E-Paper
Advertisement

Horror movie OTT : చీకటి పడితే రెచ్చిపోయే దెయ్యం… ఆ ఊర్లో అడుగు పెడితే చావు మూడినట్టే

Horror movie OTT : చీకటి పడితే రెచ్చిపోయే దెయ్యం… ఆ ఊర్లో అడుగు పెడితే చావు మూడినట్టే
Advertisement

Horror movie OTT : ఇండోనేషియా హారర్ సినిమాలను చూడాలంటే మినిమం గుండె ధైర్యం ఉంటే సరిపోదు. ఎందుకంటే ఈ సినిమాలలో హారర్ సీన్స్ అంత భయంకరంగా ఉంటాయి. గత ఏడాది ఒక ఇండోనేషియన్ హారర్ ఆడియన్స్ ని బాగా భయపెట్టింది. ఇందులో హారర్ సీన్లు, గ్రామీణ నేపథ్యంలో వచ్చే ట్విస్ట్లు చాలా గ్రిప్పింగ్‌గా ఉంటాయి. 1 గం 48 నిమిషాలు ఈ హర్రర్ ని ఒంటరిగా చూస్తే అంతే సంగతులు. ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే..

నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్

ఈ ఇండోనేషియా హారర్ చిత్రం పేరు ‘వక్తు మగ్రిబ్ 2’ (Waktu Maghrib 2). ఈ చిత్రం ఇండోనేషియాలో 2025 మే 28న థియేటర్లలో విడుదలైంది. ఇది 2023లో వచ్చిన హిట్ సినిమా ‘వక్తు మగ్రిబ్’కు సీక్వెల్. మొదటి భాగాన్ని తెరకెక్కించిన సిద్ధార్థ టాటా దీనికి కూడా దర్శకత్వం వహించారు. ఇందులో ఒమర్ డానియల్, అనంత్య కిరణా, సుల్తాన్ హమోనాంగన్, ముజాకి రామ్దాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది ప్రస్తుతం ఇండోనేషియన్ భాషలో మాత్రమే అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

మొదటి భాగంలో జరిగిన భయంకరమైన సంఘటనల తర్వాత, సుమారు పాతిక ఏళ్ళ గ్యాప్ తర్వాత ఈ కథ గిరిటిర్టో అనే గ్రామంలో జరుగుతుంది. ఊళ్ళో పిల్లలందరూ సరదాగా ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడుకుంటున్నప్పుడు ఒక చిన్న గొడవ జరుగుతుంది. ఆ గొడవలో తెలియక చేసిన ఒక తప్పు వల్ల, ఆ గ్రామానికి పట్టిన పాత శాపం మళ్ళీ నిద్రలేస్తుంది. పిల్లల్ని వేధించే ‘ఉమ్ము సిబ్యాన్’ అనే దుష్టశక్తి మళ్ళీ గ్రామం మీద పడి పిల్లల్ని భయభ్రాంతులకు గురిచేయడం మొదలుపెడుతుంది. ముఖ్యంగా సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయంలో ఈ శక్తి మరింత ప్రమాదకరంగా మారుతుంది.

ఇక ఆ దుష్టశక్తి వల్ల ఊళ్ళో పిల్లలందరూ వింతగా ప్రవర్తిస్తూ, ఒకరి తర్వాత ఒకరు మాయమైపోతుంటారు. అప్పుడు కొంత మంది చిన్న పిల్లలు టీమ్ గా ఏర్పడి, ఈ భయంకరమైన దుష్టశక్తి నుండి తమ గ్రామాన్ని కాపాడుకోవడాని ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో స్టోరీ మరింత భయంకరంగా నడుస్తుంది.  చివరికి ఆ దెయ్యం బెడద ఎలా తప్పింది ? దాని కోసం ఆ పిల్లలు ఏం చేశారు ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also : ఓటీటీలోకి వచ్చేస్తున్న రొమాంటిక్ థ్రిల్లర్ సిరీస్ ‘సైకో సైయాన్’… ఎప్పుడు ఎక్కడ చూడవచ్చు అంటే?

Tags

Related News

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

బాడీ షేమింగ్‌ చేస్తూ వేధించిన అమ్మాయిలు… వాళ్లను కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని చూసి కూడా నోరు మెదపని బాధితురాలు! స్పానిష్‌ రివెంజ్‌ థ్రిల్లర్‌

గేమ్‌ ఆడితే మెదడునే కంట్రోల్‌ చేసే డేంజరస్ టెక్నాలజీ… సైకలాజికల్‌ సైఫై థ్రిల్లర్‌ ఓటీటీలోకి

Big Stories

Advertisement
×