Maha Shivaratri: తెలుగువారు ఎంతో గొప్పగా జరుపుకునే పండుగలలో మహాశివరాత్రి పండుగ ఒకటి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆ శివయ్య మహత్యాన్ని తెలుపుతూ ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మహాశివరాత్రి రోజు జాగరణ చేసేవారు శివుడి మహత్యం తెలుసుకోవాలి అంటే తప్పకుండా చూడాల్సిన కొన్ని సినిమాలను ఇక్కడ తెలుసుకుందాం తెలుగులో ఎన్నో శివ మహత్యాన్ని తెలుపుతూ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మరి ఆ సినిమాలు ఏంటి అనేది ఇక్కడ తెలుసుకుందాం..
భక్త కన్నప్ప:
ఇప్పటివరకు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో శివుడి మహత్యాన్ని తెలుపుతూ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ భక్తకన్నప్ప సినిమా మాత్రం ఎప్పటికీ ఎంతో ప్రత్యేకమే అని చెప్పాలి. శివుడు భక్తుడి పాత్రలో నటుడు కృష్ణంరాజు ఎంతో అద్భుతంగా నటించిన తీరు అద్భుతమని చెప్పాలి ఈయన భక్తకన్నప్ప అనే పాత్రలో నటించారు అనడం కంటే జీవించారు అని చెప్పాలి. శివరాత్రి సందర్భంగా చూడవలసిన సినిమాలలో మొదటి సినిమా భక్తకన్నప్ప అనే చెప్పాలి.
శ్రీ మంజునాథం:
శివరాత్రి అనగానే టక్కున శ్రీ మంజునాథం సినిమా కూడా అందరికీ గుర్తుకు వస్తుంది. చిరంజీవి శివుడి పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు . దేవుడంటేనే నమ్మకం లేనటువంటి వ్యక్తి శివయ్యకు భక్తుడిగా ఎలా మారాడు అనే నేపథ్యంలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఇందులో చిరంజీవి శివుడి పాత్రలో నటించగా అర్జున్ భక్తుడిగా కనిపించారు. సౌందర్య , మీనా హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే.
కన్నప్ప:
తాజాగా మంచు విష్ణు హీరోగా నటించిన కన్నప్ప సినిమా కూడా శివ మహత్యాన్ని తెలుపుతూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఇందులో శివుడిగా బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నటించగా, శివుడి భక్తుడిగా విష్ణు నటన అద్భుతంగా నిలిచింది శివరాత్రి సందర్భంగా చూడవలసిన సినిమాలలో కన్నప్ప సినిమా కూడా ఒకటి.
కాళహస్తి మహత్వం:
శివరాత్రి అంటే చూడవలసిన సినిమాలలో కాళహస్తి మహత్వం సినిమా కూడా ఒకటి. శివుడి గొప్పతనాన్ని తెలియజేస్తూ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది శివరాత్రి జాగరణ చేసేవారికి ఈ సినిమా కూడా మంచి అనుభూతిని కలిగిస్తుంది ఇక ఈ సినిమాలో కన్నడ నటుడు రాజ్ కుమార్ నటించారు.
మహాశివరాత్రి:
రేణుక శర్మ దర్శకత్వంలో మీనా ప్రధానపాత్రలో నటించిన చిత్రం మహాశివరాత్రి. సాయికుమార్ రాజేంద్రప్రసాద్ వంటి తదితరులు నటించిన ఈ సినిమా శివరాత్రి పండుగకు చూడదగ్గ సినిమా అని చెప్పాలి. ఇక ఈ సినిమాతో పాటు కార్తికేయ, సుబ్రమణ్యపురం, భూ కైలాస్, జగద్గురు ఆదిశంకర వంటి తదితర సినిమాలను కూడా శివరాత్రి పండుగ సందర్భంగా చూడదగ్గ సినిమాలని చెప్పాలి.
Also Read: Mrunal thakur: ఫైనల్లీ పెళ్లిపై ఓపెన్ అయిన మృణాళ్…ఆ మొదటి వ్యక్తిని నేనే అంటూ!