E-Paper
Advertisement

టాలీవుడ్లో విషాదం.. దర్శకుడు రఘురామ్ మృతి!

టాలీవుడ్లో విషాదం.. దర్శకుడు రఘురామ్ మృతి!
Advertisement

Tollywood: చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు ఇండస్ట్రీని అతలాకుతలం చేస్తున్నాయి.. ముఖ్యంగా కరోనా వచ్చినప్పటి నుంచి సెలబ్రిటీల మరణాలు ఇండస్ట్రీని ఒంటరిని చేస్తున్నాయి. సెలబ్రిటీలే కాదు వారి కుటుంబాలలో కూడా విషాదఛాయలు అలుముకోవడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. నిన్నటికి నిన్న డైలాన్ అనే ఒక సింగర్ 24 సంవత్సరాల వయసులోనే కారు యాక్సిడెంట్ కి గురై మరణించి అందరిని ఆశ్చర్యపరచగా.. ఇప్పుడు ప్రముఖ దర్శకుడు మరణించడం ఇండస్ట్రీ తట్టుకోలేకపోతోంది. ఆయన ఎవరో కాదు ప్రముఖ సీనియర్ జర్నలిస్టు, రైటర్, దర్శకుడు బండి రఘురామ్.

గుండెపోటుతో ప్రముఖ దర్శకుడు మృతి..

మంగళవారం సాయంత్రం వాకింగ్ చేస్తున్న సమయంలో సడన్గా గుండెపోటు వచ్చిందట. దీంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే హాస్పిటల్ కి తరలించగా.. గుండెపోటుతో ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. రఘురామ్ దర్శకుడు మాత్రమే కాదు రైటర్, జర్నలిస్ట్ కూడా.. ముఖ్యంగా పలు మీడియా సంస్థలలో స్పెషల్ కరస్పాండెంట్ గా కూడా పనిచేశారు. పైగా ఈయన బాగా చదువుకున్న వ్యక్తి ..ఇంగ్లీషు లిటరేచర్ లో పీహెచ్డీ పూర్తి చేసిన ఈయన.. జర్నలిజంలో ఎంఫిల్ పూర్తి చేసారు.లిబ్యాన్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా కూడా పనిచేశారు. అయితే సినిమాల పైన ఉన్న ఆసక్తితోనే అవన్నింటినీ పక్కనపెట్టి ఇండస్ట్రీలోకి వచ్చారు.

గొప్ప లిటరేచర్.. కానీ సినిమాల కోసం తపన..

Advertisement

సినిమా జీవిత విషయానికి వస్తే.. జగిత్యాలకు చెందిన ఈయన దర్శకుడు సానా యాదిరెడ్డి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేసి.. అదే డైరెక్టర్ వద్ద కో డైరెక్టర్ గా కూడా పనిచేశారు. ముఖ్యంగా సానా యాదిరెడ్డి రూపొందించిన అన్ని సినిమాలకి కూడా రఘురాం పని చేశారు. అలా దర్శకత్వంలో మంచి అనుభవాన్ని పొందిన తర్వాత తొలిసారి 2004లో రమ్యకృష్ణ , శివాజీ కాంబినేషన్లో వచ్చిన వరం అనే సినిమాకి దర్శకుడిగా పనిచేశారు.. ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయినా మళ్లీ దర్శకుడిగా నిరూపించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు..ఇక సినిమాలకు రైటర్ గా, ఘోస్ట్ రైటర్ గా పనిచేసిన ఈయన.. ఇప్పటికీ దర్శకత్వ ప్రయత్నాల్లోనే ఉన్నారు. కానీ ఇంతలోనే ఇలా గుండెపోటు రావడం అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు.

also read:సినిమాల్లోకి దివ్వెల మాధురి.. గైరమ్మత్తగా కొత్త లుక్.. శ్రీనివాస్ సమక్షంలో షూటింగ్ మొదలు!

రఘురామ్ వ్యక్తిగత జీవితం..

Advertisement

ఇకపోతే ఈయనకు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు . ప్రస్తుతం హైదరాబాద్ యూసఫ్ గూడా లోని మధురానగర్ లో నివసిస్తున్నారు. నిజానికి రఘురాం కి జర్నలిస్టుగా తెలుగు మీడియాలో మంచి పేరుంది . ఆయన ఇచ్చే సినిమా రివ్యూలకి మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. జెన్యూన్ రివ్యూలు ఇస్తూ తనకంటూ మంచి పేరు సొంతం చేసుకున్నయనా అటు సినిమా ఇండస్ట్రీలో కూడా సత్తా చాటాలని ఎన్నో కలలు కన్నారు అయితే ఆ కలలో నెరవేరకుండానే రఘురాం ఇలా గుండెపోటుతో తుది శ్వాస విడవడం అభిమానులు తట్టుకోలేకపోతున్నారు సినీ ప్రముఖులు జర్నలిస్టులు ఆయన మరణానికి సంతాపం తెలియజేస్తున్నారు.

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×