E-Paper
Advertisement

Radhika: చిరంజీవి, మోహన్ లాల్.. బెస్ట్ యాక్టర్ ఎవరు? రాధిక ఊహించని కామెంట్స్ ..!

Radhika: చిరంజీవి, మోహన్ లాల్.. బెస్ట్ యాక్టర్ ఎవరు? రాధిక ఊహించని కామెంట్స్ ..!
Advertisement

Radhika: సౌత్ సినీ ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకున్న రాధిక శరత్ కుమార్ (Radhika Sarathkumar)గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఒకప్పుడు తన అందం, అభినయంతో ఎన్నో క్లాసిక్ చిత్రాలలో నటించి ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు పొందిన ఈమె సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా హీరోలకు, హీరోయిన్లకు తల్లిగా, అత్తగా పలు పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇకపోతే ఆ కాలంలో రాధిక శరత్ కుమార్ తో పాటు సుహాసిని కూడా అంతే పేరు దక్కించుకుంది. ఈ ఇద్దరికీ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపు కూడా ఉంది . పైగా మంచి స్నేహితులు కూడా.. అటు వ్యక్తిగత , వృత్తిపరమైన వేదికలపై కలసి అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు.

చిరంజీవి కంటే మోహన్ లాల్ బెస్ట్ యాక్టర్..

పైగా కోలీవుడ్, టాలీవుడ్ , బాలీవుడ్ పరిశ్రమలకు చెందిన నటీనటులు అందరూ రీ యూనియన్ పేరుతో సందడి చేస్తున్నారు కూడా. ఇదిలా ఉండగా తాజాగా సుహాసిని హోస్ట్ గా.. రాధిక శరత్ కుమార్ గెస్ట్ గా ఒక ఇంటర్వ్యూ జరిగింది. ఈ ఇంటర్వ్యూలో భాగంగానే సుహాసిని రాధికాకు ర్యాపిడ్ ఫైర్ అంటూ కొన్ని ప్రశ్నలు సంధించింది. ఈ నేపథ్యంలోనే నీకు బాగా నచ్చిన హీరో ఎవరు? అనే ప్రశ్నకు రాధిక చెప్పిన సమాధానం అటు కోలీవుడ్ లో కూడా వైరల్ గా మారింది. ర్యాపిడ్ ఫైర్ లో భాగంగా చిరంజీవి (Chiranjeevi), మోహన్ లాల్ ఇద్దరిలో ఎవరు బెస్ట్ యాక్టర్? అంటూ సుహాసిని ప్రశ్నించగా.. అందుకు సమాధానంగా మోహన్ లాల్ పేరును రాధిక చెప్పుకొచ్చింది. మోహన్ లాల్ “గ్రేటెస్ట్ యాక్టర్ ఆఫ్ ఇండియా” అంటూ ప్రశంసలు కురిపించింది.

ర్యాపిడ్ ఫైర్ లో రాధిక ఊహించని సమాధానం..

Advertisement

వెంటనే సుహాసిని మోహన్ లాల్, కమల్ హాసన్ లో ఎవరు బెస్ట్ యాక్టర్ అని అడిగితే వెంటనే కమల్ హాసన్ పేరు చెప్పుకొచ్చింది. కమల్ హాసన్, శరత్ కుమార్ లలో ఎవరు బెస్ట్ యాక్టర్ అనే ప్రశ్నకు కమల్ పేరు చెప్పుకొచ్చింది.. అయితే చిరంజీవి కంటే మోహన్ లాల్ బెస్ట్ యాక్టర్ అని రాధిక చెప్పడంతో మెగా అభిమానులు మాత్రం దీనిని జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా రాధిక శరత్ కుమార్ చిరంజీవితో ఎన్నో సినిమాలు చేసింది. అలాంటిది ఈమె చిరంజీవిని తక్కువ చేస్తూ మాట్లాడిందని ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. నెటిజన్స్ మాత్రం ఇద్దరూ బెస్ట్ యాక్టర్స్ ..ఇంటర్వ్యూని సరదాగా మాత్రమే తీసుకోవాలి. వ్యక్తిగత విమర్శలకు చోటు ఇవ్వకూడదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

also read:Actress Meena : కర్మ ఎవర్నీ వదిలిపెట్టదు.. ఫైర్ అవుతున్న మీనా.. అసలేమైందంటే?

మోహన్ లాల్ కెరియర్..

Advertisement

మోహన్ లాల్ విషయానికొస్తే.. మలయాళ చిత్ర సీమలో అగ్ర నటుడిగా ఇప్పటివరకు మొత్తం ఐదు జాతీయ చలనచిత్ర పురస్కారాలను అందుకున్నారు. పద్మశ్రీ, పద్మ భూషణ్ తో పాటు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును కూడా దక్కించుకున్నారు. అలాగే ఇండియన్ టెరిటోరియల్ ఆర్మీ విభాగం నుంచి గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ గా గుర్తింపు పొందిన ఏకైక నటుడిగా మోహన్ లాల్ పేరు దక్కించుకున్నారు.. ఇక వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రాధిక అలా కామెంట్ చేసి ఉంటారు అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×