E-Paper
Advertisement

Ram Pothineni : దర్శకుడికి చెప్పకుండానే పాటను క్రియేట్ రాసేసిన రామ్.. డైరెక్షర్ రియాక్షన్ ఏంటంటే?

Ram Pothineni : దర్శకుడికి చెప్పకుండానే పాటను క్రియేట్ రాసేసిన రామ్.. డైరెక్షర్ రియాక్షన్ ఏంటంటే?
Advertisement

Ram Pothineni : ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరోలు కేవలం నటన మాత్రమే కాకుండా వాళ్లలో ఉన్న టాలెంట్స్ అన్నీ బయటకు తీస్తున్నారు. ముఖ్యంగా నటులుగా సినిమాలు చేస్తూ తమలోని రచయితకి కూడా పని చెబుతున్నారు. సిద్దు జొన్నలగడ్డ ఈరోజు మంచి గుర్తింపు సాధించుకున్నాడు అంటే దానికి కారణం తనలో ఉన్న రైటర్. అలానే కిరణ్ అబ్బవరం కూడా తనలోని రైటర్ ను ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమాకే బయటికి తీశాడు.

విశ్వక్సేన్ విషయానికి వస్తే తనలోని దర్శకుడు టాలెంట్ తాను తీసిన మొదటి సినిమాకే అర్థం అయిపోయింది. అయితే ప్రస్తుతం యంగ్ హీరో రామ్ పోతినేని కూడా తనలోని రైటర్ ను బయటకు తీశాడు. ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 20 ఏళ్లు అవుతున్నా కూడా తనలోని ఒక రైటర్ ఉన్నాడు అని ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా వచ్చినంత వరకు కూడా బయటపడలేదు. మొత్తానికి ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలోని రామ్ పోతినేని పాటను రాశాడు అన్నప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారు.

దర్శకుడికి చెప్పకుండానే 

Advertisement

రామ్ పోతినేని ఈ సినిమా గురించి డిస్కషన్ జరుగుతున్న తరుణంలో, పాట ఎలా ఉండాలి అని వీళ్ళ మధ్య విపరీతమైన డిస్కషన్ జరిగింది. అలా జరుగుతున్నప్పుడు నెక్స్ట్ డే రామ్ పోతినేని దర్శకుడు మహేష్ బాబుకు రెండు లైన్లు వినిపించారు. అయితే ఆ రెండు లైన్లకి మహేష్ బాబు బాగా ఫిదా అయిపోయాడు.

మనం ఈ పాటలో చెప్పాలనుకున్నది ఇదే సార్. చాలా బాగుంది ఎవర్ రాశారు అని అడిగారు. నేనే రాశాను అని సరదాగా నవ్వుతూ చెప్పాడు రామ్. మామూలుగా ఇలా అనుకున్నాను అని డైరెక్టర్ కి ఎక్స్ప్లెయిన్ చేశాడు. అది డైరెక్టర్ కి విపరీతంగా నచ్చడంతో, వర్క్ అవుట్ అవుతుంది అనిపించడంతో రామ్ పూర్తి పాటను రాసేశాడు.

ప్రేక్షకులు గురించి ఆలోచించారా?

Advertisement

అయితే రామ్ పోతినేని పాట రాయడం అనేది దర్శకుడు వరకు బాగానే ఉంటుంది. అలానే ఆ పాట ఫైనల్ గా ఆడియన్స్ కోసం రాస్తున్నారు కాబట్టి వాళ్లకు నచ్చుతుందా లేదా అనే ఆలోచన వాళ్ళల్లో కూడా ఉంటుంది. అయితే కేవలం పాట డైరెక్టర్ కు రామ్ కు మాత్రమే కాదు. అందరికీ నచ్చుతుంది అని ఆడియన్స్ గురించి ఆలోచించి ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పాడు దర్శకుడు మహేష్ బాబు.

మొత్తానికి పూర్తి పాట విన్న తర్వాత ఆడియన్స్ అందరికీ కూడా ఇంత మంచి పాటను రామ్ ఎలా రాయగలిగాడు అని ఒక క్లారిటీ వచ్చేసింది. ఒక ప్రొఫెషనల్ రైటర్ ఎలా అయితే ఈ సాంగ్ రాస్తారో అచ్చం సాహిత్యపు విలువలతో అదే స్థాయిలో పాటను పూర్తి చేశాడు రామ్. ఈ సినిమా కోసం కేవలం రామ్ పాట రాయడం మాత్రమే కాకుండా, మరో పాటను పాడటం కూడా చేశాడు. ఈ సినిమా నవంబర్ 27న ప్రేక్షకులు ముందుకు వస్తుంది.

Also Read: Andhra King Taluka : 2002 బ్యాక్ డ్రాప్ తో ఆంధ్ర కింగ్.. పర్టికులర్ గా ఆ ఏడాదే ఎందుకంటే?

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×