E-Paper
Advertisement

Nagarjuna: నాగార్జున లగ్జరీ హౌస్ చూశారా.. ప్రత్యేకతలు తెలిస్తే ఔరా అనాల్సిందే!

Nagarjuna: నాగార్జున లగ్జరీ హౌస్ చూశారా.. ప్రత్యేకతలు తెలిస్తే ఔరా అనాల్సిందే!
Advertisement

Nagarjuna: సామాన్యులను మొదలుకొని సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కల కచ్చితంగా ఉంటుంది. ఈ కలను నెరవేర్చుకోవడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు. అంతేకాదు సొంత ఇల్లు ఉండాలనే కల మాత్రమే కాదు.. ఆ ఇంటిని తమకు నచ్చినట్టుగా ప్రత్యేకంగా డిజైన్ చేయించుకుంటూ.. ఆ ప్రత్యేకతలతో అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. ఇప్పటికే హీరో రిషబ్ శెట్టి (Rishabh Shetty) కూడా తన అభిరుచికి తగ్గట్టుగా తన ఇంటిని నిర్మించుకోవడమే కాకుండా ఆ ఇంటిలో ఏర్పాటుచేసిన అధునాతన టెక్నాలజీని, సాంప్రదాయాన్ని కలగలుపుతూ రూపొందించిన ప్రత్యేకతలు అందరిని ఆకట్టుకుంటున్నాయి.

రాజభవనంలో నాగార్జున..

ఇప్పుడు అలాంటి ప్రత్యేకతలతో టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున కూడా అందరి చేత ఔరా అనిపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన తన భార్య కొడుకులతో కలిసి నివసిస్తున్న ఆ ఇల్లు, దాని ప్రత్యేకతలు తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి అసలు విషయంలోకి వెళ్తే.. “హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో రూ.45 కోట్ల విలువైన విలాసవంతమైన రాజ భవనంలో నాగార్జున తన భార్య, కుటుంబంతో నివసిస్తున్నారు. 4వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ రాజభవనంలో సుమారుగా 2 కోట్ల విలువైన చేతితో తయారుచేసిన పాలరాయి ఇంటీరియర్ తో పాటు 80 లక్షల విలువైన ఫర్నిచర్ ను ఏర్పాటు చేశారు.

ప్రత్యేకతలు ఏంటంటే?

Advertisement

గ్రౌండ్ ఫ్లోర్ లో నలుగురితో టైం స్పెండ్ చేయడానికి లివింగ్ రూమ్, అత్యాదనిక టెక్నాలజీతో రూపొందించిన కిచెన్ అలాగే జిమ్ సెంటర్లు ఆ ఇంట్లోనే ఏర్పాటు చేశారు. పై అంతస్తులో బెడ్ రూమ్ లతో పాటు గెస్ట్ రూమ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇకపోతే ఈ బంగ్లాలో చాలా విశాలవంతమైన గార్డెన్ ఏరియా.. ఆ ఇంటికి ప్రత్యేక ఆకర్షణను అందిస్తోంది. ఇక స్విమ్మింగ్ పూల్, ఆకట్టుకునే మెట్లు, వరండా అన్నీ కూడా జూబ్లీహిల్స్ లో ఉన్న నాగార్జున ఇంటిని ఒక కళాఖండంగా మార్చేశాయి. అంతేకాదు ఈ ఇల్లుని చూస్తే నాగార్జున ఎంపికలు, ఆయన అభిరుచి ఏ విధంగా ఉందో స్పష్టంగా ప్రతిబింబిస్తోంది. అలా మొత్తానికి అయితే తన అభిరుచికి తగ్గట్టుగా ఆ ఇంటిని డిజైన్ చేయించుకున్నారు నాగార్జున.

ALSO READ:Adivi Shesh: తొలిసారి డాన్స్ చేశా.. ఇదెక్కడి ట్విస్ట్ గురూ.. అంటే ఇన్ని రోజులూ!

నాగార్జున కార్ కలెక్షన్స్..

Advertisement

నాగార్జున దగ్గర ఉండే కార్ కలెక్షన్స్ విషయానికి వస్తే.. ఇంటి పై తన అభిరుచిని చూపించుకోవడమే కాకుండా లగ్జరీ కార్లను కూడా కొనుగోలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు నాగార్జున. నాగార్జున దగ్గర ఉండే కార్ కలెక్షన్స్ విషయానికి వస్తే రూ.1.5 కోట్ల విలువైన బీఎండబ్ల్యూ 7 సిరీస్, రూ .7కోట్ల విలువైన రేంజ్ రోవర్ వోగ్, రూ.1.75 కోట్ల విలువైన బీఎండబ్ల్యూ M6, కోటి రూపాయల విలువైన ఆడి A7 వంటి కార్లు ఆయన కార్ గ్యారేజ్ లో ఉన్నాయి. ఇక కేరళ బ్లాస్టర్స్ ఎఫ్ సి కి సహా యజమానిగా ఉన్న ఈయనకు పలు బ్రాండ్ ఎండార్స్మెంట్ లు కూడా ఉన్నాయి. సినిమాలు అటు బిగ్ బాస్ వంటి కార్యక్రమాలతో కూడా భారీగా సంపాదిస్తున్నారు నాగార్జున.

Related News

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

లక్కీ భాస్కర్ 2… వెంకీ అట్లూరి బిగ్ అప్డేట్!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ఓజీ యూనివర్స్’ నుంచి స్పెషల్ ట్రీట్!

రూ.200 కోట్ల క్లబ్ లోకి ఇరుముడి.. అయ్యప్పగా మణెమ్మ!

Big Stories

Advertisement
×