Naga Vamsi : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ ప్రొడ్యూసర్స్ లో నాగ వంశీ ఒకరు. మామూలుగా సినిమాకు సంబంధించి ప్రొడ్యూసర్లు ఎప్పుడు హైలైట్ అవ్వరు. కానీ ప్రొడ్యూసర్స్ అందరిలో ఎప్పుడూ ఎక్కువగా హైలెట్ అయ్యేది ఎస్కేఎన్ మరియు నాగవంశీ. నాగ వంశీ విపరీతమైన డైలాగులతో స్పీచ్ లు ఇవ్వరు కానీ మాట్లాడిన కొన్ని మాటలు అయినా కూడా అవి కాంట్రవర్సీ గా ఉంటాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైన నాగ వంశీ ఎన్నో అద్భుతమైన సినిమాలు నిర్మించారు.
కొన్ని సినిమాలకు విపరీతమైన కలెక్షన్లు అలానే కొన్ని సినిమాలకి విపరీతమైన అవార్డులు కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ 2025లో మాత్రం నాగవంశీ చేసిన సినిమాలు ఏవి పెద్దగా వర్కౌట్ కాలేదు. ఒకవైపు నిర్మించిన కింగ్డమ్, మ్యాడ్ స్క్వేర్ వంటి సినిమాలు ఊహించిన రేంజ్ సక్సెస్ సాధించలేకపోయాయి. అలానే డిస్ట్రిబ్యూషన్ చేసిన వార్ సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.
అయితే సితార ఎంటర్టైన్మెంట్స్ లో ఒక సబ్జెక్టు ఓకే అయిపోతే అది సినిమాగా బయటికి వస్తే అక్కడే సెటిల్ అయిపోవచ్చు అని వార్తలు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తూనే ఉంటాయి. మ్యాడ్ సినిమాతో దర్శకుడుగా పరిచయమయ్యాడు కళ్యాణ్ శంకర్. అక్కడే స్క్వేర్ సినిమా కూడా పూర్తి చేశాడు. ఇప్పుడు తనకోసం ఒక తమిళ్ హీరోను సెట్ చేశాడు నాగ వంశీ.
కార్తి హీరోగా కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో నాగవంశీ ప్రొడ్యూసర్ గా ఒక సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది. అయితే దీని గురించి ఇంకా అధికారకు ప్రకటన రాలేదు. ఒకవేళ ఇదే కానీ ఓకే అయితే ప్రాజెక్ట్ మీద మరింత ఆసక్తి పెరిగే అవకాశం ఉంది.
ఇప్పటికే హీరో ధనుష్ ను తెలుగు ఇండస్ట్రీకి తీసుకొచ్చి సార్ సినిమాతో మంచి సక్సెస్ కొట్టాడు. దుల్కర్ సల్మాన్ చేసిన లక్కీ భాస్కర్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు సూర్య హీరోగా సినిమా నిర్మిస్తున్నాడు నాగ వంశీ.
ప్రస్తుతం నాగ వంశీ వేరే భాషలో హీరోలను మాత్రమే తెలుగులో తీసుకొని సినిమాలు చేస్తున్నారు. అయితే తెలుగులో కళ్యాణ్ శంకర్ కు సెట్ చేయడానికి వేరే హీరో దొరకలేదా.? లేకపోతే కథలో ఉన్న ప్రాముఖ్యతను బట్టి కార్తీ ఆప్షన్ గా ఎంచుకున్నారా అనేది తెలియదు.
ఇక కార్తీ విషయానికి వస్తే తెలుగులో మంచి మార్కెట్ ఉంది అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తనకి కూడా తమిళ్ ఆడియన్స్ కంటే కూడా తెలుగు ఆడియన్స్ ఎక్కువ ఇష్టం అని పలు సందర్భాల్లో చెప్పాడు. ఏదేమైనా ఈ ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటన త్వరలో వస్తుంది.
Also Read: Ram Pothineni : దర్శకుడికి చెప్పకుండానే పాటను క్రియేట్ రాసేసిన రామ్.. డైరెక్షర్ రియాక్షన్ ఏంటంటే?