E-Paper
Advertisement

Naga Chaitanya: హీరో నాగచైతన్యకు తప్పిన ప్రమాదం.. ఊపిరిపీల్చుకున్న ఫ్యాన్స్!

Naga Chaitanya: హీరో నాగచైతన్యకు తప్పిన ప్రమాదం.. ఊపిరిపీల్చుకున్న ఫ్యాన్స్!
Advertisement

Naga Chaitanya:సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోనైనా సరే లేదా ఎక్కడైనా సరే అనుకోకుండా జరిగే ప్రమాదాలు ఇబ్బందుల్లోకి నెట్టివేస్తూ ఉంటాయి. కాస్త అప్రమత్తమైతే చాలు ఆ ప్రమాదాల నుంచి ఇట్టే బయటపడవచ్చు.. ఈ క్రమంలోనే తాజాగా హీరో నాగచైతన్య (Naga Chaitanya) కూడా వేగంగా ఆ ప్రమాదం నుండి తేరుకొని ఎటువంటి గాయాలు లేకుండా ప్రమాదాన్ని తప్పించుకొని అభిమానులకు స్వాంతన కలుగజేశారు. ఇక అసలు ఏం జరిగింది? నాగచైతన్య ప్రమాదం బారిన పడడం ఏంటి? ఈ ఘటన ఎక్కడ జరిగింది? అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.

నాగచైతన్యకు తప్పిన ప్రమాదం..

వివరాల్లోకి వెళ్తే..హైదరాబాద్‌లోని ప్రసాద్స్ ఐమ్యాక్స్ (Prasads PCX) థియేటర్‌లో మార్చి 5, 2026న ‘వృషకర్మ’ సినిమా ఫస్ట్ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.స్టేజ్ పైన కూర్చున్న సమయంలో, ఒక్కసారిగా కుర్చీ వెనక్కి దొర్లడంతో ఆయన కింద పడబోతున్న సమయంలో అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది మరియు బాడీగార్డ్స్ వెంటనే ఆయన్ని పట్టుకున్నారు. చైతన్య కూడా చాలా వేగంగా తేరుకుని, ఎటువంటి గాయం కాకుండానే మళ్ళీ నిలబడ్డారు.చిన్న ప్రమాదం జరిగిన తర్వాత చైతన్య ఏమాత్రం అసహనం వ్యక్తం చేయలేదు. పైగా, కంగారు పడుతున్న అభిమానులకు తాను బాగున్నానని సైగ చేస్తూ, చిరునవ్వుతో స్పీచ్ తో ముందుకు సాగారు. దీంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు ప్రస్తుతం ఎందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Advertisement

ALSO READ:Sonusood: మానవత్వం చాటుకుంటున్న సోనూసూద్.. దుబాయ్ లో చిక్కుకున్న వారికి అండగా!

ట్రెజర్ హంటర్ గా నాగచైతన్య..

నాగచైతన్య విషయానికి వస్తే.. ప్రస్తుతం సరికొత్తగా పాన్ ఇండియా మిస్టిక్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం ‘వృషకర్మ’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇందులో ఒక ట్రెజర్ హంటర్ గా , సిక్స్ ప్యాక్ బాడీతో సరికొత్త లుక్కులో కనిపిస్తున్నారు. విరూపాక్ష సినిమాతో తనకంటూ మంచి గుర్తింపు సొంతం చేసుకున్న కార్తీక్ దండు వర్మ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి , నాగచైతన్యకు జోడిగా నటిస్తోంది. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఇందులో నాగచైతన్య , మీనాక్షి జంటగా నటించగా.. స్పర్శ్ శ్రీ వాత్సవ విలన్ పాత్ర పోషిస్తున్నారు. మిస్టిక్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ జానర్ కి నాగచైతన్య కొత్త అని చెప్పవచ్చు. ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ అంతర్జాతీయ ప్రమాణాలతో చాలా అద్భుతంగా రూపొందించడం జరిగింది. కచ్చితంగా ఈ సినిమా నాగచైతన్య కెరియర్ లో మైల్ స్టోన్ గా నిలిచిపోతుందని బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ గా రికార్డులు క్రియేట్ చేస్తుందని.. అభిమానులు , సినీ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. మరి వృషకర్మ సినిమాతో స్టాండర్డ్ హిట్ ను నాగచైతన్య అందుకుంటారో లేదో చూడాలి.

Advertisement

Related News

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

Big Stories

Advertisement
×