E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu Promo: తల్లిని చూసి కన్నీళ్లు పెట్టుకున్న ఇమ్మూ.. హీరోగా బయటకు రావాలంటూ!

Bigg Boss 9 Telugu Promo: తల్లిని చూసి కన్నీళ్లు పెట్టుకున్న ఇమ్మూ.. హీరోగా బయటకు రావాలంటూ!
Advertisement

Bigg Boss 9 Telugu Promo: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కార్యక్రమం 11వ వారంలోకి అడుగు పెట్టింది ఇక 11వ వారం ఫ్యామిలీ వీక్(Family Week) కావడంతో ఈ వారం మొత్తం ఎలాంటి గొడవలు కొట్లాటలు లేకుండా కంటెస్టెంట్ లకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్కరు హౌస్ లోకి రావడంతో ఈవారం మొత్తం బిగ్ బాస్ హౌస్ లో చాలా ఎమోషనల్ గా కొనసాగిందని చెప్పాలి. ఇక నేడు జరగబోయే ఈ కార్యక్రమంలో భాగంగా హౌస్ లోకి ఇమ్మానియేల్ మదర్ వచ్చారని తాజాగా విడుదల చేసిన ప్రోమో చూస్తేనే తెలుస్తోంది. ఇలా ఇమ్మూ మదర్ హౌస్ లోకి అడుగు పెట్టడంతో ఒక్కసారిగా తల్లిని చూసేసరికి ఇమ్మూ ఎంతో ఎమోషనల్ అయ్యారు.

కమెడియన్ గా కాదు.. హీరోగా బయటకు రావాలి

ఇకపోతే ఇమ్మానియేల్ (Emmanuel) తల్లి పట్టీల శబ్దం విని ఆ పట్టీలు అమ్మకు నేనే కొనిచ్చాను. తన వేసుకున్న బంగారు గాజులు కూడా నేనే కొనిచ్చాను అంటూ ఎంతో సంతోషంగా తెలిపారు. ఇక ఈమె తన కొడుకుతో పర్సనల్ గా మాట్లాడుతూ నేను ఏ బంగారాన్ని అయితే అప్పుడు వద్దు అనుకున్నానో అదే బంగారం పేరు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో మారుమోగుతోంది అంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఇక బిగ్ బాస్ హౌస్ లోకి నువ్వు ఒక కమెడియన్ గా అడుగు పెట్టావు కానీ బయటకు వచ్చేటప్పుడు మాత్రం హీరోగా రావాలి అంటూ తన కొడుకును ఎంతో ప్రోత్సహిస్తూ మాట్లాడారు.

అమ్మ కోసం పాట పాడిన ఇమ్మూ..

Advertisement

ఇక ఈ ప్రోమోలో భాగంగా ఇమ్మూ తన తల్లిని చూసి కన్నీళ్లు పెట్టుకునేసరికి ఆమె తనని ఓదార్చారు నువ్వు ఏడిస్తే మేము మా ఎనర్జీని కోల్పోతాము చాలా ధైర్యంగా ఆడు అంటూ ప్రోత్సహించారు. అలాగే టాస్కులు ఆడేటప్పుడు జాగ్రత్త.. నువ్వు ఇక్కడ కింద పడిపోతే నాకు దెబ్బ తగులుతుంది అంటూ తన బాధను కూడా బయట పెట్టడంతో ఈ ప్రోమో కాస్త ఎమోషనల్ గా కొనసాగింది. ఇక బయటకు వచ్చిన తర్వాత ఇతర కంటెస్టెంట్లతో కూడా ఈమె ఎంతో సరదాగా మాట్లాడుతూ అందరిని నవ్వించే ప్రయత్నం చేశారు. ఇక ఇమ్మూ తన అమ్మకోసం అద్భుతమైన పాటను ఆలపించారు.

Advertisement

ఇక ఈ రోజు జరగబోయే ఈ కార్యక్రమంలో భాగంగా ఇమ్మానియేల్ కోసం తన తల్లి ఊహించని సర్ప్రైజ్ తీసుకువచ్చినట్టు తెలుస్తుంది. అదేంటో తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారం కావాల్సిందే. ఇక ఈవారం నామినేషన్ లో భాగంగా ఆరుగురు కంటెస్టెంట్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఆరుగురులో ఇమ్మానియేల్ కూడా నామినేషన్ లో ఉండటం విశేషం. బిగ్ బాస్ కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి ఇమ్మానియేల్ నామినేషన్స్ లో లేకుండా వస్తున్నారు.. అయితే ఈ వారం ఈయన నామినేషన్ లో ఉండటం గమనార్హం. మరి ఈ వారం హౌస్ నుంచి బయటకు వచ్చే కంటెస్టెంట్లు ఎవరు? ఎవరు సేఫ్ జోన్ లో ఉండబోతున్నారు? ఈవారం కెప్టెన్ ఎవరు అనే తదితర విషయాలు తెలియాల్సి ఉంది.

Also Read: Jaya Krishna debut Film: జయకృష్ణ అజయ్ భూపతి సినిమా టైటిల్ ఇదే… విలన్ గా టాలీవుడ్ స్టార్?

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×