E-Paper
Advertisement

Nagarjuna: నాగ్ 100వ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. సెంటిమెంట్ రిపీట్ అయిందో హ్యాట్రిక్ గ్యారెంటీ!

Nagarjuna: నాగ్ 100వ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. సెంటిమెంట్ రిపీట్ అయిందో హ్యాట్రిక్ గ్యారెంటీ!
Advertisement

Nagarjuna:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ సీనియర్ స్టార్ హీరోలుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే వీరిలో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వరుస పెట్టి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంటే నాగార్జున మాత్రం హీరోగా సినిమాలు చేయకుండా క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలతో కెరియర్ ను కొనసాగిస్తున్నారు. దీంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తూ.. హీరోగా సినిమా చేయాలని గత కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి తోడు మిగతా ముగ్గురు హీరోల సినీ కెరీర్ లో 100 కోట్ల బ్లాక్ బస్టర్ చిత్రాలు కూడా లిస్టులోకి వచ్చేసాయి. కానీ నాగార్జున మాత్రం ఇప్పటివరకు ఆ టార్గెట్ ను రీచ్ అవలేదు. ఈ నేపథ్యంలోనే అటు అభిమానుల కోరిక మేరకు ఇటు వందకోట్ల క్లబ్ లో చేరడానికి తన వందవ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు నాగార్జున.

నాగార్జున 100వ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్..

ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ రా. కార్తీక్ దర్శకత్వంలో తన 100వ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రానికి ‘ 100 నాటౌట్’ లేదా ‘లాటరీ కింగ్’ అనే టైటిల్స్ ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించిన ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు విషయంలోకి వెళ్తే.. గతంలో విక్రమ్, మనం వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్ విజయాలను సొంతం చేసుకున్న నాగార్జున..ఆ సినిమాల విడుదల తేదీ రోజునే తన 100వ చిత్రాన్ని కూడా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట.

Advertisement

also read:Ayalaan: ఫైనల్లీ ఓటీటీలోకి వచ్చేస్తున్న అయలాన్ తెలుగు వెర్షన్… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా?

మే 23వ తేదీన వచ్చిన ఈ రెండు చిత్రాలు కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు అదే డేట్ రోజున తన 100వ చిత్రాన్ని కూడా విడుదల చేసి సెంటిమెంటుతోనే హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు నాగార్జున. మరి నాగార్జునకు ఈ సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందా ఒకవేళ ఈ ఏడాది మే 23న ఈ సినిమాను విడుదల చేస్తే ఆ సినిమా ఫలితం ఎలా ఉండనుంది? కచ్చితంగా ఈ సినిమాతో నాగార్జున 100 కోట్ల క్లబ్ లో చేరిపోతాడా..? ఈయనను హీరోగా మళ్లీ తెరపై చూడాలని ఆకలి మీద ఉన్న అభిమానులకు విందు భోజనం తినిపిస్తాడా ? అనే విషయాలు తెలియాలి అంటే సినిమా విడుదల అయ్యేవరకు ఎదురుచూడాల్సిందే.

నాగార్జున సినీ కెరియర్:

Advertisement

నాగార్జున విషయానికి వస్తే ఒకవైపు బిగ్ బాస్ వంటి కార్యక్రమాలకు హోస్ట్గా వ్యవహరిస్తూనే మరొకవైపు స్టార్ హీరోల సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలా ధనుష్, శేఖర్ కమ్ముల కాంబినేషన్లో వచ్చిన కుబేరా సినిమాలో నటించిన ఈయన.. రజినీకాంత్ హీరోగా నటించిన కూలీ సినిమాలో కీలక పాత్ర పోషించి ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు హీరోగా తన వందవ చిత్రంతో ఈ ఏడాది ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు నాగార్జున. మరి ఈ సినిమా ఆయనకు ఇండస్ట్రీలో ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×