E-Paper
Advertisement

మైసా కోసం రష్మిక రిస్క్!

మైసా కోసం రష్మిక రిస్క్!
Advertisement

Rashmika:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకొని నేడు పాన్ ఇండియా క్రష్ మాత్రమే కాదు బాక్స్ ఆఫీస్ క్వీన్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది రష్మిక .యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఈమె పాత్ర దొరికితే పరకాయ ప్రవేశం చేయడంలో తనకు తానే సాటి. అల్లరి పిల్లగా.. ప్రేయసిగా , భార్యగా, రాణిగా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పాత్రలతో అదిరిపోయే పర్ఫామెన్స్ కనబరిచి అందరి దృష్టిని ఆకట్టుకుంది. పుష్ప, పుష్ప2, యానిమల్, సికందర్, ఛావా, కుబేర, ది గర్ల్ ఫ్రెండ్ అంటూ బాక్సాఫీస్ వద్ద మూడు సంవత్సరాల కాలంలో మూడు వేల కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి సంచలనం సృష్టించింది.

మైసా కోసం రష్మిక ఊహించని కష్టం..

అలా వరుస సినిమాలతో బిజీగా మారిపోయిన రష్మిక ఈ ఏడాది తన ప్రియుడు, ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ తో ఏడడుగులు వేసింది.. కేవలం 15 రోజుల గ్యాప్ తీసుకున్న ఈమె అప్పుడే తన సినిమా షూటింగ్ లతో బిజీగా మారిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈమె మైసా అనే సినిమాతో పాటు రణబాలి సినిమా షూటింగ్లలో పాల్గొంటుంది. ఇక ప్రస్తుతం మైసా సినిమా షూటింగ్ నిమిత్తం.. కేరళలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ అంచనాలు పెంచడమే కాకుండా రష్మిక చేస్తున్న రిస్క్ కి అభిమానులు కంగారు పడిపోతున్నారు. మరి కొంతమంది రష్మిక అంటే అది అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి రష్మిక ఈ సినిమా కోసం తీసుకున్న రిస్క్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఎటువంటి డూప్ లేకుండా 80 అడుగుల ఎత్తు నుండి దూకేసిన రష్మిక

Advertisement

ప్రముఖ డైరెక్టర్ రవీంద్ర పుల్లే దర్శకత్వంలో రష్మిక హీరోయిన్గా నటిస్తున్న చిత్రం మైసా.. యధార్థ సంఘటనల ఆధారంగా వస్తున్న ఈ చిత్రంలో రష్మిక ఒక గోండు జాతి అమ్మాయి పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాలో తన పాత్ర కోసం ఆమె చేసిన సవాళ్లతో కూడిన స్టంట్స్ గురించి చెప్పి డైరెక్టర్ అందర్నీ ఆశ్చర్యపరిచారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ మాట్లాడుతూ.. “రష్మిక చాలా ప్రభావంతమైన మైసా పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా ఆ పాత్ర కోసం ఆమె ప్రదర్శించే కోపం, ఆవేశం ఈ సినిమాకే హైలైట్. కేరళలోని అత్తిరపల్లి జలపాతం వద్ద ఒక క్లిష్టమైన యాక్షన్ సీన్ చిత్రీకరించాము. రష్మిక డూప్ లేకుండా ఏకంగా 80 అడుగుల ఎత్తు నుంచి దూకారు. ఆ సమయంలో ఆమె చేతులకు , కాళ్లకు గాయాలు కూడా అయ్యాయి. అయినా సరే రెస్ట్ తీసుకోకుండా ఆమె షూటింగ్లో పాల్గొన్నారు. ఆమె నిబద్ధత చూసి చిత్ర బృందం మొత్తం ఆశ్చర్యపోయింది” అంటూ డైరెక్టర్ రష్మిక చేసిన రిస్కు గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు.

also read:టాలీవుడ్లో విషాదం.. దర్శకుడు రఘురామ్ మృతి!

8 గంటల కఠిన శిక్షణ..

Advertisement

ఇకపోతే ఈ సినిమా కోసం అంతర్జాతీయ స్టంట్ కొరియోగ్రాఫర్ కెచా ఖంపక్డీ నేతృత్వంలో శిక్షణ పొందింది. బ్యాంకాక్ లో వారం రోజులపాటు ప్రతిరోజు 8 గంటల పాటు కఠినమైన యుద్ధ విద్యలు నేర్చుకున్న ఈమె మార్షల్ ఆర్ట్స్, గిరిజన పోరాట పద్ధతులను కలిపి ఈ సినిమా కోసం ఒక కొత్త యాక్షన్ శైలిని డిజైన్ చేసినట్టు డైరెక్టర్ తెలిపారు. ఏది ఏమైనా రష్మిక ఈ పాత్ర కోసం చేస్తున్న ప్రయత్నం.. పడుతున్న కష్టం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరి ఈ సినిమా రష్మిక కి ఎలాంటి రికార్డులు అందిస్తుందో చూడాలి.

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×