E-Paper
Advertisement

Ram Pothineni : నా ట్యాగ్ వేరే హీరో తన సినిమాలు వేసుకున్నాడు, రామ్ షాకింగ్ డెసిషన్

Ram Pothineni : నా ట్యాగ్ వేరే హీరో తన సినిమాలు వేసుకున్నాడు, రామ్ షాకింగ్ డెసిషన్
Advertisement

Ram Pothineni : ఇండస్ట్రీకి కొంతమంది హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత రోజులు గడుస్తున్న కొద్ది వాళ్ళ సినిమాలు చూస్తూ, వాళ్లకి కూడా సరిపడేటట్టు కొన్ని ట్యాగ్స్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇండస్ట్రీలో చాలామందికి ట్యాగ్ లు ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు ఇలా చెబుతూ పోతే ట్యాగ్స్ ఉన్నాయి.

దేవదాస్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రామ్. బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా అద్భుతమైన సక్సెస్ సాధించింది. ఆ తర్వాత తన కెరియర్ లో కొన్ని ప్రత్యేకమైన సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్లాడు. అయితే తను ఎంట్రీ ఇచ్చిన స్టార్టింగ్ లో కూడా తనకంటూ ఒక ట్యాగ్ వచ్చింది.

వేరే హీరో వాడుకున్నారు 

Advertisement

రామ్ పోతినేని వచ్చిన ట్యాగ్ నేమ్ ను వాళ్ల అభిమానులు కొన్ని సెలబ్రేషన్స్ లోనూ, అలానే కొన్ని పోస్టర్స్ పైన వేయడం మొదలుపెట్టారు. అయితే కొన్ని రోజులు తర్వాత అదే పేరును వేరే హీరో వాడుకున్నారట. అప్పుడు రామ్ కి కొంత ఆశ్చర్యం కలిగింది. ఆ హీరో ఆ పేరును వాడుకున్న తర్వాత రామ్ దానిని వాడుకోవడం మానేశారు.

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా చేసిన సినిమా ఇస్మార్ట్ శంకర్. ఆ సినిమా పూరి జగన్నాథ్ కెరీర్ కు స్ట్రాంగ్ కం బ్యాక్ అయింది. మరోవైపు రామ్ కి కూడా మంచి సక్సెస్ అందించింది. ఆ సినిమా తర్వాత ఎక్కువగా ఉస్తాద్ రామ్ పోతినేని అని పిలవడం మొదలుపెట్టారు. కొన్ని సినిమాలకు సంబంధించి కూడా ఇదే పేరు పడింది. ఇప్పుడు ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాకి సంబంధించి ఎనర్జిటిక్ హీరో రామ్ అంటూ పేరు పడుతుంది.

కొంతమంది తొలగించారు 

Advertisement

అయితే మొదట కమల్ హాసన్ తన ముందు ఉన్న పేరును తొలగించాలి అని ఒక స్పెషల్ నోట్ రిలీజ్ చేశారు. అయితే దానిని ఫాలో అవుతూ పెద్ది సినిమాకు సంబంధించి రామ్ చరణ్ కూడా గ్లోబల్ స్టార్ అనే పేరును తొలగించుకున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అని పెద్ది సినిమాకు పడుతుంది. ఇప్పుడు రామ్ కూడా అదే బాటలో నడుస్తున్నాడు అని కథనాలు కూడా వినిపించాయి.

అయితే వీళ్ళిద్దరిని చూసి మిగతా హీరోలు కూడా ఏమైనా చేంజ్ చేస్తారేమో చూడాలి. ఇక రామ్ నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా నవంబర్ 27న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. రామ్ ఈ సినిమాతో స్ట్రాంగ్ కం బ్యాక్ ఇస్తాడు అని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం వినిపిస్తుంది. అంటే సినిమాకి మంచి రిపోర్ట్ కూడా వస్తున్నట్లు తెలుస్తుంది.

Also Read: Naga Vamsi : తన కాంపౌండ్ డైరెక్టర్ కి మరో తమిళ్ హీరో సెట్ చేసిన నాగ వంశీ

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×