E-Paper
Advertisement

గ్లామర్ డోస్ పెంచిన నభా నటేష్.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

గ్లామర్ డోస్ పెంచిన నభా నటేష్.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

Nabha Natesh:నభా నటేష్…సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ తాజాగా పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా, తన పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన ఫొటోలను, విశేషాలను అభిమానులతో పంచుకోవడంలో ఈ అమ్మడు ఎక్కడా తగ్గకపోవడం విశేషం.

తాజాగా ఈ భామ ఇన్‌స్టాగ్రామ్‌లో “Proof I was outside living” అనే క్యాప్షన్‌తో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. పచ్చని చెట్ల మధ్యలో దిగిన ఈ ఫొటోల్లో నభా చాలా, స్టైలిష్‌గా కనిపించడంతో ఫిదా అయిపోతున్నారు ఫాన్స్.ముఖ్యంగాబ్లాక్ కలర్ టాప్, అట్రాక్టివ్ స్కర్ట్‌లో ఆమె లుక్ చూసి కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు
ఇక ఈ ఫొటోలకు వస్తున్న లైక్స్, కామెంట్స్ చూస్తుంటే ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని స్పష్టంగా అర్థమవుతోంది.కూడా.

Advertisement

ఇక నభా విషయానికి వస్తే .. కన్నడలో ‘వజ్రకాయ’ సినిమాతో నటిగా కెరీర్ మొదలుపెట్టిన ఈ భామ ఆ తర్వాత టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. సుధీర్ బాబు హీరోగా వచ్చిన ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై మంచి మార్కులే కొట్టేసింది.

ఆ తర్వాత రవితేజ ‘డిస్కో రాజా’లోనూ మెరిసిన ఈ అమ్మడు కెరీర్‌ను పూర్తిగా మార్చేసిన సినిమా మాత్రం ‘ఇస్మార్ట్ శంకర్’ అనే చెప్పాలి.పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా వచ్చిన ఈ చిత్రంలో ఆమె తన గ్లామర్‌తో, ఎనర్జిటిక్ యాక్టింగ్‌తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసింది.

Advertisement

ఇక ఈ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో నభాకి టాలీవుడ్‌లో వరుస అవకాశాలు క్యూ కట్టాయి. వీటిలో ‘సోలో బ్రతుకే సో బెటర్’, ‘అల్లుడు అదుర్స్’ లాంటి సినిమాలతో మంచి పేరే తెచ్చుకుంది.

అయితే కారణాలు తెలీదు కానీ సినిమాల విషయంలో జోరు తగ్గించిన నభా ఈ మధ్యే ప్రియదర్శి హీరోగా వచ్చిన ‘డార్లింగ్’ సినిమాతో మరో డిఫరెంట్ అటెంప్ట్‌తో ఆడియన్స్ ని పలకరించింది.ఇక భారీ బడ్జెట్ తో వచ్చిన నాగబంధం సినిమా లోనూ కనిపించి మెప్పించింది .అలాగే నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా వస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘స్వయంభూ’లోనూ నభా నటిస్తూ బిజీగా ఉండేందుకు ట్రై చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.

అలా సినిమాలతో బిజీగా ఉంటూనే నెట్టింట్లో షేర్ చేసిన “Proof I was outside living” ఫొటోలు కూడా ఇంటర్నెట్‌లో తెగ హల్ చల్ చేస్తున్నాయి. సినిమా షూటింగ్స్, బిజీ షెడ్యూల్స్ మధ్యలో కాస్త బ్రేక్ తీసుకున్నా ఈ బ్యూటీ, ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్‌ను ఫ్యాన్స్‌తో పంచుకోవడం విశేషం.

ఏదేమైనా నభా నటేష్ గ్లామర్ లుక్స్, ఆమె క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్‌గా మారుతుంటాయని స్పెషల్ గా చెప్పక్కర్లేదు !

Tags

Related News

స్క్రిప్ట్‌లో లేని కామెడీ.. ఆలీ, బాబూమోహన్ కలిసి చేసిన అల్లరి ఇదే!

సాయంత్రం మాట్లాడుకున్నాం.. తెల్లవారుజామున ఆ వార్త .. కోట గురించి బాబూమోహన్ ఎమోషనల్!

దుల్కర్ సినిమాలో రుహాని శర్మ.. బిజిలిగా కొత్త అవతారం!

ఆదర్శ కుటుంబం ఎఫెక్ట్.. మళ్లీ వాయిదా పడిన ఇట్లు అర్జున..!

రాజశేఖర్‌తో బాబూమోహన్ స్నేహం వెనుక ఇంత కథ ఉందా?

మోహన్ బాబు కంటే రెండు ఆకులు ఎక్కువే చదివా.. డైరెక్టర్ కామెంట్స్ వైరల్!

అణిచివేయాలని చూస్తే సహించేది లేదు.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఉపాసన!

Big Stories

Advertisement
×