Nagachaitanya: అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య(Nagachaitanya) ఇటీవల తండేల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈయన తన తదుపరి సినిమా అని విరూపాక్ష దర్శకుడు కార్తీక్ వర్మ దండు(Karthik Varma Dandu) దర్శకత్వంలో మరో సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మైథాలజికల్ థ్రిల్లర్ జానెర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ప్రస్తుతం NC 24 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాలో నాగచైతన్యకు జోడిగా నటి మీనాక్షి చౌదరి (Meenakshi Chowdary)నటిస్తున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఈ సినిమా శర వేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమా నుంచి తాజాగా చిత్ర బృందం ఒక మేకింగ్ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. కొన్ని ఎకరాల విస్తీర్ణంలో వందలాదిమంది టెక్నీషియన్లు భారీ సెట్ నిర్మిస్తూ ఈ వీడియోలో కనిపించడంతో ఇక్కడ భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించబోతున్నారని తెలుస్తోంది. ఇక మీనాక్షి చౌదరి కూడా ఈ సినిమాలో సైంటిస్ట్ గా కనిపించబోతున్నట్లు ఇటీవల ఆమెకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేయడంతో స్పష్టమైనది.
ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇటీవల కాలంలో ప్రతి ఒక్క సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే నాగచైతన్య నటించబోతున్న ఈ సినిమా కూడా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని స్పష్టమవుతుంది. అయితే ఈ రెండు సినిమాలను దర్శకులు వెంటవెంటనే షూటింగ్ పనులను పూర్తి చేయబోతున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ విషయానికి సంబంధించి అధికారక ప్రకటన కూడా వెల్లడి కాబోతుందని తెలుస్తుంది.
పాన్ ఇండియా సినిమాగా NC 24?
ఇలా నాగచైతన్య సినిమా కూడా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందనే విషయం తెలియడంతో అభిమానులు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. ఇకపై సింగిల్ సినిమాలు బహుశా రావేమో ప్రతి ఒక్క సినిమాకు ఇలా సీక్వెల్స్ వస్తూనే ఉంటాయా అంటూ సందేహాలను వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇక నాగచైతన్య ఈ సినిమా విషయానికి వస్తే.. సుకుమార్ రైటింగ్స్ తో కలిపి బీవీ ఎస్ ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రాబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాకు కాంతార సినిమా ఫేమ్ మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోకనాథ్ సంగీతం అందించబోతున్నారు. ఇక ఈ సినిమాలో ఇతర నటీనటులు ఎవరు? ఈ సినిమా టైటిల్ ఏంటి అనే వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
Also Read: Bigg Boss 9 Telugu Promo: తల్లిని చూసి కన్నీళ్లు పెట్టుకున్న ఇమ్మూ.. హీరోగా బయటకు రావాలంటూ!