E-Paper
Advertisement

ఆఫీస్‌లో నీచమైన పని.. బాత్రూంలో ఫోన్ పెట్టి వీడియోలు తీసిన అటెండర్!

ఆఫీస్‌లో నీచమైన పని.. బాత్రూంలో ఫోన్ పెట్టి వీడియోలు తీసిన అటెండర్!
Advertisement

Secret Filming: ఆఫీస్​ బాత్రూంలో రహస్యంగా సెల్​ ఫోన్​ అమర్చి మహిళా ఉద్యోగినుల వీడియోలు చిత్రీకరించిన అటెండర్​ ఉదంతమిది. ఉద్యోగుల్లో తీవ్ర కలవరాన్ని సృష్టించిన ఈ సంఘటన కవాడీగూడలోని పవర్ గ్రిడ్​ కార్యాలయంలో వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి.

టేప్​‌తో అతికించి..

పవర్​ గ్రిడ్​ కార్యాలయంలో వాష్​ బేసిన్ కింద డబుల్​ సైడెడ్ టేప్​‌తో ఓ మొబైల్​ ఫోన్ అతికించి ఉండగా ఇదే కార్యాలయంలో పని చేస్తున్న ఓ మహిళా ఉద్యోగిని చూసింది. ఫోన్​‌ను బయటకు తీసిన ఆమె సెల్​ ఎవరిదని ప్రశ్నించగా ఇదే ఆఫీస్‌లో అటెండర్ గా పని చేస్తున్న భరత్​ దాన్ని లాక్కుని పారిపోవటానికి ప్రయత్నించాడు. అయితే, సహోద్యోగులు, సెక్యూరిటీ సిబ్బంది అతన్ని పట్టుకున్నారు. ఫోన్​ లోని వీడియోలను పరిశీలించేందుకు ప్రయత్నించగా పిన్​ లాక్​ ఫోల్డర్​ కనిపించింది.

బండకేసి కొట్టిన భరత్..

Advertisement

లాక్​ ఓపెన్​ చేయమని భరత్​‌కు ఇవ్వగా అతను దానిని నేలకేసి కొట్టి కాళ్లతో తొక్కి ధ్వంసం చేశాడు. ఈ మేరకు మహిళా ఉద్యోగిని ఫిర్యాదు చేయగా గాంధీనగర్ పోలీసులు కేసులు నమోదు చేసి భరత్‌ను అరెస్ట్​ చేశారు. అనంతరం హైదరాబాద్ సైబర్​ క్రైం పోలీస్​ స్టేషన్​ కు కేసును బదిలీ చేశారు. భరత్​ నుంచి స్వాధీనం చేసుకున్న సెల్​ ఫోన్‌లోని డేటాను రిట్రీవ్​ చేయటానికి ఫోరెన్సిక్​ లేబోరేటరీకి పంపించారు.

Also read: సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు లేఖ.. ఆ పరీక్షను వాయిదా వేయండి?

Tags

Related News

సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు లేఖ.. ఆ పరీక్షను వాయిదా వేయండి?

ఐపీఎస్ పేరుతో ఘరానా మోసాలు.. ఎలా ప‌ట్టుబ‌డ్డాడంటే..

మాదాపూర్‌లో హైడ్రా సంచలన ఆపరేషన్.. ఇళ్ల బెడ్‌రూమ్‌, కిచెన్‌లలో వేసిన బోర్లు బట్టబయలు!

2017 నుండి గంజాయి అమ్ముతున్న వృద్ధురాలు అరెస్ట్!

విజయవాడ ట్రిప్‌లో విషాదం.. లారీని ఢీకొన్న కారు, ఇద్దరు యువకులు మృతి!

నేను చెప్పిన పద్ధతి ఫాలో అవ్వండి.. నీళ్లు ఎట్లా రావో చూస్తా: జగదీశ్వర్ రెడ్డి!

కాంగ్రెస్‌లో కుర్చీ లాటరీ.. జెండా మోసినోళ్లకు హ్యాండ్.. జంప్ జిలానీలకే హవా!

Big Stories

Advertisement
×