Iran Strategy: ఇలాంటి అండర్ గ్రౌండ్ మిసైల్ సిటీలు ఇరాన్ దగ్గర చాలానే ఉన్నాయ్. అమెరికా, ఇజ్రాయెల్ కు ఇవి దొరకవు. నాశనం కూడా కావు. ఈ మిసైల్స్ బయటకు వచ్చాయంటే డైరెక్ట్ ఎటాకింగ్ కే వెళ్తాయి. ప్రస్తుత యుద్ధంలో ఇరాన్ అందుకే సర్వైవ్ అవుతోంది. ఇరాన్ తన క్షిపణులను, డ్రోన్లను భూగర్భంలో వందల అడుగుల లోతులో ఉన్న సొరంగాల్లో దాచింది. నాయకులు ఉన్నా లేకపోయినా యుద్ధం మొదలైందంటే ఈ సొరంగాల నుండి క్షిపణి దాడులు కొనసాగుతూనే ఉంటాయి.
ఇరాన్ టాప్ లీడర్ షిప్ చనిపోయినా.. సుప్రీం కమాండర్ లేకపోయినా యుద్ధం కొనసాగించడానికి కారణం డీసెంట్రలైజ్డ్ కమాండ్. దశాబ్దాల తరబడి రెడీ చేసుకున్న నిగూఢ యుద్ధ తంత్రమిది. అమెరికా, ఇజ్రాయెల్ తో ఏ రోజైనా డైరెక్ట్ వార్ తప్పదని గ్రహించిన ఇరాన్ ముందస్తుగా చాలా ఏర్పాట్లు చేసుకుంది. వ్యూహాలు ఆల్రెడీ రచించి పెట్టుకుంది. ఇందులో కీలకమైంది మొజాయిక్ డిఫెన్స్. అంటే ఇరాన్ తన ఆర్మీని చిన్న చిన్న అటానమస్ కమాండ్లుగా డివైడ్ చేసింది. ఒకవేళ టెహ్రాన్‌లోని ముఖ్య నాయకత్వం చనిపోయినా సరే, స్థానిక కమాండర్లు… పై అధికారుల ఆదేశాల కోసం వెయిట్ చేయకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకుని దాడులు చేసేలా డిజైన్ చేశారు. దీన్నే మొజాయిక్ డిఫెన్స్ గా చెబుతున్నారు.
ఇరాన్ నేరుగా యుద్ధం చేయడమే కాకుండా, లెబనాన్‌లో హిజ్బుల్లా, యెమెన్‌లో హౌతీలు, ఇరాక్, సిరియాల్లో మిలీషియా గ్రూపులను దశాబ్దాలుగా పెంచి పోషించింది. ఇరాన్ ప్రధాన భూభాగంపై దాడి జరిగితే, ఈ గ్రూపులన్నీ ఒకేసారి ఇజ్రాయెల్, అమెరికా స్థావరాలపై ముప్పేట దాడులు చేస్తాయి. ఇప్పుడు కూడా జరుగుతున్నది అదే. ఇజ్రాయెల్, అమెరికాకు మల్టీ టార్గెట్స్ ఉన్నాయి. ఇది కూడా ఇరాన్ కు కలిసి వచ్చే అంశం.
అమెరికా వంటి అగ్రరాజ్యంతో నేరుగా యుద్ధం చేయడం సాధ్యం కాదని గ్రహించిన ఇరాన్…., డ్రోన్లు, సీ మైన్స్ పై ఫోకస్ పెట్టింది. ఒక అమెరికా ఇంటర్సెప్టర్ క్షిపణి ధర మిలియన్ డాలర్లు ఉంటే, ఇరాన్ డ్రోన్ ధర కేవలం 20 వేల డాలర్లు మాత్రమే. అంటే తక్కువ ఖర్చు.. ఎక్కువ నష్టం చేసే వ్యూహంతో ఇరాన్ ఉంది. వందలాది డ్రోన్లను ఒకేసారి పంపడం ద్వారా శత్రువుల ఖరీదైన రక్షణ వ్యవస్థలను ఖాళీ చేయడం ఇరాన్ ప్రధాన వ్యూహాల్లో ఒకటి. ఇప్పుడు అమెరికా దగ్గర మిసైల్స్ అయిపోతున్నాయి కూడా. మరో పది రోజుల్లో కీలక క్షిపణుల కొరత వచ్చే ఛాన్స్ ఉందని పెంటగాన్ హెచ్చరించిందంటే.. ఇరాన్ వ్యూహాల్లో ఒకటి ఫలించినట్లే.
ఇరాన్ దగ్గర ఉన్న అతి పెద్ద బ్రహ్మాస్త్రం హర్ముజ్ జలసంధి. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హర్ముజ్ జలసంధిని మూసివేయడం లేదంటే అక్కడ నౌకలపై దాడులు చేయడం ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను స్తంభింపజేయగలమని ఇరాన్ ముందుగానే ప్లాన్ చేసుకుంది. జలసంధి దగ్గర ఎలా డీల్ చేయాలో కూడా అన్నీ సెట్ చేసి రెడీ ఉన్నాయి. వన్ టూ త్రీ అనడమే తరువాయి. గేమ్ మొత్తం మారిపోతుంది. ఇప్పుడు హర్ముజ్ దగ్గర 1000కి పైగా చమురు, గ్యాస్ ట్యాంకర్ నౌకలు నిలిచిపోయి ఉన్నాయి. ఇరాన్ ధైర్యం అదే. సో ఇరాన్ యుద్ధం ఒక వ్యక్తి మీద కాకుండా, ఒక వ్యవస్థ మీద ఆధారపడి నడుస్తోంది. అందుకే నాయకత్వం దెబ్బతిన్నా వారి ఎటాకింగ్ ఆగడం లేదు.
2 వేల సంవత్సరం నుంచే మొజాయిక్ డిఫెన్స్ సిస్టమ్ ను డెవలప్ చేసుకుంది ఇరాన్. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ IRGC ని 31 ఇండిపెండెంట్ యూనిట్లుగా డివైడ్ చేశారు. నిర్ణయాలు ఈ స్థాయిలోనే ఇండిపెండెంట్ గా జరిగిపోతాయంతే. పైన ఎవరైనా ఉండని, ఉండకపోనీ… యుద్ధం మాత్రం మొదలైందంటే ఆగదు. తలొగ్గరు. ఇదే ఇరానియన్ స్టైల్. ప్రావిన్షియల్ కమాండర్లకు పూర్తి స్వాతంత్ర్యం ఉంటుంది. టెహ్రాన్ నుంచి ఆర్డర్ రావాల్సిన అవసరం లేదు. సెంట్రల్ కమాండ్ నాశనమైనా, లీడర్లు చనిపోయినా వాళ్లు సొంతంగా నిర్ణయాలు తీసుకుని దాడులు చేసేలా డిజైన్ చేశారు. వార్ మొదలైందంటే చాలు ఆటో పైలెట్ మోడ్ ఆన్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే యుద్ధం మొదలు కాకముందే ప్రీ ప్లాన్డ్ స్ట్రాటజీలు కూడా ఇరాన్ దగ్గర ఉన్నాయి. కమ్యూనికేషన్స్ జామ్ అయినా, చివరగా వచ్చిన ఆర్డర్స్ ప్రకారం వార్ కంటిన్యూ చేస్తారు. టాప్ 50 లీడర్లు ఒకేసారి హతమైనా.. ఇరాన్ ఇప్పటికీ మిసైల్, డ్రోన్ దాడులు చేస్తూనే ఉంది. హర్ముజ్ జలసంధిని మూసేసి ప్రపంచ చమురు సరఫరాను అరచేయి అడ్డు పెట్టి ఆపేసింది. దటీజ్ ఇరాన్ పవర్.
హెడ్ అంటే లీడర్ పడిపోయినా బాడీ అంటే సైన్యం పోరాడుతూనే ఉంటుంది. ఇదే విషయాన్ని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ క్లారిటీ ఇచ్చారు. ఈ వ్యూహం వల్లనే ఖమెని చనిపోయిన తర్వాత కూడా ఇరాన్ ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4 కొనసాగిస్తోంది. ఇజ్రాయెల్, అమెరికాకు ఎయిర్ సూపీరియారిటీ ఉంది. పైచేయి వారిదే. అందుకే సంప్రదాయ సైన్యంతో ఎదుర్కోవడం కష్టం. ఇక్కడే ఇరాన్ ప్లాన్ 1 అమలు చేసింది. వేల సంఖ్యలో బాలిస్టిక్ మిసైల్స్, షాహీద్ 136 డ్రోన్లతో ఎటాకింగ్ మొదలు పెట్టింది. మిసైల్ సిటీల నుంచి దాడులు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఖతార్, దుబాయ్ వంటి చోట్ల అయితే అమెరికా స్థావరాలు తుక్కు తుక్కు అయ్యాయ్. అసలు ఇరాన్ దాడులను ఎవరూ అడ్డుకోలేకపోతున్నారు.
30 – 40 ఏళ్ల క్రితం నుంచే ఇరాన్ భారీ వ్యూహాలు రెడీ చేసి పెట్టుకుంది. సంప్రదాయ సైన్యంతో యుద్ధం కష్టమని అందరికంటే ముందుగానే గ్రహించారు. డ్రోన్లు, మిసైల్ సిస్టమ్స్ ఏర్పాటు చేసుకున్నారు. అంతే కాదు అణు బాంబుల తయారీకి చాలా దగ్గర్లో ఉన్నారు. సెంట్రిఫ్యూజ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. 90 శాతం శుద్ధి చేసిన యురేనియం మరికొద్ది రోజుల్లో రెడీ అవుతుందనగా భయపడ్డ అమెరికా, ఇజ్రాయెల్ యుద్దానికి దిగాయి. అణు స్థావరాలను ధ్వంసం చేశాయి. ఇరాన్ అణుబాంబు తయారు చేసి ఉంటే గనక ఈ యుద్ధంలో ఇరాన్ పూర్తి పైచేయి సాధించి ఉండేది. ఇప్పటికీ తగ్గకపోవడానికి కారణం ముందస్తు ఏర్పాట్లే. వేలాది బాలిస్టిక్ మిసైళ్లు ఇరాన్ దగ్గర ఉన్నాయి. ప్రపంచంలోనే చాలా ఎక్కువ మిసైళ్లు ఉన్న దేశాల్లో ఇరాన్ టాప్ లో ఉంది. షహీద్ సిరీస్ సూసైడల్ డ్రోన్లను ఈజీగా తయారు చేసుకోవచ్చు.
అమెరికా, ఇజ్రాయెల్‌తో నేరుగా యుద్ధం వస్తుందని ఇరాన్ ఎప్పుడో ఊహించింది కాబట్టే వ్యూహాలు మారుస్తూ కదనరంగంలో దూకుడుగా వెళ్తోంది. ఇజ్రాయెల్‌తో గతేడాది ఘర్షణల సందర్భంగా నేర్చిన గుణపాఠాలతో కథ నడిపిస్తోంది. ఈసారి ఇరాన్ భారీ మిసైళ్లను ప్రయోగించకుండా కొత్త వ్యూహంతో ఇజ్రాయెల్, అమెరికాను టార్గెట్ చేసింది. గతేడాది ఇరాన్ ప్రయోగించిన చాలా భారీ మిసైల్స్‌ను ఇజ్రాయెల్ మధ్యలోనే కూల్చేసింది. దీంతో ఇరాన్ షార్డ్, మిడ్ రేంజ్ మిసైల్స్, షాహీద్ డ్రోన్స్‌ను ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ప్రయోగిస్తోంది. ఈ యుద్ధం చాలా రోజులు ఉంటుందని గ్రహించి.. శత్రు దేశాల ఆయుధ సామాగ్రి తగ్గిపోయేలా ఇరాన్ వ్యవహారం నడుపుతోంది.
గతంలో ఇరాన్ కేవలం మిలిటరీ స్థావరాలను టార్గెట్ చేస్తే ఈసారి పౌర లక్ష్యాలపై కూడా బాంబులను ప్రయోగిస్తోంది. బహ్రెయిన్‌లోని అమెరికా నావికా స్థావరంతో పాటు గల్ఫ్ దేశాల్లో జనం ఉన్న ప్రాంతాలనూ టార్గెట్ చేస్తోంది. యూఏఈ, ఖతర్‌పై దాడులు చేయడం ద్వారా వారిపై ఒత్తిడి పెంచి అమెరికా, ఇజ్రాయెల్‌లను వెనక్కు తగ్గేలా చేయాలనుకుంటోంది. అంతే కాదు ఈ యుద్ధంతో అమెరికా, ఇజ్రాయెల్‌ల యుద్ధ సన్నద్ధతను ఇరాన్ పరీక్షిస్తోంది కూడా. ఇరాన్ దాడులను అడ్డుకునేందుకు అమెరికా, ఇజ్రాయెల్ ఖరీదైన టోమహాక్, ఇతర ఇంటర్‌సెప్టర్ మిసైల్స్ ను ప్రయోగించాల్సి వస్తోంది.
ఇజ్రాయెలీ ప్రజల మానసికస్థైర్యం దెబ్బతీసేలా ఇరాన్ దాడులు కొనసాగుతున్నాయి. క్రమం తప్పకుండా స్వల్ప స్థాయి దాడులతో ఇజ్రాయెల్‌పై ఎటాక్స్ చేస్తూ అక్కడి ప్రజలకు కంటిమీద కునుకులేకుండా ఇరాన్ చేస్తోంది. సో ఫైనల్ గా ఇరాన్ ఉద్దేశం ఇప్పుడు యుద్ధం గెలవాలని కాదు. శత్రువుకు భారీ ఖర్చు మిగిల్చాలి. ఆర్థికంగా నష్టం కలిగించాలి. ప్రాంతీయ అస్థిరతకు దారి తీయాలి. యుద్ధం అమెరికా ఇజ్రాయెల్ మొదలు పెట్టినా ఎప్పుడు ముగుస్తుందో మేమే నిర్ణయిస్తాం అని ఇరాన్ చెప్పాలనుకుంటోంది. దటీజ్ ది పవర్ ఆఫ్ ఇరాన్. యుద్ధం ముగింపు తమ చేతుల్లోనే ఉందని సిగ్నల్స్ ఇవ్వడం అంటే మాటలు కాదు.
Story by: Anup, Big Tv