E-Paper
Advertisement

Love Story Re Release: లవర్స్ డే రోజు… కల్ట్ క్లాసిక్ ‘లవ్ స్టోరీ’ రీ రిలీజ్

Love Story Re Release: లవర్స్ డే రోజు… కల్ట్ క్లాసిక్ ‘లవ్ స్టోరీ’ రీ రిలీజ్
Advertisement

Love Story Re release: టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో రీ రిలీజ్ సినిమాల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రతి నెల ఎన్నో సినిమాలు తిరిగి ప్రేక్షకుల ముందుకు వస్తూ మంచి ఆదరణ సొంతం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే వాలెంటైన్స్ డే(Valentine’s Day ) సందర్భంగా మరికొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి. ఫిబ్రవరి నెలలో కొన్ని కొత్త సినిమాలు విడుదలవుతున్నాయి. వీటితోపాటు మరి కొన్ని సినిమాలను కూడా తిరిగి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇక ఫిబ్రవరి 14వ తేదీ వాలెంటైన్స్ డే కావడంతో ఆరోజు కల్ట్ క్లాసిక్ ‘లవ్ స్టోరీ’ (Love Story)రీ రిలీజ్ చేయబోతున్నారు.

వాలెంటైన్స్ డే స్పెషల్..

ఇలా నాగచైతన్య(Nagachaitanya) సాయి పల్లవి (Sai Pallavi)హీరో హీరోయిన్లుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సూపర్ హిట్ సినిమా లవర్స్ డే సందర్భంగా తిరిగి మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చిత్ర బృందం అధికారకంగా తెలియజేశారు. దీంతో అక్కినేని అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా 2021 సెప్టెంబర్ 24వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలో పాటలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

నా హృదయానికి దగ్గరైన సినిమా..

Advertisement

ఇక ఈ సినిమాని తిరిగి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న నేపథ్యంలో ఈ విషయాన్ని నాగచైతన్య తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. లవ్ స్టోరీ సినిమా నా హృదయానికి చాలా దగ్గరైనా సినిమా. ఈ సినిమా ఫిబ్రవరి 14వ తేదీ తిరిగి విడుదల కాబోతున్న నేపథ్యంలో ఎంతో ఎక్సైటెడ్ గా ఉన్నాను. మరోసారి మీ అందరితో కలిసి థియేటర్లో ఈ సినిమాని సెలెబ్రేట్ చేసుకుందాం అంటూ నాగచైతన్య లవ్ స్టోరీ రీ రిలీజ్ గురించి చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. సాయి పల్లవి నాగచైతన్య కాంబినేషన్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ కావడంతో తిరిగి వీరిద్దరి కాంబినేషన్లో తండేల్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అందుకుంది.

Advertisement

నాగచైతన్య సినిమాల విషయానికి వస్తే తండేల్ మంచి సక్సెస్ అందుకున్న అనంతరం చైతన్య విరూపాక్ష ఫేమ్ డైరెక్టర్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో వర్షకర్మ(Vrusha Karma) అనే సినిమా పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమా మైథాలజికల్ పిరియాడిక్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. చైతన్య కెరియర్ లోనే ఈ సినిమా చాలా ప్రత్యేకంగా ఉండబోతుందని చెప్పాలి. ఇందులో నాగచైతన్యకు జోడిగా నటి మీనాక్షి చౌదరి (Meenakshi Chaudary)హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాని 2026 జూన్ లేదా జూలై నెలలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

Also Read: Anil Ravipudi: అనిల్ రావిపూడి సినిమాకు క్రేజీ టైటిల్..వీడు మళ్ళీ మొదలెట్టాడురా బాబు!

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×