E-Paper
Advertisement

Single vs Double Door Fridges: డోర్లలోనే కాదు.. ఫీచర్లలోనూ వ్యత్యాసం.. రెండింటిలో ఏది కొంటే బెటర్

Single vs Double Door Fridges: డోర్లలోనే కాదు.. ఫీచర్లలోనూ వ్యత్యాసం.. రెండింటిలో ఏది కొంటే బెటర్
Advertisement

Single vs Double Door Fridges: తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగ భగలు మెుదలయ్యాయి. ఈ నేపథ్యంలో సహజంగానే ఫ్రిడ్జ్ లకు డిమాండ్ ఏర్పడింది. మార్కెట్ లో మంచి ఫ్రిడ్జ్ ల కోసం వినియోగదారులు తెగ సెర్చ్ చేస్తున్నారు. అయితే సింగిల్ డోర్, డబుల్ డోర్లలో ఏ ఫ్రిడ్జ్ కొనాలో తెలియక చాలా మంది సతమతమవుతున్నారు. ఏది కొంటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో రెండింటి మధ్య గల ప్రధాన తేడాలు ఏంటో ఇప్పుడు పరిశీలిద్దాం.

పరిమాణం, సామర్థ్యం..

సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్లు సాధారణంగా 250 లీటర్ల వరకూ స్టోరేజ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇవి చిన్న కుటుంబాలకు చాలా అనుకూలం. డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్లు విషయానికి వస్తే 250-500 లీటర్ల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. పెద్ద ఇళ్లు, హోటల్స్ కు ప్రయోజనకరంగా ఉంటాయి. ఫ్రిడ్జ్ లో ఎక్కువ మెుత్తం ఆహార పదార్థాలు, కూరగాయాలు స్టోర్ చేసుకునేందుకు ఇవి వీలు కల్పిస్తాయి.

విద్యుత్ బిల్లు

Advertisement

సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్లు చిన్న పరిమాణంలో ఉంటూ తక్కువ విద్యుత్ ను వినియోగిస్తాయి. ఫలితంగా వీటి కూలింగ్ సామర్థ్యం కూడా పరిమితంగా ఉంటుంది. డబుల్ డోర్ ఫ్రిడ్జ్ లు.. అధిక శక్తిని కలిగి ఉంటాయి. వీటిలోని ఇన్వర్టర్ టెక్నాలజీ విద్యుత్ ప్రసారాన్ని అవసరానికి మేరకు వాడుకుంటూ తక్కువ పవర్ బిల్లు వచ్చేందుకు సాయపడాయి.

కూలింగ్ టెక్నాలజీ..

సింగిల్ డోర్ ఫ్రిజ్‌లు సాధారణంగా డైరెక్ట్ కూలింగ్ టెక్నాలజీతో పనిచేస్తాయి. ఫలితంగా ఫ్రిడ్జ్ లో గడ్డకట్టిన ఐస్ ను మాన్యువల్ గా తొలంగించాల్సి (డీఫ్రాస్టింగ్ ) ఉంటుంది. అయితే డబుల్ డోర్ ఫ్రిజ్‌లు ఫ్రాస్ట్-ఫ్రీ కూలింగ్‌ సాంకేతికతతో వర్క్ చేస్తాయి. ఆటోమేటిక్ డిఫ్రాస్ట్ కారణంగా ఐస్ ఏర్పడదు.

ధర పరంగా ఏది బెటర్?

Advertisement

మార్కెట్ ధర విషయానికి వస్తే.. సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ లు బడ్జెట్ లో లభిస్తాయి. పేద, మధ్య తరగతి వారు కూడా సులభంగా కొనుగోలు చేసేలా ఉంటాయి. డబుల్ డోర్స్ మాత్రం ఖరీదైనవి. అయితే రేటు ఎక్కువగా ఉన్నప్పటికీ ఇందులోని ఫీచర్లు యూజర్ కు మరిన్ని అదనపు ప్రయోజనాలను చేకూరుస్తాయి.

Also Read: Xiaomi X Pro QLED Smart TV: కొత్త స్మార్ట్ టీవీ కావాలా? అయితే గెట్ రెడీ.. సూపర్ డూపర్ మోడల్ వచ్చేస్తోంది!

లోపాలు పరంగా..

సింగిల్, డబుల్ డోర్ ఫ్రిడ్జ్ లలో లాభాలతో పాటు కొన్ని లోపాలు సైతం ఉన్నాయి. సింగిల్ డోర్ వేరియంట్ లో ఫ్రీజర్ చిన్నగా ఉండటం, పరిమితమైన స్టోరేజ్ సామర్థ్యం, మాన్యువల్ డిఫ్రాస్ట్ ఇబ్బందిగా మారొచ్చు. ఇక డబుల్ డోర్ విషయానికి వస్తే.. ఇది ఖరీదైనదే కాకుండా ఇంట్లో ఎక్కువ స్థలాన్ని ఆక్రమించుకుంటుంది. అంతేకాకుండా పవర్ బిల్లు ఎక్కువగా వస్తుంటుంది.

Also Read: AP Budget 2026: అసెంబ్లీ ముందుకు బడ్జెట్.. ఆర్థిక మంత్రి ప్రసంగం.. రంగాల వారీగా కేటాయింపులు

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×