US -Iran War: ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ కూడా భయంకరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే .ఎప్పుడు ఏ దేశం పై ఎలాంటి బాంబులు పడతాయో అనే ఆందోళనలో ప్రజలు ఉన్నారు. ప్రస్తుతం యుఎస్ ఇరాన్ (US Iran)ఇజ్రాయిల్ వంటి దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇలా ఈ దేశాలు యుద్ధం ప్రకటించడమే కాకుండా గల్ఫ్ దేశాలపై కూడా దాడులు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు భయాందోళనలను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఈ యుద్ధం కారణంగా ఎంతో ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లింది.
ఇలాంటి భయంకరమైనటువంటి యుద్ధం గురించి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ 22 సంవత్సరాల క్రితమే చెప్పటం విశేషం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా కాకముందు రచయితగా పనిచేసిన సంగతి తెలిసిందే. ఈయన కథా రచయితగా పనిచేసిన సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ సినిమాలలో మల్లీశ్వరి(Malleswari) ఒకటి. వెంకటేష్ కత్రినా కైఫ్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా అప్పట్లో ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.
ఇక ఈ సినిమాలో కత్రినా కైఫ్ వెంకటేష్ (Venkatesh) మధ్య ఎంతో సరదా సన్నివేశాలు కొనసాగుతూ ఉంటాయి . అయితే ఈ సినిమాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ అమెరికా ఇరాన్ యుద్ధం గురించి డైలాగులు రాయడం విశేషం. ఒక సన్నివేశలో కత్రినా కైఫ్ వెంకటేష్ మాట్లాడుతూ ఉండగా వారి వద్దకు వచ్చిన చిత్రం శీను డైలాగు చెబుతూ..”అమెరికా యురాన్ వాళ్లు కొట్టుకుంటూ కువైట్ వారి మీద బాంబులేసినట్టు నాకెందుకు సార్ ఈ గోల” అంటూ చెప్పిన డైలాగ్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇలా అమెరికా ఇరాన్ మధ్య గొడవ జరుగుతున్నప్పటికీ కువైట్ దేశాలపై బాంబులు దాడి జరుగుతున్న నేపథ్యంలో అభిమానులు విభిన్న రీతులో స్పందిస్తున్నారు.
?igsh=MW8ydWEzYm15bXppMg==
ఇలాంటి యుద్ధం జరుగుతుందని త్రివిక్రమ్ గారు 22 సంవత్సరాల ముందే ఊహించారా? అంటే అప్పటికే ఈ దేశాల మధ్య గొడవలు ఉండేవా అంటూ అభిమానులు స్పందిస్తున్నారు. ఎంతైనా మాటల మాంత్రికుడు కదా ఆ మాత్రం ఊహించి ఉంటారులే అంటూ మరికొందరు ఈ వీడియోని వైరల్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ విషయానికొస్తే ప్రస్తుతం ఈయన దర్శకుడిగా హీరో వెంకటేష్ తో కలిసి ఆదర్శ కుటుంబం అనే సినిమా చేస్తున్నారు. వెంకటేష్ హీరోగా నటించిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాలకు త్రివిక్రమ్ కథా రచయితగా పనిచేసిన మొదటిసారి హీరో వెంకటేష్ తో కలిసి దర్శకుడిగా త్రివిక్రమ్ సినిమా చేయడం విశేషం ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది ఈ ఏడాది దసరా పండుగ సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.
Also Read: Big Tv Kissik Talks: పేరుకే స్టార్ కిడ్…సొంత ఇల్లు కూడా లేదు.. వరలక్ష్మి ఎమోషనల్ కామెంట్స్!