస్కాన్ కు హన్సిక పట్ల ఎలాంటి అసత్య ఆరోపణలు చేయకూడదు అంటూ కోర్టు తీర్పు ఇచ్చింది. హన్సిక వేసిన పరువు నష్టం దావా గురించి సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేయడంతో తాజాగా ఆమె మాజీ ఆడపడుచు ముస్కాన్ సోషల్ మీడియా వేదిక స్పందించారు.

ఇదంతా పీఆర్ స్టంట్..

ఈ సందర్భంగా ఇన్స్టాగ్రామ్ వేదికగా ముస్కాన్ నాన్సీ జేమ్స్ స్పందిస్తూ.. హన్సిక తనపై పరువు నష్టం దావా వేసినట్టు ఇప్పటివరకు తనకు ఎలాంటి లీగల్ నోటీసులు రాలేదని ఈమె తెలిపారు. అయితే ఇదంతా కూడా పి ఆర్ స్టంట్ అంటూ ఈమె వ్యంగ్యంగా కామెంట్లు చేశారు. అసలు ఇలాంటి వార్తలను ఎవరు ప్రచారం చేస్తున్నారని ప్రశ్నించారు. నిజా నిజాలను బయట పెట్టడం కంటే కూడా ఈ ఆరోపణలను చాలా పెద్దవిగా చేసి చూపిస్తున్నారని తెలిపారు. గతంలో పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారని వార్తలు రావడంతో ఇద్దరి మధ్య వివాదం చెలరేగిందని తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ కేసు గురించి తనకు ఏ విధమైనటువంటి నోటీసులు అందలేదని ఈమె తెలియజేశారు.

హన్సిక ను రెండో పెళ్లి చేసుకున్న సోహెల్..

ఇకపోతే హన్సిక ముస్కాన్ మధ్య గత కొంతకాలంగా విభేదాలు కూడా చోటు చేసుకున్నాయని తెలుస్తోంది. ఇక ఈమె తన సోదరుడు సోహెల్ కతురియాను 2022వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు.. అయితే అప్పటికే సోహెల్ కు పెళ్లి జరిగి తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే .ఇక ఆయన మొదటి భార్య స్వయంగా హన్సిక ఫ్రెండ్ కావడం గమనార్హం. ఇలా సోహెల్ మొదటి పెళ్లి వేడుకలలో కూడా హన్సిక పాల్గొని సందడి చేశారు. ఇక సోహెల్ తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వడంతో హన్సికతో పరిచయం ఏర్పడటం ఆ పరిచయం కాస్త పెళ్లికి దారితీసింది. ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్న హన్సిక పెళ్లయిన నాలుగు సంవత్సరాలకే విడాకులు తీసుకుని విడిపోయారు.

Also Read: పెద్ది ఆలస్యానికి చరణ్ కారణమా?ఆ విషయంలో హ్యాపీగా లేరా?

Related News

అర్ధరాత్రి ఆ వీడియో డిలీట్ చేయడానికి కారణం అదే….. నిజం చెప్పేసిన బాలీవుడ్ బ్యూటీ!

‘రైరై రారా’ సాంగ్‌కు థియేటర్లోనే పూనకాలు.. ‘పెద్ది’ లేడీ ఫ్యాన్ మాస్ అరాచకం!

సడన్‌గా కాంట్రవర్సీలో ఇరుక్కున్న అనుష్క శర్మ.. ఆ ఒక్క పోస్టే కారణమా?

ఆమిర్ ఖాన్ కెరీర్ బెస్ట్ క్లాసిక్ ‘లగాన్’.. 25 ఏళ్ల వేడుకగా థియేటర్లలోకి రీ రిలీజ్!

‘డాన్ 3’ వివాదం.. రణ్‌వీర్ సింగ్‌పై ఆర్డర్ ఉపసంహరణ.. ఇంకా ముగియని గొడవ!

మెగా పవర్ స్టార్ బాక్సాఫీస్ జాతర.. ఊళ్లో సంబరాలు మామూలుగా లేవుగా..

దీపికా పదుకొణె డిప్రెషన్‌పై ప్రకాష్ పదుకొణె ఎమోషనల్.. ఏం జరిగిందంటే?

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, సీబీఎఫ్‌సీ మాజీ చీఫ్ కన్నుమూత.. ఏం జరిగిందంటే?

Big Stories

×