E-Paper
Advertisement

Akkineni nagarjuna: నాగ్ 100వ సినిమాకు ‘తమిళ’ దెబ్బ? అక్కినేని ఫ్యాన్స్‌లో టెన్షన్

Akkineni nagarjuna: నాగ్ 100వ సినిమాకు ‘తమిళ’ దెబ్బ? అక్కినేని ఫ్యాన్స్‌లో టెన్షన్
Advertisement

Akkineni nagarjuna: టాలీవుడ్ ‘మన్మధుడు’ కింగ్ నాగార్జున అంటేనే ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్. కానీ, ఇప్పుడు ఆ ప్రయోగమే అక్కినేని అభిమానుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 100వ సినిమాను ఒక పరభాషా దర్శకుడి చేతిలో పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అసలు రా కార్తిక్ రీసెంట్ రిజల్ట్ చూశాక.. నాగ్ తీసుకున్న నిర్ణయం కరెక్టేనా? ఫ్యాన్స్ ఆందోళన వెనుక ఉన్న అసలు కారణం ఏంటి?

నాగ్ రిస్క్ చేస్తున్నారా?

Advertisement

టాలీవుడ్‌లో ఇప్పుడు ఒక వింత ట్రెండ్ నడుస్తోంది. మన దగ్గర టాలెంటెడ్ దర్శకులు క్యూలో ఉన్నా, మన హీరోలు మాత్రం పక్క రాష్ట్రం దర్శకులపై మోజు పడుతున్నారు. తాజాగా ‘కింగ్’ నాగార్జున తీసుకున్న ఈ నిర్ణయం అక్కినేని అభిమానులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ముఖ్యంగా రా కార్తిక్ రీసెంట్ మూవీ ‘మేడ్ ఇన్ కొరియా’ రిజల్ట్ చూశాక.. ‘నాగ్ రిస్క్ చేస్తున్నారా?’ అనే ప్రశ్నలు గట్టిగా వినిపిస్తున్నాయి.

మేడ్ ఇన్ కొరియా’.. ఎమోషన్స్ మిస్సయ్యాయా?

Advertisement

నిజానికి ‘మేడ్ ఇన్ కొరియా’పై భారీ అంచనాలే ఉన్నాయి. కానీ థియేటర్లలోకి వచ్చాక సీన్ రివర్స్ అయింది. విజువల్స్ గ్రాండ్‌గా ఉన్నా.. కథలో ఉండాల్సిన అసలైన ఎమోషన్స్ ప్రేక్షకులకు రీచ్ కాలేదు. కథనాన్ని నడిపించడంలో దర్శకుడు తడబడ్డారని, సీన్లు సహజత్వానికి దూరంగా ఉన్నాయన్న విమర్శలు వచ్చాయి. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా చతికిలపడటంతో.. ఇప్పుడు అందరి చూపు నాగ్ 100వ సినిమాపై పడింది.

100వ సినిమా అంటే ‘శివ’ రేంజ్ లో ఉండాలి కానీ..

ఏ హీరోకైనా 100వ సినిమా అనేది ఒక ఎమోషన్. అది చరిత్రలో నిలిచిపోవాలి. నాగార్జున అంటే ‘శివ’, ‘అన్నమయ్య’ వంటి ట్రెండ్ సెట్టర్లకు కేరాఫ్ అడ్రస్. మన తెలుగు నేటివిటీని, నాగ్ బాడీ లాంగ్వేజ్‌ను అర్థం చేసుకునే యంగ్ డైరెక్టర్లు మన దగ్గర చాలా మంది ఉన్నారు. అలాంటి వారిని కాదని, పక్క రాష్ట్రం నుంచి వచ్చి మన దగ్గర ప్రయోగాలు చేసే వారికి ఇంత పెద్ద మైలురాయిని అప్పగించడం అవసరమా? అన్నది ఫ్యాన్స్ సూటి ప్రశ్న.

రా కార్తిక్ పై నమ్మకం ఉందా? 

100వ సినిమా అంటే ఒక ఉత్సవంలా ఉండాలి కానీ, అది ఒక ‘ప్రయోగశాల’గా మారకూడదు. నాగార్జున జడ్జిమెంట్ మీద నమ్మకం ఉన్నా.. దర్శకుడి రీసెంట్ ట్రాక్ రికార్డ్ మాత్రం టెన్షన్ పెడుతోంది. మరి రా కార్తిక్ తన పాత తప్పులను సరిదిద్దుకుని నాగ్ ఫ్యాన్స్‌కు గుర్తుండిపోయే హిట్ ఇస్తారో లేదో చూడాలి.

read also: చిరు, వెంకీలకు ‘లైఫ్’ ఇచ్చిన యాంగ్రీ యంగ్ మ్యాన్

Related News

చిరు ‘కాకా’ వాయిదా రూమర్లపై క్లారిటీ .. సంక్రాంతి పోటీకి సై అంటూ!

సౌందర్య మరణంపై స్టార్ హీరో ఎమోషనల్ కామెంట్స్!

రాకాను వెంటాడుతున్న వరుస లీకులు.. కథ మొత్తం లీక్ చేసేస్తారా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘కృష్ణంభజే’ నుండి ఫస్ట్ లుక్ లాంఛ్ !

సంక్రాంతి రేస్ నుంచి చిరంజీవి ‘కాకా’ ఔట్? నిజమేనా?

ఇరుముడి సినిమాకు భారీ షాక్…ప్రొజెక్టర్ ద్వారా వీధుల్లో ప్రదర్శనలు!

భార్యను కలవబోతున్న సీఎం విజయ్…త్రిష సైడ్ అవ్వాల్సిందేనా?

రజినీ జైలర్ 2 కథ ఇదేనా? ఈసారి టార్గెట్ ఎవరో తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×